చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
కరీంనగర్: పరీక్షల్లో ఫెయిల్‌కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాలు.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు గమనించి హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తండ్రి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment