
Bigg Boss Telugu 5 Promo: బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ కథ కంచికి చేరుకునే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఫన్నీ టాస్కులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు బిగ్‌బాస్. ఇందుకోసం కంటెస్టెంట్లు స్టార్ హీరోహీరోయిన్లుగా మారారు. షణ్ముఖ్ సూర్యగా, కాజల్ శ్రీదేవిగా, సన్నీ బాలయ్యగా, శ్రీరామ్ చిరంజీవిగా, మానస్ పవన్ కల్యాణ్‌గా, సిరి జెనీలియాగా నటిస్తున్నారు. ఇప్పటికే వీళ్లు తమ పాత్రల్లో జీవిస్తూ ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్నారు హౌస్‌మేట్స్. తాజాగా ఈ ఫన్ ధమాకా రెట్టింపు అయినట్లు కనిపిస్తోంది.
శ్రీదేవిగా కాజల్ భూలోకంలో తన అంగులీకం(ఉంగరం) పోయిందని తెగ వెతుకుతున్న విషయం తెలిసిందే కదా! అయితే ఆమె అంగులీకాన్ని వెతికిపెట్టమని సింగం షణ్నుని సాయం కోరింది. కానీ అతడు సాయం చేయాల్సింది పోయి గద్దించి భయపెట్టాడు. దీంతో ఈ అంగులీకం లొల్లి బాలయ్యదాకా చేరింది. షణ్నును ఇంప్రెస్ చేస్తే నీ ఉంగరం నీకు వస్తుందన్నాడు సన్నీ. దీంతో సిరి తన దగ్గరున్న మంత్రదండాన్ని ఉపయోగించింది. వెంటనే వెళ్లి షణ్ముఖ్‌ను హత్తుకోవడంతో అతడు కూల్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment