
కరీంనగర్: డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో మండలంలోని మద్దులపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని పూసల వైష్ణవి (20) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పూసల రాజేశం కూతురు వైష్ణవి కరీంనగర్‌లోని ఓ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.
డిగ్రీ ఫస్టియర్ ఫస్ట్ సెమ్, సెకండియర్‌లో సెకండ్ సెమిస్టర్‌లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన వైష్ణవి ఆదివారం రాత్రి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.