![Criminal Case Filed On Tiktok Star Shanmukh Jaswanth In Hyderabad] - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/1/Shanmukh.jpg.webp?itok=hIfDBDSU)
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో కారు నడుపుతూ మూడు వాహనాలను ఢీకొట్టడమే కాకుండా ఒకరు గాయాలపాలైన ఘటనలో టిక్‌టాక్ స్టార్ షణ్ముక్ జశ్వంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి 41(ఏ) నోటీసు జారీ చేశారు. శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం.52లోని ఉడ్స్ అపార్ట్‌మెంట్స్ నుంచి తన కారులో మద్యం మత్తులో ఎదురుగా ఉన్న వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లాడు. ఓ స్కూటరిస్ట్‌కు కూడా గాయాలయ్యాయి. స్థానికులు షణ్ముక్ కారును అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు.
కారు దెబ్బతిన్న విజయ్ ఫిర్యాదు మేరకు అతడిపై ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే సాఫ్ట్‌వేర్ డెవలపర్ పేరుతో ఓ వెబ్‌సిరీస్‌లో నటించిన అతడు యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. పోలీస్‌స్టేషన్‌లో కూడా షణ్ముఖ్ రచ్చరచ్చ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన ఒక్కో ఎపిసోడ్‌కు కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా అంటూ దబాయించాడు. రెండు గంటల పాటు పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ కారుతో బీభత్సం..
బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు!
Comments
Please login to add a commentAdd a comment