మంచి సందేశంతో ‘మహీష’ | Mahisha Movie Teaser Success Meet | Sakshi

మంచి సందేశంతో ‘మహీష’

Oct 2 2024 6:12 PM | Updated on Oct 2 2024 6:12 PM

Mahisha Movie Teaser Success Meet

ప్రవీణ్ కె.వి., యషిక, పృథ్వీరాజ్, వైష్ణవి, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మహీష". ఈ చిత్రాన్ని స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ప్రవీణ్ కేవి రూపొందిస్తున్నారు. మహీష సినిమా సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో దర్శకుడు, హీరో ప్రవీణ్ కె.వి. మాట్లాడుతూ - చిన్న సినిమాలు ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేయడం కష్టం. మీ మీడియా సపోర్ట్ ఉంటేనే అది సాధ్యం. రీసెంట్ గా రిలీజ్ చేసిన మా మూవీ టీజర్ కు దాదాపు రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది పెద్ద నెంబర్ కాకపోవచ్చు కానీ మా మహీష సినిమా టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని చెప్పేందుకు ఈ వ్యూస్ నిదర్శనం. మా సినిమాలో విలన్ గా చేసిన విజయ్ రాజ్ గారికి మంచి పేరొస్తుంది. మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీగా ఉన్నాం. త్వరలోనే మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తాం. మహీష సినిమాలో మంచి మేసేజ్ తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది’ అన్నారు.  ప్రెజెంట్ మహిళల మీద జరుగుతున్న ఘటనల అంశాలతో పాటు ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్  ఈ చిత్రంలో ఉన్నాయని అన్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ శ్రీవెంకట్‌. ‘మహీష మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటిగా నాకు ఈ సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు నటి శ్రీలత. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement