Bigg Boss Telugu 5 Promo: Ex Housemates Ask Questions - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: షణ్ను- సిరి రిలేషన్‌పై జెస్సీ కామెంట్స్‌, ఇది చాలా సీరియస్‌ అంటూ..

Published Sun, Dec 12 2021 6:24 PM | Last Updated on Sun, Dec 12 2021 6:54 PM

Bigg Boss Telugu 5 Promo: Ex Housemates Ask Questions - Sakshi

'షణ్ను ఇది చాలా సీరియస్‌.. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్‌ ఉందో, జనాలు ఏం అనుకుంటున్నారో? అని ఎప్పుడైనా ఆలోచించావా?' అని సూటిగా ప్రశ్నించాడు జెస్సీ. అలాగే సిరికి సైతం గట్టిగానే క్లాస్‌ పీకాడు.

Bigg Boss Telugu 5, Model Jaswanth Fires On Siri, Shannu: బిగ్‌బాస్‌ జర్నీ ముగింపుకు చేరుకుంది. మరోవారంలో విజేత ఎవరనేది తేలిపోనుంది. అయితే ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లపై ప్రేక్షకులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కాకపోయినా అందులో కొన్నింటిని నిన్నటి ఎపిసోడ్‌లో అడిగి హౌస్‌మేట్స్‌ నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ రోజు మాత్రం ఏకంగా బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు ఈ ఆరుగురికి ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజా ప్రోమో రిలీజైంది.

'షణ్ను ఇది చాలా సీరియస్‌.. నీకు, సిరికి ఎలాంటి బాండింగ్‌ ఉందో, జనాలు ఏం అనుకుంటున్నారో? అని ఎప్పుడైనా ఆలోచించావా?' అని సూటిగా ప్రశ్నించాడు జెస్సీ. అలాగే సిరికి సైతం గట్టిగానే క్లాస్‌ పీకాడు. 'నువ్వు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి గేమ్‌ ఆడటానికి వెళ్లావు కదా సిరి, కానీ ఎమోషనల్‌ కనెక్ట్‌ అయిపోతున్నాను అదీ ఇదీ అంటూ పిచ్చెక్కిపోతున్నావు, అవసరమా నీకు' అని తిట్టినంత పని చేశాడు జెస్సీ. ఇక ప్రియాంక సింగ్‌.. ఇన్నిరోజులు హౌస్‌లో నన్ను భరించావా? లేదా నటించావా? అని మానస్‌ను నిలదీసింది. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఊహించని హౌస్‌మేట్స్‌ మరి వీటికి ఏమని సమాధానాలిచ్చారో చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement