
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు బయట ప్రపంచంతో ఎటువంటి కనెక్షన్ ఉండదు. కొట్టుకున్నా, తిట్టుకున్నా, కలిసిపోయినా, కబుర్లు చెప్పుకున్నా అన్నీ వాళ్ల మధ్యే! ఇల్లు గుర్తురాకుండా ఎవరికి వారు బిగ్‌బాస్ హౌస్‌లో తమకు నచ్చిన వ్యక్తులతో బాండ్ ఏర్పరుచుకుంటారు. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లోనూ ఇదే జరిగింది. ఒక్కొక్కరూ ఒక్కో వ్యక్తికి కనెక్ట్ అయ్యారు.
అలా సిరి- షణ్ముఖ్ క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారారు. కానీ కొన్నిసార్లు వారి చేష్టలు చూసిన నెటిజన్లు ఇది ఫ్రెండ్‌షిప్ కాదని, మరేదో అయ్యుంటుందని కామెంట్లు చేశారు. మొన్న షణ్ను.. తనను వెళ్లిపో.. అన్నందుకే సిరి ఏకంగా బాత్రూంలో దూరి తల బాదుకుని తనను తాను గాయపర్చుకుంది. ఈ చర్య అటు హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను సైతం షాక్‌కు గురి చేసింది. దీంతో వీళ్ల వ్యవహారమేంటో తేల్చుదామని డిసైడ్ అయ్యాడు నాగ్.
నిన్ను నువ్వు ఎందుకు గాయపర్చుకున్నావు? అని సిరిని నిలదీశాడు. ఇలాంటి పరిస్థితి హౌస్‌లో అవసరమా? అని ప్రశ్నించాడు. ఏం జరుగుతుందో చెప్పమని అడిగాడు. దీనికి సిరి.. ఏం జరుగుతుందో తనకే క్లారిటీ లేదని చెప్తూ ఏడ్చేసింది. కోట్లమంది నిన్నుచూసి ఇలా ఉండాలని నేర్చుకోవాలి, అంతేకానీ అయ్యో ఇలా మాత్రం ఉండకూడదు అనుకోవద్దని చెప్తూ ఆమె పరువు తీశాడు. దీంతో ఓపెన్ అయిన సిరి.. షణ్నుతో ఎందుకు కనెక్షన్ వస్తుందో అర్థం కావట్లేదని వాపోయింది.
ఇదే ప్రశ్న షణ్నుని అడగ్గా అతడు మానసికంగా వీక్ అయ్యానన్నాడు. తన ప్రేయసి దీప్తి సునయనను మిస్ అవుతున్నానని చెప్పాడు. అంతలా మిస్ అవుతే ఈ క్షణమే వెళ్లిపో అంటూ బిగ్‌బాస్ ఇంటి గేట్లు తెరిచాడు నాగ్. మరి షణ్ను.. సిరితో తన బంధాన్ని ఏమని నిర్వచిస్తాడు? వారి మనసులో జరుగుతున్న మానసిక సంఘర్షణకు నేటితోనైనా తెరపడుతుందా? అన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment