Rekha Arya
-
మంత్రి రేఖ ఆర్యకు కరోనా పాజిటివ్
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య కరోనా భారీన పడ్డారు. ఆమె ఉత్తరఖండ్ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. కరోనా టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు రేఖా ఆర్య ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని, డాక్టర్ల సమక్షంలో ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత వారం రోజులుగా తనతో కలిసిన వారు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంత్రితో పాటు ఆమె భర్త, ముగ్గురు పిల్లలకి వైరస్ సోకింది. मेरी कोरोना टेस्ट रिपोर्ट पॉजिटिव आई है। मैं एसिम्प्टमैटिक हूँ और कोई परेशानी नहीं है । डॉक्टर्स की निगरानी में मैंने स्वयं को आइसोलेट कर लिया है। आप में से जो भी लोग गत कुछ दिनों में मेरे निकट संपर्क में आयें हैं, कृपया सावधानी बरतें और अपनी जाँच करवाएं। — Rekha Arya (@rekhaaryaoffice) December 12, 2020 -
మహిళా మంత్రి.. సైకిల్ ర్యాలీ
డెహ్రడూన్: జాతీయ హైవేలను కోరుకుంటున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. కేంద్రానికి కొత్త పద్దతిలో తమ అవసరాలను తెలియజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 17న డెహ్రడూన్ నుంచి హరిద్వార్‌కు 500 మంది మహిళలతో సైకిల్ ర్యాలీ చేయించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ర్యాలీకి మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రకి రేఖ ఆర్య నాయకత్వం వహిస్తారు. మొత్తం 55 కి.మీ. మేర ఈ సైకిల్ యాత్ర జరుగుతుంది. డెహ్రడూన్- హరిద్వార్ మార్గంలో పలు పరిశ్రమలు ఉండడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ఈ మార్గంలో జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. -
బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలు జంప్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్షకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ మెజార్టీ నిరూపించుకుంటారని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంతో ఉండగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖ ఆర్య షాక్ ఇచ్చారు. సోమవారం నుంచి కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలో ఉన్న రేఖ పార్టీ ఫిరాయించారు. ఆమె కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు. మంగళవారం రేఖ ఆర్య బీజేపీ సభ్యులతో కలసి అసెంబ్లీ వద్ద ప్రత్యక్షమయ్యారు. ఆమె హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య ఆ పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. ఆయన హరీశ్ రావత్ తో కలసి అసెంబ్లీకి వచ్చారు. భీమ్ లాల్ కాంగ్రెస్ కు ఓటు వేశారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బీఎస్పీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరితో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ ఈ రోజు బలపరీక్ష నిర్వహించారు. బలపరీక్ష వివరాలను సీల్డు కవర్లో సుప్రీం కోర్టుకు సమర్పించనున్నారు. బుధవారం సుప్రీం కోర్టు అధికారికంగా బలపరీక్ష వివరాలను ప్రకటించనుంది. కాగా ఓటింగ్‌లో తామే గెలిచినట్టు హరీశ్ రావత్ ప్రకటించారు.