బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై ప్రేక్షకుల్లో రోజు రోజుకి ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఇంట్లో నుంచి సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక హౌస్‌లో మిగిలిన 17మంది గేమ్‌పై సీరియస్ ఫోకస్ పెట్టారు. ఫ్రెండ్‌షిప్‌ని పక్కకు పెట్టి సొంతంగా గేమ్ ఆడుతున్నారు. ఇక బయట మంచి స్నేహితులుగా ఉన్న షణ్ముఖ్, సిరి మాత్రం ఇంట్లో కూడా తమ బంధాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇంట్లో జరుగుతున్న వరుస పరిణామాలతో షణ్నూ మాత్రం సిరికి దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని జెస్సీతో కూడా చెప్పాడు. అనుకున్నట్లే సిరిని షణ్ముఖ్ దూరం పెట్టినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో సిరి, షణ్నూల మధ ఆసక్తికర చర్చ జరిగింది. తనతో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని షణ్ముఖ్‌ని నిలదీసింది సిరి. దానికి వద్దులే అంటు తప్పించుకునే ప్రయత్నం చేశాడు షణ్నూ. అయినప్పటికీ సిరి అతన్ని వదలలేదు. ‘నువ్వు మాట్లాడకపోతే చాలా లోన్లీ ఫీలింగ్ ఉంది’అని సిరి అంటే.. ‘ఫీల్ అవరా లోన్లీగా.. టూ వీక్స్‌కి అలావాటైపోద్ది’అని సిరి ముఖం మీదే చెప్పేశాడు. అయినా సిరి వదల్లేదు. దీంతో ‘పోరా.. నేను అనవసరంగా నోరు జారుతా’ అని షణ్నూ స్వీట్ వార్నింగ్ ఇస్తే.. తిట్టినా పర్లేదని క్యూట్ చెప్పింది సిరి. . అయినా సరే షణ్ముఖ్ సిరిని దూరం పెట్టాడు. ఒకదశలో ‘నీతో ఫ్రెండ్‌షిఫ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు’అని షణ్నూ సిరి ఫేస్ మీదే అనేశాడు. దీంతో బాగా హర్ట్ అయిన సిరి.. దూరంగా వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు కెస్టెన్సీ టాస్క్‌లో భాంగా ఇంటి సభ్యులకు స్విమ్ జరా స్విమ్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమింగ్ పూల్‌లో ఉన్న అక్షరాలను టేబుల్ పై సెట్ చేయమని టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment