తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీకి సమీపంలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఓ విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన వైష్ణవి తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్శిటీలో ఎం.కాం ఫైనల్ ఇయర్ చదువుతోంది.
కాగా ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండేదని హాస్టల్ లోని ఆమె స్నేహితులు,సిబ్బంది తెలిపారు. రెండు రోజుల క్రితమే ఆమె తన సొంత ఊరికి వెళ్ళి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి వైష్ణవి కాలేజీకి కూడా సరిగ్గా వెళ్ళేది కాదని తోటి విద్యార్థినులు తెలిపారు. ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.