Important advice
-
నిత్యం ఫాలో కావాల్సిన జీవిత సత్యాలు : చెప్పైనా,మనిషైనా బాధిస్తోంటే..!
జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ఖచ్చితమైన సూత్రాలను పాటించాలి. వివేకానందుడు చెప్పినట్టు సుఖదు:ఖాలు నాణేనికి రెండు పార్శాలు లాంటివి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే నడవదు. విశ్వంలో ప్రతి అంశం తార్కిక ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి తార్కిక ఆలోచనలతో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి. నిశితంగా పరిశీలించి అర్థం చేసుకొని, జీవితానికి అన్వయం చేసుకొని సాగిపోవాలి. ఉదాహరణకు అమృత బిందువుల్లాంటి ఈ విషయాలను గమనించండి! కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అయినవారి ఎదుట అబద్ధం చెప్పకు.అనుభవం ఎదిగిన అభిప్రాయాన్ని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది.‘తప్పు చేయడానికి ఎవరూ భయపడరు. కానీ చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం భయపడతారు.జీవితంలో వయసు ఉన్నప్పుడే చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు.‘ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం గురించి తెలుసుకునే తెలివి ఉండదు.వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం ఏమిటో తెలుస్తుంది.గణితం చదివితే లెక్క తెలుస్తుంది. లోకం చదివితే ఎలా బతకాలో తెలుస్తుంది.కాలికున్న చెప్పులైనా మనతో ఉన్న మనుషులైనా నొప్పిని, బాధను కలిగిస్తున్నారంటే, సరిపోయేవి కావని అర్థం. ఇదీ చదవండి: మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం! -
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు ఇవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి
-
ఫేస్బుక్ వినియోగదారులకు ముఖ్య సూచనలు
ఫేస్బుక్ వినియోగదారులలో కొందరు అందులో పోస్ట్ చేసే వార్తలు, వ్యాఖ్యలు, ఫొటోలపై తమ అభిప్రాయాలు రాస్తుంటారు. వారిలో కొందరు సభ్యత, సంస్కారం, మంచి, మర్యాద మరచి చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన భాష వాడుతుంటారు. ఎవరైనా తమ వ్యతిరేకతని మర్యాద కూడా తెలియజేయవచ్చు. ఎంతటి తీవ్రమైన వ్యతిరేకతనైనా తెలియజేయడానికి, విమర్శించడానికి చక్కటి తెలుగు పదాలు ఉన్నాయి. మరికొందరు లైక్(ఇష్టం) కొట్టి వదిలేస్తుంటారు. విషాదకరమైన వార్తలకు, ఫొటోలకు కూడా కొందరు లైక్ కొడుతుంటారు. వాస్తవానికి వారు తెలియక అలా కొడుతూ ఉండవచ్చు. హృదయవిదారకమైన సంఘటలకు కూడా అలా లైక్ కొడుతుంటారు. రోడ్డు ప్రమాదాల వార్తలు, అటువంటి ఫొటోలు, దోపిడీలు, అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు....వంటి వార్తలకు కూడా లైక్ కొడుతుంటారు. ఒక వ్యక్తి తన తండ్రి చనిపోయినట్లు తెలియజేయటానికి ఆ వివరాలు పోస్ట్ చేస్తే, అతని స్నేహితులు దానికి కూడా లైక్ కొడుతుంటారు. ఇందుకు ఈరోజు జరిగినదే ఒక ఉదాహరణ: ప్రఖ్యాత చిత్రకారుడు, సాహితీవేత్త, కార్టూనిస్ట్, సినిమా నిర్మాత, దర్శకుడు బాపు ఈరోజు మధ్యాహ్నం మృతి చెందారు. తెలుగు జాతి గర్వించదగిన గొప్ప వ్యక్తి బాపు. అటువంటి బాపు మరణ వార్తకు ఇప్పటికే 550 మంది లైక్ కొట్టారు. కారులో కన్నుమూసిన పసిపాప అనే వార్తకు 60 మంది లైక్ కొట్టారు. అంటే వాటి అర్ధం ఏమిటి? వారు అటువంటి వార్తలను ఇష్టపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇక నుంచి ఒక వార్తకు, ఫొటోకు లైక్ కొట్టే ముందు ఒక్కసారి ఆలోచించి కొట్టడం మంచిది. -శిసూర్య