సిరిని కంట్రోల్‌లో పెడుతున్నానని అంగీకరించిన షణ్ను! | Bigg Boss Telugu 5 Promo: Shanmukh Admitted Was Controlling Siri | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: 'గేమ్‌ కోసం ఫ్రెండ్‌షిప్‌ను వాడుకుంటున్నావా కాజల్‌?'

Published Fri, Dec 10 2021 8:05 PM | Last Updated on Fri, Dec 10 2021 8:20 PM

Bigg Boss Telugu 5 Promo: Shanmukh Admitted Was Controlling Siri - Sakshi

Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్‌ హౌస్‌లో జరుగుతున్న సంఘటనలపైనే కాకుండా కంటెస్టెంట్లపై కూడా ప్రేక్షకులకు అనేక అనుమానాలున్నాయి. వాటిలో కొన్నింటికి నేడు సమాధానం దొరకనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది. ఇంటిసభ్యులందరూ ప్రేక్షకుల ప్రశ్నలు ఎదుర్కోవాలన్నాడు నాగ్‌. అందులో భాగంగా శ్రీరామ్‌కు.. ఇప్పుడు మీరు షణ్ను గ్రూప్‌లో ఉన్నారా అన్న ప్రశ్న ఎదురైంది. ఈ క్వశ్చన్‌ చూసి అవాక్కైన షణ్ను.. నాకో గ్రూప్‌ కూడా ఉందా? అంటూ నవ్వుకున్నాడు. మానస్‌కు మరో వింత ప్రశ్న ఎదురైంది. ఆడియన్స్‌ దగ్గర మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌గా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? అని ఓ ప్రేక్షకుడు సూటిగా ప్రశ్నించాడు. ఇలాంటి క్వశ్చన్‌ వస్తుందని ఊహించలేదని సిరి షాకైంది.

ఇక షణ్ముఖ్‌కు.. 'సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌గా ఫీల్‌ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్‌ చేస్తున్నారు? తనని తనలా ఎందుకు ఉండనివ్వరు?' అని ఆడియన్స్‌లో ఒకరైన సునీత ప్రశ్నించింది. నిజంగానే కంట్రోల్‌ చేస్తున్నావా? అని శ్రీరామ్‌ ప్రశ్నించగా అంత లేదన్నట్లు సిరి మాట్లాడింది. కానీ షణ్ను మాత్రం నువ్వు కంట్రోల్‌ అవ్వనిదే ఎవరూ ఆ క్వశ్చన్‌ వేయరంటూ ఆమెను నియంత్రిస్తున్నానని అంగీకరించాడు. 

'మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ ఇంకా మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?' అని ఓ ప్రేక్షకుడు కాజల్‌ను నిలదీశాడు. కానీ అదంత మంచి ప్రశ్నలా కనిపించకపోవడంతో కాజల్‌ ఏడ్చేసింది. అటు శ్రీరామ్‌ మాత్రం ఈ క్వశ్చన్‌ను నేను కాజల్‌ను ఇదివరకే అడిగానంటూ సిరి, షణ్నులతో చెప్పుకొచ్చాడు. మరి ఈ ప్రశ్నలకు హౌస్‌మేట్స్‌ ఎలాంటి సమాధానాలు చెప్తారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement