మహిళా మంత్రి.. సైకిల్‌ ర్యాలీ | uttarakhand minister cycle rally | Sakshi
Sakshi News home page

మహిళా మంత్రి.. సైకిల్‌ ర్యాలీ

Published Sat, Sep 9 2017 2:14 PM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

మహిళా మంత్రి.. సైకిల్‌ ర్యాలీ

మహిళా మంత్రి.. సైకిల్‌ ర్యాలీ

డెహ్రడూన్‌: జాతీయ హైవేలను కోరుకుంటున్న ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. కేంద్రానికి కొత్త పద్దతిలో తమ అవసరాలను తెలియజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 17న డెహ్రడూన్‌ నుంచి హరిద్వార్‌కు 500 మంది మహిళలతో సైకిల్‌ ర్యాలీ చేయించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ర్యాలీకి మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రకి రేఖ ఆర్య నాయకత్వం వహిస్తారు. మొత్తం 55 కి.మీ. మేర ఈ సైకిల్‌ యాత్ర జరుగుతుంది. డెహ్రడూన్‌‌- హరిద్వార్‌ మార్గంలో పలు పరిశ్రమలు ఉండడంతో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోంది. అందువల్ల ఈ మార్గంలో జాతీయ రహదారి ఏర్పాటు చేయాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement