Bigg Boss Telugu 5 Today Promo: Siri Hanmanth Memories In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ జర్నీ.. సంతోషంతో ఎగిరి గంతేసిన సిరి

Published Wed, Dec 15 2021 4:23 PM | Last Updated on Wed, Dec 15 2021 6:40 PM

Bigg Boss Telugu 5: Power Girl Siri Hanmanth Memories In BB House - Sakshi

Bigg Boss 5 Telugu Today Promo: మరో నాలుగు రోజుల్లో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌కు ఎండ్‌ కార్డు పడనుంది. ఈ క్రమంలో ఫైనలిస్టులకు వారి జర్నీ వీడియోలు చూపిస్తూ ఎపిసోడ్‌ను నెట్టుకొస్తున్నాడు బిగ్‌బాస్‌. ఇప్పటికే శ్రీరామచంద్ర, మానస్‌, షణ్ముఖ్‌, సన్నీల ఏవీలు చూపించగా తాజాగా సిరి హౌస్‌లో కూడగట్టుకున్న జ్ఞాపకాలను ఆమె కళ్లకు కట్టినట్లు చూపించాడు బిగ్‌బాస్‌. తన ఫొటోలను చూసుకుని తెగ సంతోషించింది సిరి. ఆనందం పట్టలేక చిన్నపిల్లలా గంతులేసింది.

'మీరు నమ్మినదాన్ని కోసం మీ గొంతును గట్టిగా వినిపించారు. బిగ్‌బాస్‌ ఇల్లు ఎన్నో భావోద్వేగాల నిధి అయితే అందులోని సిరి మీరు..' అంటూ సిరి గురించి గట్టిగానే ఎలివేషన్స్‌ ఇచ్చారు. హౌస్‌లో అన్ని యాంగిల్స్‌ చూపించిన సిరి జర్నీ చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement