
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. వీరిలో శ్రీరామ్ టికెట్ టు ఫినాలే ట్రోఫీ అందుకుని ఇప్పటికే ఫినాలేలో అడుగుపెట్టాడు. కాబట్టి అతడు ఈ వారం నామినేషన్‌లో లేనట్లే! మిగతా ఐదుగురు ఇంటిసభ్యులైన సన్నీ, షణ్ముఖ్, కాజల్, సిరి, మానస్ టాప్ 5లో చోటు దక్కించుకునేందుకు పోరాడుతున్నారు. పద్నాలుగో వారం వీరంతా నామినేషన్‌లో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.
హౌస్‌మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో మొదటి నుంచి ఆరు స్థానాల వరకు ర్యాంకులిచ్చుకోవాలని ఆదేశించాడు బిగ్‌బాస్. మొదట్లో ఫస్ట్ ప్లేస్ తనకే కావాలన్న సిరి తర్వాత మాత్రం షణ్నును మొదటి స్థానంలో చూడాలనుకుంటున్నానంది. అదేంటి? నిన్ను నువ్వు ఫస్ట్ ర్యాంక్‌లో చూసుకోవా? అని శ్రీరామ్ ప్రశ్నించగా లేదని అడ్డంగా తలూపింది.
సిరి కంటే కొంచెం తక్కువగా ఆడతావంటూ షణ్ను ఆరో ర్యాంక్ దగ్గర నిలబడటమే కరెక్ట్ అంది కాజల్. గేమ్ ఇలా ఆడటం తప్పంటే ఆరో స్థానంలో నిల్చుంటానంటూ టాప్ 6 బోర్డు దగ్గర నిలబడ్డాడు షణ్ను. మరి బిగ్‌బాస్ చెప్పినట్లు అందరూ ఒక ఏకాభిప్రాయానికి వస్తారా? లేదా? అన్నది చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment