సీరియల్‌లో హెల్మెట్‌ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్‌ కట్టాల్సిందే! | Kannada Actress Vaishnavi Gowda Fined Traffic Violation Scene In Serial | Sakshi
Sakshi News home page

హమ్మా.. అంతా మీ ఇష్టమేనా? సీరియల్‌ అయితేనేం! చలాన్‌ కట్టు!

Published Fri, May 17 2024 7:15 PM | Last Updated on Fri, May 17 2024 7:38 PM

Kannada Actress Vaishnavi Gowda Fined Traffic Violation Scene In Serial

రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌ వేస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ సీరియల్‌లో ఓ నటి హెల్మెట్‌ పెట్టుకోకుండా స్కూటీ నడపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ అదేం సీరియల్‌? ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసుల రియాక్షనేంటో చూసేద్దాం..

హెల్మెట్‌ లేకుండా..
కన్నడలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో సీతారామ ధారావాహిక ఒకటి. ఈ సీరియల్‌లోని ఓ ఎపిసోడ్‌లో నటి వైష్ణవి గౌడ స్కూటీ నడిపింది. అయితే హెల్మెట్‌ లేకుండా రోడ్డుపై దర్జాగా వెళ్లిపోయింది. ఇది చూసిన జయప్రకాశ్‌ అనే వ్యక్తి ఈ సీన్‌ను లైట్‌ తీసుకోలేదు. సెలబ్రిటీలను చూసి జనాలు కూడా చెడిపోతారని.. సమాజానికి తప్పుడు సందేశం పంపిన నటి వైష్ణవిపై, సీరియల్‌ డైరెక్టర్‌పై, సదరు ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బండి యజమానికి సైతం ఫైన్‌
దీనిపై స్పందించిన పోలీసులు ఈ సీన్‌ చిత్రీకరణ బెంగళూరులోని నందిని లే అవుట్‌లో షూట్‌ చేసినట్లుగా గుర్తించారు. వైష్ణవితో పాటు, ఆమె వాడిన బండి యజమానికి రూ.500 చొప్పున చలానా విధించారు. ఇది జరిగి ఐదారు రోజులు కావస్తోంది. ఈ ఘటనపై సీతారామ సీరియల్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ స్పందిస్తూ.. ఇక మీద రాబోయే ఎపిసోడ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

చదవండి: భర్త కోసం స్పెషల్‌ పోస్ట్‌.. ఆ క్యాప్షన్‌ అర్థం అదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement