కంటెంట్ ఉంటే చాలు క్రేజ్ దానంతటదే వస్తుందనడానికి "సాఫ్ట్‌వేర్ డెవలపర్" మంచి ఉదాహరణ. యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ షార్ట్‌ఫిలిమ్ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు.. మిగతావి చూడకుండా ఉండలేనంతగా యువతను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఇంతలా తన బుట్టలో వేసుకుంటోన్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్ సిరీస్‌లోని హీరోహీరోయిన్లు షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్యతో యాంకర్ సత్తి గరంగరం ముచ్చట్లు పెట్టారు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లో ఆ ఎపిసోడ్ నా ఫేవరెట్
ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుబ్బు, తాను మొదటగా రెండో సీజన్ స్క్రిప్ట్ రాసేసుకున్నామని చెప్పాడు. దాన్ని అమెరికాలో చిత్రీకరించేందుకు ప్లాన్ కూడా చేశామన్నాడు. ఆ సీజన్‌లో కొత్త టీమ్ ఉండబోతుందని, అయితే వైష్ణవికి పెళ్లైంది కాబట్టి ఆమె ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసినదాంట్లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ సిరీసే ఎక్కువ ఇష్టమని, అందులోనూ తొమ్మిదో ఎపిసోడ్ మరింత ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ చూసిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మా సిరీస్ బాగుందని ప్రశంసించాకని, అలాగే మరికొందరు డైరెక్టర్లు ఫోన్ చేసి మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నాడు. (చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు)
దీప్తికి ఇష్టమైతే కలిసి నటిస్తాం
"వెబ్ సిరీస్‌లో చూపించినట్లు కాకుండా నేను నిజజీవితంలో చాలా సైలెంట్‌గా ఉంటా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాలో అవకాశం వచ్చేవరకు పరిగెడుతూనే ఉంటాను. ఇండస్ట్రీలో సూర్య, అల్లు అర్జున్ నాకు ఫేవరెట్. ఈ మధ్యే సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా' చూసి ఏడ్చేశాను" అని చెప్పాడు. తన చేతికున్న టాటూ గురించి చెప్తూ అది దీప్తి సునయన కోసం వేయించుకున్నానని రహస్యాన్ని బయటపెట్టాడు. ఆమెకు ఇష్టమైతే మళ్లీ కలిసి నటిస్తామని మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: సూపర్ సిరీస్..‘ది సాఫ్ట్‌వేర్ డెవలపర్’)
అదే నా పెద్ద డ్రీమ్: వైష్ణవి
వైష్ణవి మాట్లాడుతూ.. నా జీవితంలో మిస్టర్ షన్నూలాంటి వాళ్లు ఎవరూ లేరు. భవిష్యత్తులో వస్తారేమో చూడాలి. సినిమా హీరోయిన్‌గా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే నాని టక్ జగదీశ్, నాగశౌర్య సినిమాల్లో కీలక పాత్రల్లో చేస్తున్నా. బిగ్‌బాస్‌లోకి అవకాశం వస్తే వెళ్తాను. అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్. నా డ్రీమ్ ఒక్కటే.. వైష్ణవి అంటే ట్రెడిషనల్.. ట్రెడిషనల్ అంటే వైష్ణవి. ఆ పేరు రావాలి" అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment