Shanmukh
-
షణ్ముఖ్‌పై కేసు నమోదు.. గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో కీలక మలుపు తిరిగింది. కొంత సమయం క్రితం షణ్ముఖ్ పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా షణ్ముఖ , సంపత్ కలిసి గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై యువతీ ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. షణ్ముఖ్ ఇంట్లో కూడా 18 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను నాకు మొదట పరిచయం చేసింది షణ్ముఖ్‌నే.. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. -
షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు!
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తునకు వెళ్లిన పోలీసులకు వారి వద్ద గంజాయి లభ్యమైంది. వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులకు బాధిత యువతి తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్‌కు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నయవంచనకు గురి చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడించింది. పోలీసులతో కలిసి వినయ్ ఫ్లాట్‌కు వెళ్లగా.. షణ్ముక్ వద్ద డ్రగ్స్, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని.. న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి వాంగ్మూలంలో సంచలన విషయాలు.. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడు. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని సంపత్ ఫ్లాట్‌కి వెళ్లాను. అక్కడే షణ్ముక్ ఉన్నాడు. అతని వద్ద గంజాయి.. డ్రగ్స్ పిల్స్ ఉన్నాయి. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముక్‌కు సహకరించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంతపెట్టాడు. నన్ను కాంప్రమైజ్ అవమని కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. నా దగ్గర విడియో కూడా ఉందని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది -
అలా మాట్లాడుతూ యూత్ పరువు తీస్తున్నారు..!
-
వాళ్ళ పైన బిత్తిరి సత్తి కామెంట్స్ వింటే నవ్వు ఆపుకోలేరు
-
షాకింగ్: బిగ్‌బాస్ నుంచి సిరి ఎలిమినేట్.. ఏడ్చేసిన షణ్నూ
Bigg Boss 5 Telugu,Siri Gets Evicted From Telugu Bigg Boss House: బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం నాడు ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. టైటిల్ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో షణ్నూ, సన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అఫీషియల్ పోలింగ్ ప్రకారం సన్నీ ముందంజలో ఉండగా, షణ్నూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సిరి, మానస్‌ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది. అయితే మరో రెండు రోజుల్లో ఫినాలే ఉండగా బిగ్‌బాస్ షాకింగ్ డెసీషన్ తీసుకున్నట్లు సమాచారం. ఫినాలే స్టేజ్‌పై కాకుండా ముందుగానే బిగ్‌బాస్ సిరిని ఎలిమినేట్ చేశాడు. దీంతో హౌస్‌ను, షణ్నూని వదిలి వెళ్లలేక సిరి బాగా ఎమోషనల్ అయ్యింది. సిరి ఇంటిని వదిలి వెళ్లడంతో షణ్నూ ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది. అయితే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని తెలుస్తుంది. ఓ గంట పాటు సిరిని సీక్రెట్ రూంలో పెట్టి తర్వాత హౌస్‌లోకి పంపించాడట. సీజన్ పూర్తికానున్న నేపథ్యంలో నిన్నటి ఎపిసోడ్లో ఫన్నీ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్ నేడు మరోసారి చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. House nundi eliminate aina #Siri #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun #BiggBosTelugu pic.twitter.com/Ww0q2wpjWB — starmaa (@StarMaa) December 17, 2021 -
Bigg Boss 5 Telugu: మళ్లీ నోరు జారిన షణ్ముఖ్.. కన్నీళ్లు పెట్టుకున్న సిరి
బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఇంట్లో నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక హౌస్‌లో మిగిలిన 17మంది గేమ్‌పై సీరియస్ ఫోకస్ పెట్టారు. ఫ్రెండ్షిప్ని పక్కకు పెట్టి సొంతంగా గేమ్ ఆడుతున్నారు. ఇక బయట మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్, సిరి మాత్రం ఇంట్లో కూడా తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలతో షణ్నూ మాత్రం సిరికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని జెస్సీతో కూడా చెప్పాడు. అనుకున్నట్లే సిరిని షణ్ముఖ్ దూరం పెట్టినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో సిరి, షణ్నూల మధ ఆసక్తికర చర్చ జరిగింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని షణ్ముఖ్‌ని నిలదీసింది సిరి. దానికి వద్దులే అంటు తప్పించుకునే ప్రయత్నం చేశాడు షణ్నూ. అయినప్పటికీ సిరి అతన్ని వదలలేదు. ‘నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్ ఉంది’అని సిరి అంటే.. ‘ఫీల్ అవరా లోన్లీగా.. టూ వీక్స్‌కి అలావాటైపోద్ది’అని సిరి ముఖం మీదే చెప్పేశాడు. అయినా సిరి వదల్లేదు. దీంతో ‘పోరా.. నేను అనవసరంగా నోరు జారుతా’ అని షణ్నూ స్వీట్ వార్నింగ్ ఇస్తే.. తిట్టినా పర్లేదని క్యూట్ చెప్పింది సిరి. . అయినా సరే షణ్ముఖ్ సిరిని దూరం పెట్టాడు. ఒకదశలో ‘నీతో ఫ్రెండ్షిఫ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు’అని షణ్నూ సిరి ఫేస్ మీదే అనేశాడు. దీంతో బాగా హర్ట్ అయిన సిరి.. దూరంగా వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు కెస్టెన్సీ టాస్క్‌లో భాంగా ఇంటి సభ్యులకు స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ పూల్‌లో ఉన్న అక్షరాలను టేబుల్ పై సెట్ చేయమని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
'దీప్తి సునయన -షణ్ముఖ్ పెళ్లి అప్పుడే ఉండొచ్చు'
సోషల్ మీడియాలో స్టార్స్ దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్ క్యూట్ పెయిర్‌కు ఎంతో మంది అభిమానులున్నారు. కవర్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలతో ఈ జంటకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. అయితే బిగ్ బాస్ సీజన్-2 పాల్గొన్న దీప్తి సునయన షో తర్వాత మాత్రం నెగిటివినీ మూటగట్టుకుంది. దీంతో షణ్ముఖ్‌తో బ్రేకప్ అయిపోయిందని, వీరి లవ్ కహానీకి శుభం కార్డు పడిందని అప్పట్లో పలు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఓ ప్రముఖ షోలో పాల్గొన్న దీప్తి- షణ్ముఖ్.. తాము ఆఫ్ స్ర్కీన్ కపుల్స్ అని క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే తరహా టాటూలు వేయించుకొని ఒకరిపై ఒకరికున్న ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరి రిలేషన్ షిప్‌పై ఓ వెబ్ సిరీస్ నటుడు సూర్య స్వామి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో దీప్తి-షణ్ముఖ్ పెళ్లి ప్రస్తావన రాగా.. 'అందులో తప్పేం ఉంది.ఎవరి ఇష్టం వారిదని ఇంకోం రెండేళ్లలో వారు పెళ్లి కూడా చేసుకోవచ్చు' అంటూ హింట్ ఇచ్చేశాడు. దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సాఫ్ట్వేర్ డెవలపర్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌తో యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ప్రస్తుతం ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. బిగ్‌బాస్ సీజన్-5లోనూ ఎంపికైన మొదటి కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ పేరు వైరల్ అవుతోంది. చదవండి : 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి 'పెళ్లికూతురిగా నిత్యామీనన్: దయచేసి ఆ మాట అనొద్దు! -
పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా ఒకరు గాయాలపాలైన ఘటనలో టిక్‌టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి 41(ఏ) నోటీసు జారీ చేశారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని ఉడ్స్ అపార్ట్మెంట్స్ నుంచి తన కారులో మద్యం మత్తులో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఓ స్కూటరిస్ట్కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు షణ్ముక్ కారును అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. కారు దెబ్బతిన్న విజయ్ ఫిర్యాదు మేరకు అతడిపై ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే సాఫ్ట్వేర్ డెవలపర్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో నటించిన అతడు యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. పోలీస్‌స్టేషన్‌లో కూడా షణ్ముఖ్ రచ్చరచ్చ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఒక్కో ఎపిసోడ్‌కు కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా అంటూ దబాయించాడు. రెండు గంటల పాటు పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం.. బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! -
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.10లో కారుతో బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లి స్థానికంగా ఆందోళన రేకెత్తించాడు. అతివేగంతో కారు నడిపిన షణ్ముఖ్.. రెండు కార్లు, రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీనికి అతను మద్యం సేవించి ఉండటమే ప్రధానకారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం షణ్ముక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ దీప్తి కోసమే ఆ టాటూ వేసుకున్నా: షణ్ముఖ్ -
బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ ఇతనే!
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షోకు సీజన్ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్ నాల్గో సీజన్ గతేడాది డిసెంబర్ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక నాల్గో సీజన్ ముగిసి నెల రోజులు గడిచిందో లేదో.. అప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై చర్చ మొదలైంది. స్టార్ మా కూడా ఐదో సీజన్ కోసం ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఐదో సీజన్ మొదటి కంటెస్టెంట్ ఇతనే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఎవరో కాదు.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆయనకు యూత్‌లో ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షణ్ముఖ్ తీసిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ షార్ట్ఫిలిమ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఓ పెద్ద సినిమా తీసిన రాని పేరును ఒక షార్ట్ఫిలిమ్తో సంపాదించాడు షణ్ముఖ్. సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ముందు షణ్ముఖ్ కొని వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూపర్ సిరీస్‌తో షణ్ముఖ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజీయే ఇప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి సెలెక్ట్ అయ్యేలా చేసిందని టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు అతడిని సంప్రదించగా, షణ్ముఖ్ కూడా ఓకే చెప్పినట్టు వినికిడి. శణ్ముఖ్కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కారణాలతోనే షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకున్నారట నిర్వాహకులు. అలాగే యాంకర్ రవి, కమెడియన్ హైపర్ ఆది పేర్లను నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత? ఐదో సీజన్లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
దీప్తి కోసమే ఆ టాటూ వేసుకున్నా: షణ్ముఖ్
కంటెంట్ ఉంటే చాలు క్రేజ్ దానంతటదే వస్తుందనడానికి "సాఫ్ట్వేర్ డెవలపర్" మంచి ఉదాహరణ. యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ షార్ట్ఫిలిమ్ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు.. మిగతావి చూడకుండా ఉండలేనంతగా యువతను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఇంతలా తన బుట్టలో వేసుకుంటోన్న సాఫ్ట్వేర్ డెవలపర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్ సిరీస్‌లోని హీరోహీరోయిన్లు షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్యతో యాంకర్ సత్తి గరంగరం ముచ్చట్లు పెట్టారు. సాఫ్ట్వేర్ డెవలపర్లో ఆ ఎపిసోడ్ నా ఫేవరెట్ ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుబ్బు, తాను మొదటగా రెండో సీజన్ స్క్రిప్ట్ రాసేసుకున్నామని చెప్పాడు. దాన్ని అమెరికాలో చిత్రీకరించేందుకు ప్లాన్ కూడా చేశామన్నాడు. ఆ సీజన్లో కొత్త టీమ్ ఉండబోతుందని, అయితే వైష్ణవికి పెళ్లైంది కాబట్టి ఆమె ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసినదాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీసే ఎక్కువ ఇష్టమని, అందులోనూ తొమ్మిదో ఎపిసోడ్ మరింత ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ చూసిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మా సిరీస్ బాగుందని ప్రశంసించాకని, అలాగే మరికొందరు డైరెక్టర్లు ఫోన్ చేసి మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నాడు. (చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు) దీప్తికి ఇష్టమైతే కలిసి నటిస్తాం "వెబ్ సిరీస్‌లో చూపించినట్లు కాకుండా నేను నిజజీవితంలో చాలా సైలెంట్‌గా ఉంటా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాలో అవకాశం వచ్చేవరకు పరిగెడుతూనే ఉంటాను. ఇండస్ట్రీలో సూర్య, అల్లు అర్జున్ నాకు ఫేవరెట్. ఈ మధ్యే సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా' చూసి ఏడ్చేశాను" అని చెప్పాడు. తన చేతికున్న టాటూ గురించి చెప్తూ అది దీప్తి సునయన కోసం వేయించుకున్నానని రహస్యాన్ని బయటపెట్టాడు. ఆమెకు ఇష్టమైతే మళ్లీ కలిసి నటిస్తామని మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: సూపర్ సిరీస్..‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’) అదే నా పెద్ద డ్రీమ్: వైష్ణవి వైష్ణవి మాట్లాడుతూ.. నా జీవితంలో మిస్టర్ షన్నూలాంటి వాళ్లు ఎవరూ లేరు. భవిష్యత్తులో వస్తారేమో చూడాలి. సినిమా హీరోయిన్గా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే నాని టక్ జగదీశ్, నాగశౌర్య సినిమాల్లో కీలక పాత్రల్లో చేస్తున్నా. బిగ్‌బాస్‌లోకి అవకాశం వస్తే వెళ్తాను. అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్. నా డ్రీమ్ ఒక్కటే.. వైష్ణవి అంటే ట్రెడిషనల్.. ట్రెడిషనల్ అంటే వైష్ణవి. ఆ పేరు రావాలి" అని చెప్పుకొచ్చింది. -
షన్ను-వైష్ణవితో సత్తి ముచ్చట్లు
-
షార్ట్ అండ్ స్వీట్.. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’
తెలుగు తెరపై కొన్ని ఆణిముత్యాలు మనకు ఇప్పటికీ గుర్తుంటాయి.. ఎప్పటికీ మన మదిలో నిలిచిపోతాయి.. కొంతకాలంగా సోషల్ మీడియా హవా బాగా నడుస్తోంది. ప్రతి ఒక్కరి టాలెంట్‌కు యూట్యూబ్ ప్లాట్‌ఫాం ఇస్తుంది. ఇదే యూట్యూబ్ వేదికగా ఇటీవల విడుదలైన షార్ట్‌ఫిలిం ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సిరీస్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. యూట్యూబ్‌లో పది ఎపిసోడ్స్‌ని 80.6 మిలియన్స్ (8కోట్ల మంది) వీక్షించారు. అందరి మన్ననలు సొంతం చేసుకుని సౌత్‌లోనే సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ సోషల్ మీడియాలో ట్రెండ్ ఇప్పటి వరకు ఈ పది ఎపిసోడ్స్‌ని 86 మిలియన్స్ ప్రజలు వీక్షించారు. 1.50 మిలియన్ మంది ఛానల్‌ను సబ్‌స్రై్కబ్ చేసుకున్నారు. అక్టోబర్ నెలలోనే 1.04 మిలియన్స్ సబ్‌స్రైబ్ చేసుకోవడంతో యూట్యూబ్‌లో సౌత్ ఇండియా రికార్డ్ నెలకొల్పింది. వెబ్ సిరీస్ సూపర్‌హిట్ ఇన్ఫినిటమ్ మీడియా నెట్వర్క్ సొల్యూషన్స్ సంస్థ నిర్మించిన ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ వెబ్ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్ని వర్గాలకు చెందిన వారు ఈ సిరీస్‌ను వీక్షిస్తున్నారు. ఈ సిరీస్‌లో జీవితాంతం గుర్తుండిపోయే క్యారెక్టర్ షన్నూ. లీడ్‌రోల్ చేసిన షన్నూ(షన్మఖ్ జశ్వంత్) తన యాక్టింగ్ స్కిల్స్‌తో విమర్శకుల్ని సైతం మెప్పించాడు. – షన్నూ(షన్ముఖ్ జశ్వంత్) ఆసక్తికరమైన క్యారెక్టర్లు ఈ షార్ట్‌ఫిల్మ్‌లో మరో రెండు ఆసక్తికరమైన క్యారెక్టర్లను పరిచయం చేశాడు దర్శకుడు సుబ్బు.కె. మేనేజర్‌గా ఉన్న అరవింద్(జయచంద్ర) తన కంపెనీలో చేసే ప్రతి ఒక్కరి అవసరాన్ని తీర్చుతూ టైంకి పని చేపించుకుంటాడు. పిజ్జా, బర్గర్లు లాంటివి ఆర్డర్ చేస్తూ.. మా మేనేజర్ భలే మంచోడనే ట్యాగ్‌లైన్‌ని సొంతం చేసుకున్నాడు. –మేనేజర్ అరవింద్(జయచంద్ర), హెచ్ఆర్ శృతి(శ్రీవిద్య) లుక్స్‌తో ఫ్లాట్ చేసిన చైతన్య ఫీమేల్ లీడ్ రోల్ చేసిన వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఈ వెబ్‌సిరీస్‌లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చేసిన మాదిరిగా చేయడం తనకు తానే సాటిగా మలుచుకుంది. తన లుక్స్, హావభావాలతో నెట్టింట్లోని ప్రతి అబ్బాయిని ఫ్లాట్ చేసింది. క్యూట్ లుక్స్, స్వీట్ వాయిస్‌తో షన్నూ మాట్లాడుతుంటే.. మొబైల్స్‌లో అది చూస్తున్న ప్రేక్షకుడు గాల్లో తేలిపోయారు. –వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైప్ కోసం చేశా.. ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ అనేది నా మైండ్‌లో లేదు. సీజన్ టూ అని స్క్రిప్ట్ రాసుకున్నాను. సీజన్ టూ చేద్దాం అనుకునే సమయంలో సీజన్ వన్ చేయాలి కదా అన్నారు. సో, సీజన్ వన్‌కి ఏదైనా హైప్ తెస్తేనే.. సీజన్ టూకు క్రేజ్ వస్తుందనే ఐడియా వచి్చంది. అందుకే 10 ఎపిసోడ్స్‌తో ఉన్న ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’ని చేశా. నెటిజన్ల నుంచి స్పందన వస్తోంది. – సుబ్బు.కె. డైరెక్టర్ ట్రెండింగ్ అవుతున్నాం.. మేం నమ్మి అవకాశం ఇచి్చనందుకు డైరెక్టర్ కె.సుబ్బు బాగా తీశారు. సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్ చూస్తుంటే భలే ఆనందమేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మా సిరీస్‌నే ట్రెండింగ్‌లో ఉంది. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్స్‌కి 100శాతం న్యాయం చేశారు. ఇదే స్ఫూర్తి, ఆనందంతో సీజన్ టూని ఇంతకన్నా క్వాలిటీగా, ప్రతి ప్రేక్షకుడూ మర్చిపోలేని విధంగా నిర్మించి తీరుతా. –వందనా బండారు, ప్రొడ్యూసర్, ఇన్ఫినిటమ్ మీడియా నెట్వర్క్ సొల్యూషన్స్ -
మల్టీటాలెంటెడ్ కిడ్
నాలుగో తరగతి చదువుతోన్న చిన్నారి విభిన్న రంగాల్లో రాణిస్తున్నాడు. ఓవైపు మోడలింగ్, మరోవైపు యాడ్స్లోనటిస్తూ, ఇంకోవైపు చిత్రలేఖనంలోనూ ప్రతిభ చాటుతున్నాడీ మల్టీటాలెంటెడ్ కిడ్ షణ్ముఖ్. అతి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకొని పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడాఎంపికయ్యాడు. మియాపూర్: ఆదిలాబాద్ నుంచి పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో నివసిస్తున్న సురేష్, ఆశలత దంపతుల కుమారుడు షణ్ముఖ్. స్థానిక శ్రీనిధి గ్లోబల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఫ్యాషన్‌పై షణ్ముఖ్ ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని ప్రోత్సహించారు. ఫేస్బుక్లో ఓ యాడ్ చూసిన సురేష్ ‘గ్లామర్ ఎరా’ కాంపిటీషన్‌కు షణ్ముఖ్ ఫొటోలు పంపించాడు. అప్పటికే సమయం దాటిపోవడంతో వైల్డ్ కార్డు ద్వారా షోకు సెలెక్ట్ అయ్యాడు. ఏప్రిల్ 29న షోలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు. అతడి టాలెంట్ చూసి మోడలింగ్, ఫ్యాషన్ రంగంలో రాణిస్తాడని న్యాయనిర్ణేతలు అభినందించారు. అప్పటి నుంచి ఇంట్లోనే మోడలింగ్, ఫ్యాషన్ మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఆపిల్, అమెజాన్, ఇంటీరియర్ డెకరేషన్ తదితర యాడ్స్‌లో చేసి మెప్పించాడు. నగరంలో జరిగిన ఫ్యాషన్ షోలలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్‌లో జరిగిన ‘అల్మోరా ఫ్యాషన్ మోడల్ అండ్ ఫర్ ఆలేజ్ ఫ్యాషన్ షో’లో అవార్డు అందుకున్నాడు. ముంబైలో క్యాలెండర్ యాడ్స్ చేసేందుకు అవకాశం పొందాడు. షణ్ముఖ్ టాలెంట్‌కు అనేక అవకాశాలు వస్తున్నాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తా... మోడలింగ్, యాక్టింగ్‌లో రాణించి భవిష్యత్తులో ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఉంది. ఈ రంగంలోకి వచ్చేందుకు నా తల్లిదండ్రులు, గురువులు కష్కష్ ఫాతిమా, అంబర్ పాతర్, సలీమ్ ఇలాయి, అమీద్ అరోరా, ఖాసిం ఖాన్లు ఎల్లప్పుడూ మెళకువలు అందిస్తున్నారు. మెడలింగ్‌లో ఎంపికైనందుకు స్కూల్ ప్రిన్సిపాల్ సర్టిఫికెట్, గోల్డ్‌మెడల్ అందించారు. రానున్న కాలంలో సినిమాల్లో నటించాలని ఉంది. – షణ్ముఖ్ -
ఒక్క ఛాన్స్ కోసం..
పెదగంట్యాడ (గాజువాక) : నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరు నడవనది ఆరూట్లో నే నడిచెదరో.. పొగరని అందరు అన్నా.. అది మాత్రం నా వైజం! తెలువని కొందరు అన్నా.. అది నాలో మేనరిజం! నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు.. నేను ఒక్కడిని ఒక వైపు లోకం ఒక వైపు..!! 'నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతు పాలు తాగడం సమ్‌థింక్ స్పెషల్' అంటున్నారు ఈ తరం అబ్బాయిలు. అందుకే ట్రెండ్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క ఛాన్స్ కోసం సంవత్సరాల కొద్దీ కష్టపడుతున్నారు. నగరంలో ఇటువంటి టేలెంటెడ్ గైయ్స్పై ఈ కథనం.. కోత్తగా ట్రై చేస్తున్న యూత్ అవును... ఇది నిజం సినిమా డైలాగ్ కాదు నాకు ఇగో వైఫైలాగా చుట్టూ ఉంటది అని చెప్పుకోవడానికి బాగున్నా ప్రతి మనిషిలో ఈగో ఫీలింగ్ అంతో ఇంతో ఉంటుంది. ఇది ప్రస్తుతం యువతపై చాలా ప్రభావం చూపుతోంది. డ్రెస్సింగ్ దగ్గర్నుంచి అందరూ తమదైన కొత్త స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. గతంలో అయితే సినిమా హీరోల గెటప్‌లను ఫాలో అయ్యేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ పోయింది. యువత కొత్త బాట పట్టింది. వారి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా కొత్త మేనరిజమ్స్ స్టైల్‌తో పాటు కెరియర్ను కూడా ఎవరికి వారే క్రియేట్ చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం పోకిరీ సినిమాలో మహేశ్‌బాబు ముక్కును వేలుతో రుద్దితే అది స్టైల్‌గా ఫిక్సైంది. అంతకు ముందు అలా అంటే జలుబు చేసిందా అని అడిగేవారు. అలాగే ఇప్పుడు యువత కొత్త కొత్త క్రియేషన్స్ నాంది పలుకుతున్నారు. స్టైల్ ఐకాన్లుగా... పెరిగిన ఫొటోగ్రఫీ కారణంగా ప్రతి వ్యక్తి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని, తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుంటే సమాజంలో తనని కొత్తగా గుర్తిస్తారనే తపన యువతలో పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ స్టైలిష్ ఐకాన్లుగా మారుతున్నారు. ఎక్కడో చూసి కాపీ కొట్టినట్టుగా కాకుండా తమకంటూ ఒక స్టైల్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఉదాహరణకు సందీప్ అనే కుర్రాడికి సినిమాలో హీరోగా నటించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకోసం చాలా కష్టపడి తన హెయిర్ స్టైల్ దగ్గర్నుంచి బాడీ లాంగ్వేజ్ వరకూ అన్ని మార్చుకున్నాడు. ఇక రియల్ లైఫ్‌లో కూడా ఇలాగే తన స్టైల్‌ను కొనసాగిస్తున్నాడు. అలాగే షణ్ముక్ అనే మరో డాన్సర్‌కు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలని చాలా తహతహలాడుతున్నాడు. అందుకే చాలా షార్ట్ ఫిల్మ్‌లలో నటించాడు. కాని అందరిలాగే తనను కూడా చూస్తున్నారని భావించాడు. దీంతో తనలోని డ్యాన్స్ టాలెంట్‌కు పని చెప్పాడు. లేటెస్ట్గా రిలీజైన సూపర్ హిట్ పాటలకు తనే డాన్స్ చేసి వీడియో తయారు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అతడి వీడియోలకు ఆదరణ బాగా పెరిగింది. వైజాగ్‌లో మేల్ మోడల్స్ చాలా తక్కువ నిజం చెప్పాలంటే వేళ్లమీద లెక్కపెట్టేంత మంది మాత్రమే ఉన్నారు. ప్రేమ్, కార్తిక్‌లు ఎన్ని కష్టాలు ఎదురైనా తను అనుకున్న ప్రొఫెషన్లో కొనసాగడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. అలాగే భార్గవ్ అనే యువకుడు కాక్ టెయిల్ అనే హిప్ హాప్ మ్యూజిక్ ట్రూప్‌ను ఏర్పాటు చేసి తెలుగులో హిప్ హాప్ సాంగ్స్ చెయ్యడానిక ప్రయత్నిస్తున్నారు. ఎంవీపీలో బి ఫర్ బిర్యానీ పేరుతో బిర్యానీకీ బ్రాండ్ క్రియేట్ చేసి రాష్ట్రమంతటా బ్రాంచ్‌లు క్రియేట్ చెయ్యడానిక కొంత ముంది యువకులు ప్రయత్నిస్తున్నారు. వేర్వేరు రంగాల్లో ప్రస్తుతం ఇలాంటి యువకులు కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చేస్తున్న పని ఏదైనా దీన్ని గౌరవించి పది మందికి నచ్చుతుందనే నమ్మకంతో తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులంతా ఎప్పుడో ఒకప్పుడు లైమ్ లైట్లోకి వస్తారు. దాని కోసం ఇప్పటికే సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు. కాని ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తమను తాము నిరూపించుకోవడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తామని అంటున్నారు. అందుకే స్టైల్ ఐకాన్లుగా నిలబడటానికి యువత పడుతున్న తపన చాలా మందికి ఆదర్శం కావాలని కోరుకుందాం. వాళ్లంతా వైజాగ్ పేరును నిలబెట్టడాని ఏదో ఒకరోజు పైకొస్తారని ఆశిద్దాం.