Bigg Boss Telugu Contestants
-
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈరోజే.. వారిద్దరి ఎంట్రీ ఖాయం!
నెల రోజులకు పైగా బిగ్‌బాస్ సీజన్-8 టాలీవుడ్ సినీ ప్రియులను అలరిస్తోంది. అయితే ఈ ఆదివారం ఈ షోపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హోస్లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీరిలో గతంలో హౌస్‌లోకి వచ్చినా వాళ్లు కూడా ఉన్నారు.తాజాగా ఈరోజు జరిగే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. కొత్త కంటెస్టెంట్స్‌పై హౌస్ సభ్యులందరినీ నాగార్జున అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వారిని త్వరగా ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ హౌస్మేట్స్ అంతా సరదాగా మాట్లాడారు. అంతేకాకుండా మూవీ ప్రమోషన్లలో భాగంగా స్వాగ్ టీమ్, జనక అయితే గనక, మా నాన్న సూపర్ హీరో టీమ్స్ సందడి చేశాయి.(ఇది చదవండి: Bigg Boss 8 : మాజీలతో మసాలా వర్కౌట్ అయ్యేనా?)వారిపైనే ఆసక్తి?అయితే అందరి దృష్టి వారిపైనే ఉంది. ఇంతకీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరు ఎంట్రీ ఇస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. ప్రోమో చూస్తే కొందరి పేర్లు కనిపెట్టేలా హింట్స్ కూడా ఇచ్చారు. ఈ రోజు హౌస్‌లోకి గతంలో మధ్యలోనే బయటికెళ్లిన గంగవ్వ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా యాంకర్ హరితేజ కూడా హౌస్‌లో అడుగుపెట్టనుంది. వీరితో పాటు మరికొంత ప్రముఖులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. -
బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం.. దోమకు అర్థమేంటో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ -8 బుల్లితెర ప్రియులను సరికొత్తగా అలరిస్తోంది. ఒకటి, రెండు తెలిసిన మొహాలు మినహాయిస్తే.. అంతా కొత్త వారే ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓ వారం ముగిసింది. ఎప్పటిలాగే ఆనవాయితీని కొనసాగిస్తూ లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బెజవాడ బేబక్క వారం రోజుల్లోనే ఇంటిదారి పట్టింది. అప్పుడే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయితే ఈ సారి అంతా కొత్త ముఖాలే కావడంతో హౌస్‌లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. లిమిట్లెస్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో హౌస్‌లో అంతో, ఇంతో మెప్పిస్తోన్న కంటెస్టెంట్ మాత్రం ఒకరు ఉన్నారు. అతని వల్లే హౌస్‌లో నవ్వులు పూస్తున్నాయి. అతను మరెవరో కాదు.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ భాషా.(ఇది చదవండి: విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు)రేడియో జాకీగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శేఖర్ భాషా హౌస్‌లోనూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. తన ఫన్నీ పంచ్‌లతో హౌస్‌ను ఫుల్ కామెడీని ఎంటర్టైనర్గా మార్చేశాడు. ఏకంగా జబర్దస్త్ కామెడీ షోను మించిన పంచ్‌లతో అదరగొడుతున్నాడు. దీంతో ఆర్జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా శేఖర్ భాషా కామెడీ క్లిప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆణిముత్యాల్లాంటి జోకులను చూసి ఎంజాయ్ చేయండి. Arey ha #ShekharBasha ni ala vadileyakandra evarikaina chupettandraOka onion,oka I love you,Oka spirit,oka Chapathi Oka pindakudu,Oka shardham#BiggBossTelugu8 pic.twitter.com/eUuYjcygyy— Vamc Krishna (@lyf_a_zindagii) September 2, 2024 #ShekharBasha animutyalu part - 90Omlette = Ame + Late #BiggBossTelugu8 pic.twitter.com/7V2GC7MNQi— Vamc Krishna (@lyf_a_zindagii) September 7, 2024 #ShekharBasha is such a sport 😂❤️Shekhar Basha Animutyam part-100😂😭Doma = Dho (Two) + Maa (Amma) anta 😭#BiggBossTelugu8 pic.twitter.com/RS4kbwXBvQ— Hungry Cheetah (@Aniljsp1) September 8, 2024#Shekharbasha and his diamonds 🤣😂#BiggBossTelugu8 pic.twitter.com/1g7lyHjnoN— ALTDHFM (@altSsmb5) September 8, 2024#ShekharBasha animutyalu part -3Magajathi animuthyam nundi inkonni animutyalu 😂😭 meekosam meekosam meekosam Oka Bangaram,oka Puttakamundu 😭#BiggBossTelugu8 pic.twitter.com/2z6ewd1suu— Vamc Krishna (@lyf_a_zindagii) September 5, 2024 Chiraku = Chee Raku 😂😂😭😭Ayya ayya 😂😂😭😭#ShekharBasha animutyalu part-100 #BiggBossTelugu8 pic.twitter.com/luztkgZq9O— stylish Star Lakshmi (@Stylisstarlaxmi) September 9, 2024 -
బిగ్ బాస్ సీజన్-8.. మొదటి వారం రివ్యూ
ఈ రోజుల్లో చాలా మంది తమ సమస్యల గురించి ఆలోచించడం మానేసి పక్క నున్న వ్యక్తి సమస్యల పై దృష్టి సారించడం ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియా కాలంలో ఇలా జరగడం బాగా పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే అదో వ్యసనంలా మారుతోంది. ఈ మధ్య కాలంలో దారి వెంట ఎవరైనా తగాదా పడుతుంటే వారిని వారించడం పోయి వారి దగ్గరకు వెళ్ళి ఆనందంగా వాళ్ళ కొట్లాట చూడటం వాలైతే ఆ కొట్లాటలో తానున్నట్టు సెల్ఫీలు తీసుకోవడం చాలా మందికి అలవాటైంది. ఇటువంటి పద్ధతినే ప్రాతిపదికను చేసుకుని 2017 సంవత్సరంలోనే నెదర్ ల్యాండ్ దేశంలోని జాన్ డి మోల్ అనే వ్యక్తి బిగ్ బ్రదర్ అనే టీవి కార్యక్రమాన్ని రూపొందించాడు. ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ పొందింటే ఈ రోజుకి దాదాపు 70 కి పైగా దేశాల్లో ప్రైమ్ టైమ్ హిట్‌గా ఈ కార్యక్రమం నిలబడిందన్నదే తార్కాణం. దానినే ఇప్పుడు భారతదేశంలో బిగ్ బాస్ పేరిట దాదాపు అన్ని భాషలలో రూపొందించారు. కార్యక్రమ అంశమంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోనక్కరలేదు. సంబంధంలేని దాదాపు ఓ డజను మంది వ్యక్తులను ఓ ప్రాంతంలో కొన్ని రోజులపాటు వుంచితే వారి మధ్య వచ్చే మనస్పర్ధలు, ప్రేమానురాగాలను అందమైన కార్యక్రమంగా రూపొందించడమే ఈ బిగ్ బాస్. మనిషి ప్రతికూలత అంశాన్ని ఎక్కువగా ఆదరిస్తాడన్నదానికి నిదర్శనమే ఈ కార్యక్రమం. అలా అని దీనికి వ్యతిరేకత లేదు అని చెప్పడానికి కాదు, ఎందుకంటే దీనికి ఎంత ఆదరణ వుందో అంతకంటే ఎక్కువే వివాదాలు వున్నాయి. బిగ్ బాస్ తెలుగు లో 8వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ ప్రత్యేకతలు ఏమిటో ప్రతి వారం ఓ చిన్నపాటి విశ్లేషణతో అందించడానికి ప్రయత్నిస్తాం.'హౌస్ మేట్స్‌కు రుచించని బెజవాడ బేబక్క'ఎంతో ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రారంభమైన ఈ బిగ్ బాస్ 8 వ సీజన్ కి మునుపటిలాగే నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్‌కు టాగ్ లైన్‌గా 'ఎంటర్టైన్ మెంట్‌కు లిమిటే లేదు'గా నిర్ణయించారు. మొత్తంగా 14 కంటెస్టెంట్లో చెప్పుకోదగ్గ వారెవరూ లేకపోయినా కంటెస్టెంట్లందరూ దాదాపుగా తయారై వచ్చినట్టుగా తెలుస్తోంది. మొదటి వారం నామినేషన్ల కన్నా ముందే కంటెస్టంట్ల మధ్య వాడి వేడి వాదనలు జరగడం ప్రేక్షకులకు కనువిందు చేసినట్టైంది. బిగ్ బాస్ అనేది భావోద్వేగభరితమైన షో అని మరోసారి మొదటి రెండురోజుల్లోనే నిరూపించింది ఈ సీజన్.బిగ్ బాస్‌లో ఏడుపులు పెడబొబ్బలు అన్నవి కామన్ అయినా ఏ సీజన్ లోనూ జరగని ఓ వింత ఈ సీజన్ మొదటివారంలోనే జరిగింది. కంటెస్టంట్ అయిన మణికంఠ నామినేషన్స్‌పై వాడివేడి వాదనలు జరుగుతున్న సమయంలో తన విగ్గును పూర్తిగా తీసేసి విలపించడం హైలెట్. ఈ చర్యపై చూసే ప్రేక్షకులే కాదు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా అవాక్కయ్యారు. మిగతా కంటెస్టెంట్లలో నిఖిల్, శేఖర్ భాషా, సోనియా, విష్ణుప్రియ, యశ్మి తదితరులు ఈ వారం తమ అరుపులతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు.ప్రధానంగా ఓ మెరుపు మెరిసినట్టు హౌస్ లోకి అడుగుపెట్టి తన నలభీమ పాక చేతి వంటతో అందరి మన్ననలు పొందాలనుకున్న బెజడవాడ బేబక్క అలియాస్ మధు ఆశలు మొదటివారం లో నే ఆడియాసలై హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. తన మూర్ఖత్వపు రూల్స్ తో బేబక్క తమ కడుపును మాడుస్తుందని హౌస్ లోని దాదాపు ప్రతి కంటెస్టెంట్ పేర్కొనడం గమనార్హం. అలా బెజవాడ బేబక్క బిగ్ బాస్ ప్రస్థానం ముగిసి బెజవాడ బాట పట్టింది. మరి రానున్న వారాల్లో అంచనాలకు మించి ముందుకు వచ్చిన ఈ బిగ్ బాస్ లో ఇంకెన్ని సంచనలనాలు జరుగుతాయో చూద్దాం.- ఇంటూరి హరికృష్ణ -
బిగ్ బాస్ కు బర్రెలక్క.. నిజమేనా ఫ్రెండ్స్...!
-
Priyanka Jain: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో టాప్ 5లో నిలబడ్డ ఏకైక లేడీ కంటెస్టెంట్ (ఫోటోలు)
-
BB7 Winner Pallavi Prashanth Photos: మళ్లొచ్చిన అంటే తగ్గేదేలె.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (ఫోటోలు)
-
బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్‌కు రెడీ అయిపోయింది. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్స్ ఎవరన్నా దానిపై ప్రత్యేక చర్చ మొదలైంది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల సైతం బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మేకర్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. (ఇది చదవండి: చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!) కానీ ఆ లోపే కొంతమంది సెలబ్రిటీల పేర్లను నెటిజన్స్ ముందుగానే చెప్పేస్తున్నారు. ఈ సీజన్లో ముఖ్యంగా అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. బుల్లితెర నటి శోభా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. వారితో పాటు సింగర్ మోహన భోగరాజు, యూట్యూబర్ శ్వేతా నాయుడు, యాంకర్ దీపికా పిల్లి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పేరు తెరమీదకొచ్చింది. ఇప్పుడిపప్పుడే మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టనుందని ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఎవరినోటా విన్నా బేబీ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరిగా సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా బేబీ హీరోయిన్ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బేబీ సినిమా వైష్ణవి చైతన్య కెరీర్‌కు ఓ టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు. (ఇది చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి) -
క్రేజీ అప్డేట్: బిగ్‌బాస్‌లోకి స్టార్ సింగర్స్ దంపతులు? వారెవరంటే..
దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్. తెలుగు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు ఇటివలె స్టార్ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పాల్గొనే కొందరి కంటెస్టెంట్స్ పేర్లు రాగా తాజాగా ఓ స్టార్ జంట పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్గా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన ఈ స్టార్ సింగర్స్ ఈ సీజన్లో హౌజ్‌లో సందడి చేయబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ జంట ఎవరనేది ఇప్పటికే మీకో క్లారిటీ వచ్చినట్టుంది కదా. చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్ బ్యూటీ ఫైర్! అవును మీరు అనుకుంటున్నట్టుగానే సింగర్ హేమచంద్ర ఆయన భార్య, గాయనీ శ్రావణ భార్గవిలు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారట. గత 3వ సీజన్లో వరుణ్ సందేశ్-వితిక దంపతులు హౌజ్‌లో అలరించిన సంగతి తెలిసిందే. అదే రిపీట్ చేస్తూ ఈ సారి హేమచంద్ర, శ్రావణ భార్గవిలను హౌజ్‌లోకి తీసుకువస్తున్నారట నిర్వహాకులు. ఇందుకోసం వారికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఇక వారు విడాకులు తీసుకుబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఈ జంట ఇప్పటికే ఖండిచింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? అయినప్పటికీ ఈ రూమర్స్ ఇంకా చెక్ పడలేదు. వారి మధ్య ఏదో జరుగుతుందంటూ శ్రావణ భార్గవి వ్యవహరం పట్ల పరువురు సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ జంట బిగ్‌బాస్ హౌజ్‌లోకి వస్తే ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే అంటున్నారు నెటిజన్లు. కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్ చేస్తూ షోని సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఇక ఈ ఆరవ సీజన్‌కు కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు సంబంధించిన విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సీజన్లో బిగ్‌బాస్ హౌజ్‌లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారనే దానిపై సెప్టెంబర్ 4వ తేదీతో స్పష్టత రానుంది. -
బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్ యాంకర్! భారీ రెమ్యునరేషన్ ఆఫర్?
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో... సీజన్ సీజన్‌కి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ఆ షో నడవలేదు. దీంతో త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి, ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్ నిర్వాహకులు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆరో సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో హౌజ్ సందడి చేసే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై చర్చ జరుగుతుంది. చదవండి: నాకు లైన్ వేయడం ఆపు అనన్య.. విజయ్ రిక్వెస్ట్ సీజన్ సిక్స్‌లో పాల్గొనేది వీరేనంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ లిస్ట్‌లోకి తాజాగా ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను పేరు వచ్చి చేరింది. ఒకప్పుడు బుల్తితెరపై ఉదయభాను చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బుల్లితెర శ్రీదేవిగా పిలుపించుకున్న ఆమె తనదైన యాంకరింగ్, వాక్చాతుర్యం, గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకరింగ్‌లో కొత్త కోణం ఆవిష్కరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి అనంతరం తెరకు దూరమైన ఆమె క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉందనడంలో అతిశయోక్తి లేదు. స్టార్ హీరోయిన్ రెంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె అప్పుడప్పడు టీవీ షోలు, మూవీ ఈవెంట్స్‌లో దర్శనమిస్తూ ప్యాన్స్‌ని పలకరిస్తోంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరోయిన్, వీడియో వైరల్ ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్‌ను బిగ్‌బాస్ నిర్వహకులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారట. అందుకే ఆమెను సంప్రదించి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయభాను బిగ్‌బాస్ ఆఫర్‌పై పెద్దగా ఆసక్తి చూపించిడం లేదని తెలుస్తోంది. దీంతో ఎలాగైనా ఆమెను ఒప్పించి బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. ఉదయభానుతో నేరుగా మాట్లాడి ఒప్పింయే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. అంతేకాదు ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వని రేంజ్లో ఉదయభానుకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా బిగ్‌బాస్ నిర్వహకులు సిద్ధంగా ఉన్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుంది.. బిగ్‌బాస్ 6లో ఉదయభాను సందడి చేస్తుందా?లేదా? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్.. చివరి నిమిషంలో ఆ కంటెస్టెంట్లు అవుట్
Bigg Boss Non Stop Contestants List: బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు మరికాసేపట్లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది.‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’పేరుతో 'డిస్నీ+ హాట్‌స్టార్'లో ప్రసారం కానున్న ఈ షోకు సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈరోజు (ఫిబ్రవరి26)నుంచి సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్ స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 17మంది కంటెస్టెంట్లతో 24గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు షో రెడీ అయ్యింది. ఇప్పటికే క్వారంటైన్ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్లు మరికాసేపట్లో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ కానున్నారు. ఇక బిగ్ బాస్ OTTలో పాల్గొనే ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి వాళ్లు ఎవరో చూసేయండి.. 1. అరియానా 2. యాంకర్ శివ 3. అఖిల్ సార్థక్ 4. సరయు 5. తేజస్వి మదివాడ 6. మహేష్ విట్టా 7. అషు రెడ్డి ఫస్ట్ ఎంట్రీ 8. హమీదా 9. నటరాజ్ మాస్టర్ 10. నిఖిల్ 11. మిత్రా శర్మ 12. ముమైత్ ఖాన్ 13. ఆర్జే చైతు 14. శ్రీ రాపాక 15. అనిల్ రాథోడ్ 16. అజయ్ కతుర్వార్ 17. బిందు మాదవి అయితే ఈ సీజన్లో ఆదర్శ్, తనీష్‌లు ఉంటారని జోరుగా ప్రచారం జరిగినా చివరి నిమిషంలో వాళ్లు లేరని తెలుస్తుంది. అంతేకాకుండా ఈసారి సీక్రెట్ రూం కాకుండా కంటెస్టెంట్లు అందరినీ ఒకేసారి హౌస్‌లోకి పంపిచనున్నారట. అంతేకాకుండా ఈవారం లేదా రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని తెలుస్తుంది. -
బిగ్ బాస్ ఓటీటీలోకి ఆ హీరోయిన్.. 17 మంది కంటెస్టెంట్స్ వీరే!
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళంలోనే కాకుండా.. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోనూ బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రాసారమవుతుంది. ఆయా ప్రాంతాల్లోని ఫేమస్ పర్సన్స్‌ని కంటెస్టెంట్లు తీసుకొని షో నిర్వహించడం వల్లే ‘బిగ్‌బాస్’ ఇప్పటికీ విజయవంతంగా దూసుకెళ్తోంది.ఇక తెలుగులో ఐదు సీజన్స్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు ఈ షో ప్రసారం కానుంది.ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయింది. అంతేకాదు వారందరిని క్యారంటైన్‌కి కూడా తరలించారట. 🚨 You got it right? And here is our next mystery contestant! Read the post carefully and post your guess in the comments! #biggbossnonstop #biggboss #disneyplushotstar pic.twitter.com/FpKnaYm040 — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 21, 2022 ఈ నేపథ్యంలో ఈ ఓటీటీ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారిలో ఓ హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.తెలుగులో ఆవకాయ బిర్యాని, పిల్ల జమిందార్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బిందు మాధవి.. ఓటీటీ తొలి సీజన్లో పాల్గొనబోతుందట. ఇటీవల బిగ్‌బాస్ ఓటీటీ టీమ్ సోషల్ మీడియాలో ముఖం సరిగా కనిపించని ఓ ఫోటోని షేర్ చేస్తూ.. ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి నెటిజన్స్‌కు క్విజ్ పెట్టారు. ఆ ఫోటో పక్కా బిందు మాధవిదే అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆమె బిగ్‌బాస్ ఓటీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బిగ్‌బాస్ షో ద్వారా అయినా మళ్లీ సినిమా అవకాశాలు వస్తాయని మాధవి భావిస్తోందట. ఇక మాధవితో పాటు ఈ షోలో కమెడియన్ ధనరాజ్ (సీజన్ 1 కంటెస్టెంట్), ఆదర్శ్ (సీజన్ 1 రన్నర్), ముమైత్ ఖాన్ (సీజన్ 1 కంటెస్టెంట్), రోల్ రైడా (సీజన్ 2 కంటెస్టెంట్), తేజస్వి (సీజన్ 2 కంటెస్టెంట్),అషు రెడ్డి (సీజన్ 3 కంటెస్టెంట్), అరియానా గ్లోరి (సీజన్ 4 కంటెస్టెంట్),మహేశ్ విట్టా (సీజన్ 4 కంటెస్టెంట్), సరయు (సీజన్ 5 కంటెస్టెంట్), హమీదా (సీజన్ 5 కంటెస్టెంట్) నటరాజ్ మాస్టర్ (సీజన్ 5 కంటెస్టెంట్),యూట్యూబర్, యాంకర్ నిఖిల్ ,యాంకర్ స్రవంతి చొక్కారపు,ఆర్జే చైతు, యాంకర్ శివ , చిచ్చా చార్లెస్, అజయ్ కతుర్వార్, రోల్ రైడా పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు అఫియల్ లిస్ట్‌లో ఉంటారో తెలియాలంటే.. ఫిబ్రవరి 26వరకు ఆగాల్సిందే. -
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోకి బోల్డ్ బ్యూటీ !.. రాహుల్ ఇలా కన్ఫర్మ్ చేశాడా ?
Ashu Reddy Bigg Boss Non Stop Entry Confirm By Rahul Sipligunj: బుల్లితెరపై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమైంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్'లో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుండగా.. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. తెలుగులో మొదటిసారిగా 24 గంటలు పాటు ప్రసారం కానున్న ఈ షోలో కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే పులువురు సెలబ్రిటీలు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు వార్తలు విన్నాం. అయితే తాజాగా ఒక మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈ ఓటీటీ షోలో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో సందడి చేయనున్నట్లు బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి సీజన్లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ఒక్క కంటెస్టెంట్ పేరు ప్రకటించలేదు. ఈ క్రమంలో రాహుల్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. 'ఆల్ ది బెస్ట్ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో' అంటూ పోస్ట్ చేశాడు రాహుల్. దీంతో అందరూ అషు రెడ్డి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు. -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఫోటోలు లీక్, నెట్టింట హల్చల్
Bigg Boss Ott Telugu Contestants Revealed: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ ఓటీటీ ఈనెల 26నుంచి స్ట్రీమింగ్ కానుంది. షో రెగ్యులర్ బిగ్‌బాస్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈసారి అంతకుమించి అనేంతలా షో ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత సీజన్స్‌లో పాపులర్ కంటెస్టెంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్లతో 24గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బిగ్‌బాస్ రెడీ అయ్యింది. ఇప్పటికే అందుకు తగ్గట్లు బిగ్‌బాస్ సెట్ సైతం మరింత అందంగా ముస్తాబైంది. ఇక ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓవైపు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంటే, కొందరు కంటెస్టెంట్ల ఫేసులు కూడా రివీల్ అయిపోయాయి.బిగ్‌బాస్ స్టేజ్‌పై కంటెస్టెంట్ల ఇంట్రో పర్‌ఫామెన్సుల వీడియో క్లిప్పింగులు ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అఖిల్ సార్థక్, అరియానా గ్లోరీ, అషు రెడ్డి, హమీదా, అనిల్ రాథోడ్(మోడల్), తేజస్విని, సరయు, యాంకర్ స్రవంతిల ఫోటోలు లీకయ్యాయి. గత సీజన్స్ కంటే మరింత గ్రాండ్‌గా హౌస్ ముస్తాబయ్యింది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో 'డిస్నీ+ హాట్‌స్టార్'లో ఈ నెల 26నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్ నాగార్జుననే వ్యవహరించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రోమోను వదిలిన మేకర్స్ అందుకు తగ్గట్లుగానే షోను ప్లాన్ చేస్తున్నారు. మరి ఈసారి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న బిగ్‌బాస్ షో ఎలా ఉంటుందన్నది ముందుముందు చూడాల్సి ఉంది. చదవండి: Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్ ఓటీటీ కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ ఇదే! -
బిగ్‌బాస్ ‘సీజన్ 5’ కంటెస్టెంట్స్ ఫొటోస్
-
‘మా’ ఎన్నికలు: ప్రకాశ్ రాజ్ ఆఫీసులో బిగ్‌బాస్ సభ్యులకు నైట్ పార్టీ!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి అధ్యక్ష బరికి నలుగురు పోటీ పడుతుండటంతో ఎవరు అందుకోబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటూ వివాదాలకు తెరలెపారు. ఈ క్రమంలో ‘మా’ ఎన్నికల తేదీని మా క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అభ్యర్థులు తమ ప్యానల్ సభ్యులతో ప్రచారం ముమ్మురం చేశారు. ఈ నేపథ్యంలో మా ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రచారంలో భాగంగా మా సభ్యులను ప్రసన్నం చేసుకునేందుకు నైట్ పార్టీల జోరందుకుంది. కాగా ఆగష్టు 29న(రేపు) నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు(శనివారం) రాత్రి తెలుగు బిగ్‌బాస్ 4 సీజన్ల కంటెస్టెంట్స్‌కు నైట్ పార్టీ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వాట్సప్ గ్రూప్‌లో నటుడు సమీర్ ఆహ్వాన మేసేజ్‌లు పంపినట్లు సమాచారం. అంతేగాక నాగార్జున బర్త్‌డే సందర్భంగా ప్రకాశ్ రాజ్ ఆఫీసులో జరిగే సెలబ్రెషన్స్‌కు నాలుగు సీజన్ల బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ హాజరు కావాల్సిందిగా వాట్సప్ గ్రూప్‌లో ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఈసారి అధ్యక్ష బరిలో ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, జీవితా రాజశేఖర్ హేమలు ఉన్నారు. చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా? లేక ఎవరినైనా ఏకగ్రీవం చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు నటీనటుల సమస్యల పరిష్కారంతో పాటు, ‘మా’ నూతన భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. -
Divi Vadthya: గుర్తింపు పెరిగింది... కష్టం తగ్గింది
‘‘బిగ్‌బాస్ షోతో నాకు మంచి గుర్తింపు లభించింది. అవకాశాల కోసం నేను పడుతున్న కష్టం తగ్గింది. పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అని బిగ్‌బాస్ ఫేమ్ దివీ వైద్య అన్నారు. దివి, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కేవీఎన్ రాజేష్ దర్శకత్వంలో ఎస్. కృష్ణ నిర్మించారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్పార్క్‌లో ‘క్యాబ్‌స్టోరీస్’ ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దివి మాట్లాడుతూ – ‘‘ఇందులో నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని షాలిని పాత్ర చేశాను. ఓ క్యాబ్ ఎక్కే క్రమంలో షాలిని పొరపాటు చేస్తుంది. ఆ పొరపాటు కథలోని మిగతా పాత్రలపై ప్రభావితం చూపుతుంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి కంటెంట్‌కు వ్యూయర్షిప్ బాగానే ఉంది. ‘క్యాబ్‌స్టోరీస్’ ప్రేక్షకులను మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘డైరెక్షన్, ప్రొడక్షన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా 24 క్రాఫ్ట్స్‌లో ఏ విభాగంలోనైనా పని చేస్తాను. డైరెక్షన్ ఆలోచన ఉంది. చిరంజీవిగారు హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో కీలక పాత్ర చేయనున్నాను. ఇటీవలే ‘లంబసింగి’ ప్రాజెక్ట్ పూర్తి చేశాను. ‘ఘర్షణ’ వెబ్ సిరీస్‌లో ఓ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ ఇతనే!
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఈ షోపై ఎన్నో విమర్శలు వచ్చినా రేటింగ్‌లో దూసుకుపోతుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షోకు సీజన్ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన బిగ్‌బాస్ నాల్గో సీజన్ గతేడాది డిసెంబర్ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక నాల్గో సీజన్ ముగిసి నెల రోజులు గడిచిందో లేదో.. అప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌పై చర్చ మొదలైంది. స్టార్ మా కూడా ఐదో సీజన్ కోసం ప్రారంభించింది. దీనిపై వారి అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేపై వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అతి త్వరలో బిగ్‌బాస్ 5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ ఐదో సీజన్ మొదటి కంటెస్టెంట్ ఇతనే అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను ఎవరో కాదు.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ నటుడు షణ్ముఖ్ జశ్వంత్. ఆయనకు యూత్‌లో ఎంత క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షణ్ముఖ్ తీసిన ‘సాఫ్ట్వేర్ డెవలపర్’ షార్ట్ఫిలిమ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఓ పెద్ద సినిమా తీసిన రాని పేరును ఒక షార్ట్ఫిలిమ్తో సంపాదించాడు షణ్ముఖ్. సాఫ్ట్వేర్ డెవలపర్ కంటే ముందు షణ్ముఖ్ కొని వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. కానీ ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ సూపర్ సిరీస్‌తో షణ్ముఖ్ క్రేజీ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజీయే ఇప్పుడు బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి సెలెక్ట్ అయ్యేలా చేసిందని టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు అతడిని సంప్రదించగా, షణ్ముఖ్ కూడా ఓకే చెప్పినట్టు వినికిడి. శణ్ముఖ్కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే యూట్యూబ్‌లో 26 లక్షలు, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ కారణాలతోనే షణ్ముఖ్‌ని బిగ్‌బాస్‌లోకి తీసుకున్నారట నిర్వాహకులు. అలాగే యాంకర్ రవి, కమెడియన్ హైపర్ ఆది పేర్లను నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత? ఐదో సీజన్లో ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
నా బంగారు తల్లి.. క్రిష్ బాగా చూసుకో: వితిక
‘‘నా బంగారు తల్లి.. నీ పెళ్లి గురించి, నా పెళ్లి కంటే ఎక్కువ కలలు కన్నాను. అందుకే కష్టపడి, చాలా ఇష్టపడి నీ పెళ్లి చేశాను. నువ్వు నాకు చెల్లిలా పుట్టావు.. కానీ నేను నిన్ను తల్లిలా పెంచుకున్నా. మీ పెళ్లి చేయాలనే ఇరవై ఏళ్ల నా కల ఇప్పుడు నెరవేరింది. నా చేతుల మీదుగా ఇది జరగడం పట్ల నాకెంతో గర్వంగా ఉంది. నీకోసం నేను ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను. నీ కొత్త ఇంట్లో నీకు అన్ని సంతోషాలు దక్కాలి. నన్ను గర్వపడేలా చేశావు. ఐ లవ్ యూ.. హ్యాపీ మారీడ్ లైఫ్. మీ జంటను ఆ దేవుడు ఆశీర్వదించాలి. క్రిష్ బాగా చూసుకో’’ అంటూ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ వితికా షేరు భావోద్వేగ పోస్టు షేర్ చేశారు. ‘‘కలకాలం నవ్వుతూ ఉండు. నాకు అదే చాలు’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అదే విధంగా.. ‘‘1997 నుంచి నీకు కాపు కాస్తూనే ఉన్నాను. అవును.. బొమ్మరిల్లు ప్రకాశ్ రాజ్ ఫీమేల్ వర్షన్ నేను’’ అని కృతిక పెంపకంలో తన పాత్ర గురించి చమత్కరించారు. తన చెల్లెలు కృతికా షేరు పెళ్లి సందర్భంగా తనపై ఉన్న ఈ ప్రేమను వితిక ఈ విధంగా చాటుకున్నారు. అలాగే ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన.. వితికా వారి జంట కలకాలం ఇలాగే కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అంతా తానై చెల్లెలి పెళ్లిని దగ్గరుండి జరిపించినందుకు గర్వంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.(చదవండి: సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ ) కాగా కృతికా- కృష్ణల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ జంట వరుణ్ సందేశ్- వితికా షేరు కుటుంబానికి సంబంధించిన ఈ వేడుకలో బిగ్‌బాస్-3 కంటెస్టెంట్స్ పాల్గొని సందడి చేశారు. నటి పునర్నవి సంప్రదాయ వస్త్రధారణలో ఈ గ్యాంగ్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) -
బిగ్ బాస్: సెలబ్రెటీలకు ఒరిగిందేంటి?
వెబ్ ప్రత్యేకం : బిగ్ బాస్.. పరిచయం అవసరం లేని పేరు. ప్రపంచ టెలివిజన్ రంగంలో భారీ సక్సెస్ షో గా నిలిచిన ఈ బిగ్ బాస్ షో తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం.. ఇలా అన్ని భాషల్లోనూ తనదైన మార్క్ చూపిస్తోంది. తెలుగులో ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. నాలుగో సీజన్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించే ఈ రియాల్టీ షో.. విన్నర్స్ నుంచి కంటెస్టెంట్స్ వరకు ఎంతమందికి, ఎంతవరకు యూజ్ అయింది? వారి కెరీర్‌కి ఎంత హెల్ప్ అయింది ? ఈ షోలో పాలుపంచుకొన్న సెలబ్రెటీలకు ఒరిగిందేంటి? వాళ్ల ఇమేజ్‌లు ఏమైనా మారాయా? కొత్తగా అవకాశాలు వస్తున్నాయా?లాంటి విషయాల్లోకి వెళ్తే.. ‘బిగ్‌బాస్’ ని కెరీర్ గ్రోత్‌కి యూజ్ చేసుకోవాలి. సహజంగా కంటెస్టెంట్స్ ఆలోచన ఇదే. కంటెస్టెంట్స్ అంతా సెలబ్రిటీలే కాబట్టి వారి ఇమేజ్‌తో షోని సక్సెస్ చేసుకోవాలి. బిగ్‌బాస్ స్ట్రాటజీ ఇదే. ఇందులో ఇప్పటి దాకా బిగ్‌బాస్ యూనిట్ గెలుస్తూ వచ్చింది. ఎందుకంటే మూడు సీజన్స్‌లో విన్నర్స్ కానీ, కంటెస్టెంట్స్ కానీ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత పెద్దగా సాధించిందేమీ లేదు. వాళ్ల కెరీర్‌కి షో ప్లస్ అయిందీ లేదు. ఫస్ట్ విజేతకే కలిసి రాలేదు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 1లో కత్తి మహేష్, హరితేజ, శివ బాలాజీ, అర్చన, సమీర్, ముమైత్ ఖాన్, ప్రిన్స్, సింగర్ మధుప్రియ, సంపూర్ణేష్ బాబు, జ్యోతి, సింగర్ కల్పన, కత్తి కార్తీక, ఆదర్శ్, ధనరాజ్, దీక్ష(వైల్డ్ కార్డ్), నవదీప్ (వైల్డ్ కార్డ్) పాల్గొన్నారు. 70 రోజుల పాటు కొనసాగిన ఈ రియాల్టీ షోలో శివ బాలాజీ విజేతగా నిలిచాడు. నిజానికి బిగ్ బాస్‌లో పాల్గొనే నాటికే శివ బాలాజీ హీరోగా ప్రేక్షకులకు సుపరిచితం. బిగ్ బాస్‌తో మరింతగా ఆడియన్స్‌కి దగ్గరైయ్యాడు. ఆ సీజన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. కానీ… ఆ తర్వాత శివ బాలజీ కెరీర్ ఏమీ మలుపు తిరిగిపోలేదని ఫిలింనగర్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్ద పెద్ద అవకాశాలతో ఆయనేం బిజీ అయ్యిందీ లేదు. ఇక ముమైత్ ఖాన్, ప్రిన్స్, నవదీప్,సంపూర్ణేష్ బాబు, కత్తి మహేష్ లాంటి వాళ్లకు బిగ్ బాస్ కలిసి రాలేదనే చెప్పాలి. కత్తి మహేష్.. బిగ్ బాస్ షో కంటే పవన్‌పై విమర్శల ద్వారానే ఎక్కువ పాపులర్ అయ్యారు. ఇక ఈ సీజన్లో కాస్తో కూస్తో లాభ పడింది ఎవరైనా ఉన్నారు అంటే అది హరితేజ అనే చెప్పాలి. మిగతా కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే హరితేజ తరచూ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలోనూ ఆమెకు కీలక పాత్ర దక్కింది. అలాగే వివిధ సినీ ఫంక్షన్లలోనూ యాంకరింగ్‌తో మెప్పిస్తుంది. తేజస్వీ ఇమేజ్ డ్యామేజ్ బిగ్‌బాస్ సీజన్2లో గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, యాకర్ శ్యామల, కిరీటి, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి, గణేష్, సంజనా అన్నే, నూతన్ నాయుడు, నందినిలు పాల్గొన్నారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ‘బిగ్ బాస్’ యూజ్ కాలేదు. పైగా ఈ షో వల్ల వారికున్న కాస్త ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. ముఖ్యంగా తేజస్వికి అయితే బిగ్ బాస్ షో కలిసే రాలేదు. ఈ రియాల్టీ షోలో పాల్గొనేకంటే ముందే చిన్నా చితకా సినిమాల్లో నటించిన ఆమెకి ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఎంట్రీ తరువాత ఈ అమ్మడు ఇమేజ్ ఒక్కసారిగా తలక్రిందులు అయ్యింది. కోలుకోలేని డ్యామేజ్ అయ్యింది. ఆ తర్వాత ఏ ఒక్క చాన్స్ రాలేదు. యాంకర్‌గా అవతారమెత్తినా సక్సెస్ కాలేకపోయింది. కౌశల్కీ కలిసి రాలేదు ఇక బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ పరిస్థితి అయితే మరీ దారుణం. షో జరిగినన్ని రోజులు కౌశల్ పేరు మారుమోగింది. కౌశల్ ఆర్మీ పేరుతో యువత హల్చల్ చేశారు. బిగ్‌బాస్ షోలో ఏ కంటెస్టెంట్‌కు రాన్నంత ఇమేజ్ కౌశల్‌కు వచ్చింది. బిగ్‌బాస్ విజేతగా కౌశల్ గెలిచిన తర్వాత అతడికి వరుసగా విలన్ ఆఫర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ పుకార్లు షికార్లు చేసాయి. బోయపాటి శ్రీను, రామ్ చరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’లో ముఖ్యపాత్రలో కౌశల్ నటించే ఛాన్స్ కొట్టేసాడాని చెప్పుకున్నారు. అంతేకాదు బోయపాటి శ్రీను,బాలయ్య సినిమాలో ఇంపార్టెంట్ రోల్‌కు కౌశల్‌ను తీసుకున్నారంటూ రకరకాలు వార్తలు పుట్టుకొచ్చాయి. అంతేకాదు అతడిని హీరోగా పెట్టి సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కట్ చేస్తే..బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్.. ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా కౌశల్ సాధించిదేమి లేదు. బిగ్ బాస్ ఇమేజ్ కొన్నాళ్ల వరకే ఉంది. ఆ తర్వాత కౌశల్ కనుమరుగైపోయాడు. ఇటు బ్రేక్ వచ్చేసింది అని చెప్పుకునే స్థాయిలో సినిమా అవకాశాలు కూడా రాలేదు. ఇక మరో కంటెస్టెంట్ దీప్తి సునైనాకు బిగ్ బాస్ హౌస్‌కి రాకముందు యూట్యూబ్ సంచలనంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. కాని హౌస్‌కి వచ్చిన తరువాత ఆమె తనీష్‌తో ప్రేమ వ్యవహారం, అతడితో రొమాన్స్ కారణంగా ఆమెకు ఉన్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. మరో కంటెస్టెంట్ బాబు గోగినేని పరిస్థితి కూడా అంతే. హౌస్‌లోకి రాకముందు ప్రముఖ హేతువాదిగా టీవీ కార్యక్రమాల్లో ప్రచారం పొందిన ఆయనకు బిగ్ బాస్ చేదు అనుభవాన్నే మిగిల్చాడు. సోషల్ మీడియాలో ఆయనపై నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆయన మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కనిపించడం అరుదైపోయింది. తనీష్, సామ్రాట్, నందినిలకు కూడా పెద్ద బ్రేక్ వచ్చిందేమి లేదు. బిగ్ బాస్ హౌస్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, గణేష్ లాంటి వాళ్లను బిగ్ బాస్ తరువాత జనం గుర్తించడమే మానేశారు. ఇటీవల నూతన్ నాయుడు ఓ వివాదం వల్ల కాస్త వార్తల్లో నిలిచాడు. రాహుల్‌కు బెంజ్ కొన్నాడు కానీ... కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శివజ్యోతి, టీవీ నటుడు రవికృష్ణ, అశురెడ్డి, జర్నలిస్ట్ జాఫర్,నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టీవీ నటి రోహిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, పునర్నవి భూపాలం, నటి హేమ, అలీ రజా, మహేశ్ విట్టా, యాంకర్ శ్రీముఖి, హీరో వరుణ్ సందేశ్, వితికా షెరు, యాంకర్ శిల్పా చక్రవర్తి (వైల్డ్ కార్డ్) పాల్గొన్నారు. వీరిలో బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్‌ని రాహుల్ సిప్లిగంజ్ గెల్చుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. బెంజ్ కారు కొనేదాకా ఆయన ఆర్థిక స్థాయి వచ్చింది. కానీ బ్రేక్ వచ్చే స్థాయిలో కెరీర్ పరంగా అద్భుతాలు ఏం జరగలేదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బిగ్ బాస్ 3 రన్నరప్ శ్రీముఖికి కూడా పెద్ద బ్రేక్ వచ్చిందేమి లేదు. షోలో పాల్గొనడానికి ముందే ఆమె స్టార్ యాంకర్. బిగ్ బాస్ విన్నర్ కంటే ఎక్కువే డబ్బులు తీసుకెళ్లింది కానీ, కెరియర్ పరంగా ఆమెకు బిగ్ బాస్ ఏరకంగా ఉపయోగపడలేదు. ఇక శివ జ్యోతి అయితే సొంతింటి కలను నిజం చేసుకుంది కానీ కెరియర్ పరంగా మాత్రం అలాగే కొనసాగుతోంది. సొంతంగా యూట్యూబ్ చానెల్‌ను పెట్టుకొని తనకొచ్చిన ఇమేజ్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్‌లో కూడా ఏ ఒక్కరికి బిగ్‌బాస్ వల్ల పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి. ఈ సారైనా కలిసొచ్చేనా బిగ్ బాస్ షో లో పాల్గొనడం వల్ల అవకాశాలు వచ్చిన వాళ్లు ఉన్నారు. ఇమేజ్‌ని పెంచుకున్న వాళ్లు ఉన్నారు. కానీ కెరీర్‌ని మలుపు తిప్పే స్థాయిలో ఎవరికీ బ్రేక్ రాలేదన్నది సినీ పరిశ్రమ వర్గాల మాట. ఓవరాల్‌గా బిగ్ బాస్ వల్ల కంటెస్టెంట్స్‌కి ఒరిగింది ఏదైనా ఉందా అంటే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్స్, వ్యక్తిగత దూషణలు తప్ప కెరియర్ పరంగా బిగ్ బాస్ హెల్ప్ కావడం లేదనే చెప్పాలి. మరి బిగ్ బాస్ సీజన్ 4 నుంచి సీన్ మారుతుందా? లేదా గత సీజన్ల మాదిరే కంటెస్టెంట్ల కెరియర్ గ్రోత్‌కు ఉపయోగపడకుండా పోతుందా అని తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
బిత్తిరి సత్తి రాజీనామా అందుకేనా?
హైదరాబాద్: తీన్మార్ వార్తలతో సుపరిచితుడైన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ త్వరలో రియాల్టీ షోలో కనిపించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. బుల్లితెర హిట్ షో 'బిగ్‌బాస్ సీజన్ 4' కోసమే సత్తి తాను పనిచేస్తున్న టీవీ చానల్‌కు రాజీనామా చేసినట్టు సమాచారం. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టేందుకు సత్తి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు వినికిడి. కాగా ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులు పార్టిసిపెంట్ల వేట మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనూ కొందరి పేర్లు లీక్ అయ్యాయి. తాజాగా వీరి సరసన సత్తి చేరాడు. అయితే చివరాఖరికి బిగ్‌బాస్ నిర్వాహకులు ఎవరిని ఖరారు చేయనున్నారో చూడాలి. గతంలో బిత్తిరి సత్తితో పాటు వార్తలు చదివి పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా బిగ్‌బాస్ తదుపరి సీజన్ మరింత ఆలస్యం కానుంది. ఈ ఏడాది చివరికి ఈ షో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. (బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?) -
బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?
లాక్డౌన్ వల్ల అన్ని షూటింగ్‌లకు ప్యాకప్ చెప్పిన విషయం తెలిసిందే. సినిమాలు, సీరియళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇక రియాలిటీ ప్రోగ్రామ్స్ ఓ లెక్కా? తాజాగా కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ సడలింపుల్లోనూ షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ పడలేదు. దీంతో ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఈసారి ఉంటుందా? లేదా అని అభిమానులు తెగ కంగారుపడ్డారు. కానీ ఆరు నూరైనా బిగ్‌బాస్ నాల్గవ సీజన్ తెరకెక్కిస్తాం అంటోందట స్టార్ మా యాజమాన్యం. ఇప్పటికే అందుకవసరమయ్యే పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నాల్గో సీజన్‌కు వ్యాఖ్యాతగా ఎవరు? తెలుగు నాట బిగ్‌బాస్ షోకు ఉన్న ఆదరణ మరింకే ప్రోగ్రామ్‌కు లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిగ్‌బాస్ ప్రారంభమయ్యే సమయానికి టంచనుగా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అలా ఎందరో ఆదరాభిమానాలను చూరగొన్న బిగ్‌బాస్ ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. హీరోలు నాని, ఎన్టీఆర్, నాగార్జున వరుసగా మూడు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాల్గవ సీజన్‌కు తొలుత మహేశ్‌బాబు హోస్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ అది అంత సులభం కాదని తెలుస్తోంది. ఈ క్రమంలో మరోసారి నాగార్జునే కనిపించనున్నాడా? లేక ఎలాగోలా ప్రిన్స్ మహేశ్‌బాబే హోస్ట్‌గా తెరపై సందడి చేయనున్నాడా అనేది వేచి చూడాల్సిందే. (‘రాహుల్ లిప్‌లాక్ సీన్ వైరల్.. నేను సచ్చిపోతా’ ) బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆ నలుగురు బిగ్‌బాస్ కార్యక్రమం సాధారణంగా జూలైలో ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే ఈసారి కాస్త లేటయ్యేట్టున్నా లేటెస్ట్గా వచ్చేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేవారిని ఎంపిక చేసే పనిలో పడ్డారు. అందులో కొంతమంది పేర్లను లీకువీరులు బయటపెట్టేశారు. తెలంగాణ యాసతో మాటల, పాటల గారడీ చేసే మంగ్లీ, హీరో తరుణ్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, సీరియల్ నటుడు అఖిల్ సార్థక్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నలుగురి పేర్లు ఫైనల్ లిస్టులో ఉంటాయా? లేదా? వీళ్లతోపాటు ఇంకా ఎవరెవరు బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తారు? అనేది తెలియాలంటే అధికారికంగా వెల్లడించే వరకు వెయిట్ చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. (బిగ్‌బాస్ ట్రోఫీ, మనీ వద్దు: శ్రీముఖి) -
తారక్‌కు బిగ్‌బాస్ హౌస్మేట్స్ స్పెషల్ విషెస్..
నందమూరి నటవారసుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్నారు. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. బాలనటుడిగా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రంలో భరతుడి పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాలా రామాయణం చిత్రంలో తనదైన నటనతో అభిమానులను అలరించారు. 2001లో నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా పరిచమయ్యారు. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1, ఆది, అల్లరి రాముడు, సింహాద్రి, యమదొంగ, అదుర్స్, బృందావనం, టెంపర్, బాద్షా, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత వంటి హిట్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. నటనలోనే కాకుండా డ్యాన్స్‌లో కూడా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. మరోవైపు ఆయన బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1కు హోస్ట్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్.. ఆ షో విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవైపు హౌస్‌మేట్స్‌ను ఆటపట్టిస్తూ, మరోవైపు తన మాటలతో వారిలో ఉత్సాహం నింపుతూ ఎన్టీఆర్ షోను నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొన్న పలువురు హౌస్మేట్స్ కూడా తారక్‌ను విషెస్ తెలిజేశారు. ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియో ద్వారా తారక్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ వీడియోను మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఆన్లైన్లో విడుదల చేశారు. తారక్‌కు విషెస్ చెప్పినవారిలో బిగ్‌బాస్ హౌస్మేట్స్.. ఆదర్శ్ బాలకృష్ణ, అర్చన, దీక్షాపంథ్, హరితేజ, శివ బాలజీ, ధన్‌రాజ్, ప్రిన్స్, కత్తి మహేష్, సంపూర్ణేష్ బాబు, మధుప్రియ, కత్తి కార్తీక, జ్యోతి, కల్పన, ముమైత్ ఖాన్లు ఉన్నారు. Extremely Happy to Release this #SpecialBirthdayvideo made with lots of love & regards for #Tarakanna Garu From our #BigBoss1Housemates Happy Birthday 🎈🎉♥️@tarak9999 Garu🤗#HappyBirthdayNTRhttps://t.co/RKZH3FFVsT@Dhanrajoffl @ActorSivabalaji@RaghuStarMaa — thaman S (@MusicThaman) May 20, 2020 -
శ్రీముఖి.. మైమరచి
బుల్లితెర నటి శ్రీముఖి తళుక్కుమంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం అనంతకు విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. ఆమెను చూసేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అభిమాన తారను చూసి మైమరచిపోయారు. పూలబొకేలిచ్చి.. ఆటోగ్రాఫ్‌లు తీసుకుని సంబరపడిపోయారు. అనంతపురం న్యూసిటీ: బెంగళూరు హైవేలో ఆదివారం హోటల్ బ్లిస్ ఆనంద్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కార్య క్రమానికి విచ్చేసిన యాంకర్, సినీ నటి శ్రీముఖిని చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రారంభోత్సవంలో ఎంపీ గోరంట్ల మాధవ్ దంపతులు, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎన్ఆర్ఐ నారాయణస్వామి, సత్యనారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నా జీవితంలో మర్చిపోలేనిది: శివజ్యోతి
తెలంగాణ భాష, యాసను వినిపించి బిగ్‌బాస్ సీజన్– 3 హౌజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి శివజ్యోతి టాప్– 5లో ఉంటానని ఆశించారు. ఓట్ల శాతం తగ్గడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత ఆదివారం హౌజ్ నుంచి బయటకు వచ్చారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం నాగంపేట గ్రామానికి చెందిన ఆమె తెలంగాణ యాసను నమ్ముకొని అక్కడి నుంచి ప్రయాణమై జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగు పెట్టారు. అక్కడ మహామహులను ఢీకొట్టి 14 వారాలపాటు తెలంగాణ భాషతో అందరినీ ఆకట్టుకున్నారు. ఏకంగా బిగ్‌బాస్‌తోనే తెలంగాణ భాషను పలికించారు. బిగ్‌బాస్ వ్యాఖ్యాత నాగార్జునతో తెలంగాణ యాసలోనే మాట్లాడించిన ఘనత కూడా సొంతం చేసుకున్నారు. ఇది తన జీవితంలో మర్చిపోలేనిదని ఆమె వెల్లడించారు. బిగ్‌బాస్ హౌజ్‌లో ఆమె ప్రయాణం.. ఎలిమినేషన్ దాకా దారి తీసిన పరిస్థితులు భవిష్యత్ వ్యూహాలపై తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు. – బంజారాహిల్స్ మావారే స్ఫూర్తి.. మాది నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగంపేట గ్రామం. ఇంటర్ వరకు చదివాను. నాన్న రాజమల్లేష్ ఆర్ఎంపీ. అమ్మ లావణ్య ఇప్పటికీ బీడీలు చుడుతుంది. నాకు ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. నా భర్త గంగూలీది కూడా మా ఊరే. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నా భర్తే నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం. ఎంతో గర్వంగా ఫీలయ్యేదాన్ని.. నేను ఆరేళ్ల క్రితం తార్నాకలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో పని చేస్తున్నప్పుడు తెలంగాణ భాషలో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి గమనించారు. నీ భాష, యాస బాగున్నాయమ్మా ఫలానా చానెల్లో ఇలాంటి గొంతు కోసం చూస్తున్నారని చెప్పడంతో బంజారాహిల్స్‌లోని ఓ చానెల్లో చక్కని అవకాశం, గుర్తింపు వచ్చింది. నా భాషనే నన్ను అందలం ఎక్కించింది. ఆ యాసనే నన్ను బిగ్‌బాస్ హౌజ్‌లోకి తీసుకొచ్చింది. నాకు ఇంతకంటే ఏం కావాలి. పొల్లుపోకుండా ప్రతి మాటను నా భాషలో మాట్లాడుతుంటే అందరూ ఎంతో ఆసక్తితో వినేవారు. ఇది నాకు చాలా గర్వంగా ఉండేది. కేసీఆర్ మాట్లాడుతుంటే కూడా ఇలాగే వినాలనిపిస్తుందని ఓ కంటెస్టెంట్ చెప్పిన మాటలు నాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. ఆ ఆనందం వర్ణనాతీతం నేను బిగ్‌బాస్ హౌజ్‌లోకి జూలై 21న అడుగు పెట్టాను. అక్టోబర్ 26న హౌజ్ నుంచి బయటకు వచ్చాను. 98 రోజుల పాటు నా ఆనందం వర్ణనాతీతం. హౌజ్‌లో ఎవరితోనూ గొడవలు లేవు. కాకపోతే అలీ, రవికృష్ణ, హిమజ, రోహిణి, అశురెడ్డి తదితరులు నా బెస్ట్ ఫ్రెండ్స్. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా మేము మా స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం. మిగతావారితో కూడా క్లోజ్‌గానే ఉండేదాన్ని. క్వాలిటీస్ స్ట్రాంగయ్యాయి ఈ 98 రోజుల జర్నీలో నా క్వాలిటీస్ మరింత స్ట్రాంగయ్యాయి. నేను చాలా మొండిదాన్ని. ఓపిక కూడా చాలా తక్కువ. ఆలోచించుకొని మాట్లాడటం నేర్చుకున్నాను. నేను సోది చెప్పకుండా మొహం మీదే మాట్లాడేస్తాను. బయట కూడా నేను ఇలాగే ఉంటాను. బిగ్‌బాస్ హౌజ్‌లో నుంచి గత ఆదివారమే బయటికి వచ్చాను. మూడు రోజలు పాటు నా బంధుమిత్రులతో కలుస్తున్నాను. మరో మూడు రోజుల్లో ఫైనల్ పోటీలున్నాయి. నేను కూడా హాజరు కావాల్సి ఉంది. ఫైనల్ తర్వాత నా భవిష్యత్ నిర్ణయం ఉంటుంది. రెండు టీవీ చానెళ్లు నన్ను ఆహ్వానిస్తున్నాయి. ఎందులోకి వెళ్తానో వారం రోజుల్లో తెలిసిపోతుంది. కలలో కూడా అనుకోలేదు.. భారీ అంచనాలతో నేను హౌజ్‌లోకి అడుగు పెట్టలేదు. నాతో పోటీ పడుతున్న వాళ్లను చూస్తే మొదట్లోనే చివరిదాకా ఉంటానా అని అనిపించింది. కానీ 14 వారాల జర్నీ నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఇక్కడిదాకా వస్తానని కలలో కూడా అనుకోలేదు. కాకపోతే టాప్– 5లో ఉండి ఉంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నా. ఇక చాలు.. చాలా మంది వచ్చే సీజన్లో అవకాశం ఇస్తే వెళ్తారా అని నన్ను అడుగుతున్నారు. మళ్లీ అవకాశం వచ్చినా వెళ్లను. ఎందుకంటే బిగ్‌బాస్ హౌజ్‌లో నేను ప్రతి స్కిట్లోనూ, టాస్క్‌లోనూ పాల్గొన్నాను. ఆడాను.. పాడాను.. అందరితో ఆనందాన్ని, బాధను పంచుకున్నాను. పచ్చిపులుసు.. అదుర్స్ నేను తెలంగాణ సంప్రదాయ వంటకం పచ్చిపులుసుతో అందరినీ ఆకట్టుకున్నాను. టమాటా రసం, సాంబారు చేసినా కంటెస్టెంట్లు మాత్రం ఎక్కువగా పచ్చి పులుసునే తినేవారు. నేను హౌజ్ నుంచి బయటికి వచ్చే రోజు కూడా పచ్చిపులుసుతోనే అందరికి వంటలు వండిపెట్టాను. నాకు కాకరకాయ కూర అంటే కూడా బాగా ఇష్టం. నేను వండిన ప్రతీ వంటకం అందరికీ నచ్చేది.