బుల్లితెర నటి వైష్ణవి రామిరెడ్డి పెళ్లి చేసుకున్నాక నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ వీడియోలతో నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఇటీవలే ఆమె తల్లి కాబోతున్న శుభవార్తను అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే!
తాజాగా తనకు సీమంతం జరగ్గా అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. పింక్ కలర్ పట్టు చీరలో మెరిసిపోతున్న వైష్ణవి ముఖం కళకళలాడుతోంది. ఈ ఫోటోస్ చూసిన నెటిజన్లు నటికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా గతేడాది సురేశ్ అనే వ్యక్తిని పెళ్లాడింది వైష్ణవి. సెప్టెంబర్‌లో తాను గర్భవతినన్న విషయాన్ని బయటపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment