Ashu Reddy Bigg Boss Non Stop Entry Confirm By Rahul Sipligunj: బుల్లితెరపై ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమైంది. ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ పేరుతో 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్'లో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈనెల 26 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుండగా.. నో కామా, నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. తెలుగులో మొదటిసారిగా 24 గంటలు పాటు ప్రసారం కానున్న ఈ షోలో కంటెస్టెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇప్పటికే పులువురు సెలబ్రిటీలు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు వార్తలు విన్నాం.
అయితే తాజాగా ఒక మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఈ ఓటీటీ షోలో కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో సందడి చేయనున్నట్లు బిగ్‌బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. అయితే బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి సీజన్లో అషు రెడ్డి ఎంట్రీ ఇస్తుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ఒక్క కంటెస్టెంట్ పేరు ప్రకటించలేదు. ఈ క్రమంలో రాహుల్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. 'ఆల్ ది బెస్ట్ అషు.. దేనికి చెప్పానో నువే ఆలోచించుకో' అంటూ పోస్ట్ చేశాడు రాహుల్. దీంతో అందరూ అషు రెడ్డి బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఎంట్రీ ఇస్తుందని చర్చించుకుంటున్నారు.
Bigg Boss OTT Telugu: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోకి బోల్డ్ బ్యూటీ !.. రాహుల్ ఇలా కన్ఫర్మ్ చేశాడా ?
Published Mon, Feb 21 2022 4:24 PM | Last Updated on Mon, Feb 21 2022 7:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment