అనేకమంది యువతీ యువకుల కన్నులు పాపంతో నిండి వున్నాయి. ఈ విషయంలో యేసుప్రభువు తన కొండమీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడని, సాధారణంగా కామం కంటిచూపుతోనే మొదలవుతుందన్నారు. శోధన అంతర్గతంగా బయలుదేరుతుంది. తర్వాత కార్యరూపం దాలుస్తుంది. కనుక కంటిని ఎంతో పవిత్రంగా కాపాడు కోవాలి. దేహానికి, ఆత్మకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయూ వెలుగు మయమై వుండును. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటిమయమవునని వాక్యం బోధిస్తున్నది (లూకా 11:33–34).
ఒకరోజు యేసుప్రభువువారు గతిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని–నన్నువెంబడించుమని అతనికి చెప్పాడు.. ఫిలిప్పు నతనయేలును కనుగొని–ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానియేలు–నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడగ్గా –వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. యేసు నతానియేలు తన వద్దకు రావడం చూసి యితడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కటము లేదు. నన్ను నీవు ఎలాగైనా ఎరుగుదువని నతానియేలు యేసును అడగ్గా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు అంజూరపు చెట్టుకింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అతనితో చెప్పాడు. నతానియేలు –బోధకుడా! నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసుక్రీస్తు అంజూరపు చెట్టుకింద కూర్చున్నావని చెప్పినందుకు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యక్రమాలు చూస్తావని అతనితో చె΄్పాడు. ఆయన (యేసు ప్రభువువారు) – మీరు ఆకాశం తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయు, దిగుటయు చూస్తారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని అన్నాడు (యోహాను 1:43–51).
కనుక మనకు ఇంత సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి వున్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్తయైన యేసుప్రభువు వైపు చూసి పందెంలో ఓపికతో పరుగెత్తవలెను. మీరు ΄ాపంతో ΄ోరాడటానికి రక్తం కారునంతగా ఎదిరింపలేరు. ఇంకో సంగతి నా కుమారులారా! ప్రభువు వేయు శిక్షను తృణీకరించవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించును.. అని కుమారులతో మాట్లాడినట్లు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు.
మనం శరీర సంబంధీకులైన తలిదండ్రులతో భయభక్తులతో ఉన్నాడు కానీ, ఆత్మలకు తండ్రియైన దేవునికి మరింత ఎక్కువగా లోబడి బతుకవలెనని, అట్టి భయభక్తులు దేవునియందు కలిగి ఉండి, మంచిగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది (హెబ్రీ 12:1 –10). కనుక ఆ విధంగా ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొందురు గాక.
– కోట బిపిన్ చంద్రపాల్
Comments
Please login to add a commentAdd a comment