
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య కరోనా భారీన పడ్డారు. ఆమె ఉత్తరఖండ్ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు రేఖా ఆర్య ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, డాక్టర్ల సమక్షంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత వారం రోజులుగా తనతో కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంత్రితో పాటు ఆమె భర్త, ముగ్గురు పిల్లలకి వైరస్ సోకింది.
मेरी कोरोना टेस्ट रिपोर्ट पॉजिटिव आई है। मैं एसिम्प्टमैटिक हूँ और कोई परेशानी नहीं है । डॉक्टर्स की निगरानी में मैंने स्वयं को आइसोलेट कर लिया है। आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे निकट संपर्क में आयें हैं, कृपया सावधानी बरतें और अपनी जाँच करवाएं।
— Rekha Arya (@rekhaaryaoffice) December 12, 2020