Bigg Boss 5 Telugu: Shanmukh Jaswanth Will Participate In Bigg Boss 5 Telugu | మొదటి కంటెస్టెంట్‌ పేరు ఖరారు! - Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ 5 : మొదటి కంటెస్టెంట్‌ పేరు ఖరారు!

Jan 31 2021 8:52 PM | Updated on Feb 1 2021 9:34 AM

Shanmukh Jaswanth In Bigg Boss Telugu Season 5 - Sakshi

బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది.

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్‌ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్‌ షోకు సీజన్‌ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ గతేడాది డిసెంబర్‌ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే.

ఇక నాల్గో సీజన్‌ ముగిసి నెల రోజులు గడిచిందో లేదో.. అప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌పై చర్చ మొదలైంది. స్టార్ మా కూడా ఐదో సీజన్‌ కోసం ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ మొదటి కంటెస్టెంట్‌ ఇతనే అంటూ ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతను ఎవరో కాదు.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ నటుడు షణ్ముఖ్‌ జశ్వంత్‌. ఆయనకు యూత్‌లో ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షణ్ముఖ్‌ తీసిన ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ షార్ట్‌ఫిలిమ్ ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. ఓ పెద్ద సినిమా తీసిన రాని పేరును ఒక షార్ట్‌ఫిలిమ్‌తో సంపాదించాడు షణ్ముఖ్‌.

సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ కంటే ముందు షణ్ముఖ్‌ కొని వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు.  ఈ సూప‌ర్ సిరీస్‌తో షణ్ముఖ్‌ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజీయే ఇప్పుడు బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కి సెలెక్ట్‌ అయ్యేలా చేసిందని టాక్‌. బిగ్ బాస్ నిర్వాహకులు అతడిని సంప్రదించగా, షణ్ముఖ్‌ కూడా ఓకే చెప్పినట్టు వినికిడి. శణ్ముఖ్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. అలాగే యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఈ కారణాలతోనే షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకున్నారట నిర్వాహకులు. అలాగే  యాంక‌ర్ ర‌వి, క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇందులో నిజ‌మెంత‌? ఐదో సీజన్‌లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement