Bigg Boss 6 Telugu: Hemachandra, Sravana Bhargavi Likely To Paticipate In BB6 Show - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌లోకి స్టార్‌ సింగర్స్‌ దంపతులు? ఇక ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే..

Published Sat, Aug 27 2022 2:59 PM | Last Updated on Thu, Sep 1 2022 1:06 PM

Hemachandra and Sravana Bhargavi May Contestants in Bigg Boss 6 - Sakshi

దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగు ఈ షో 5 సీజన్లు పూర్తి చేసుకుని 6వ సీజన్‌కు రెడీ అవుతోంది. సెప్టెంబర్‌ 4 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు ఇటివలె స్టార్‌ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే కొందరి కంటెస్టెంట్స్‌ పేర్లు రాగా తాజాగా ఓ స్టార్ జంట పేర్లు తెరపైకి వచ్చాయి. రీసెంట్‌గా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలిచిన ఈ స్టార్‌ సింగర్స్‌ ఈ సీజన్‌లో హౌజ్‌లో సందడి చేయబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ జంట ఎవరనేది ఇప్పటికే మీకో క్లారిటీ వచ్చినట్టుంది కదా. 

చదవండి: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్‌ బ్యూటీ ఫైర్‌!

అవును మీరు అనుకుంటున్నట్టుగానే సింగర్‌ హేమచంద్ర ఆయన భార్య, గాయనీ శ్రావణ భార్గవిలు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారట. గత 3వ సీజన్‌లో వరుణ్‌ సందేశ్‌-వితిక దంపతులు హౌజ్‌లో అలరించిన సంగతి తెలిసిందే. అదే రిపీట్‌ చేస్తూ ఈ సారి హేమచంద్ర, శ్రావణ భార్గవిలను హౌజ్‌లోకి తీసుకువస్తున్నారట నిర్వహాకులు. ఇందుకోసం వారికి భారీగా రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పుదు. ఇక వారు విడాకులు తీసుకుబోతున్నారంటూ వచ్చిన వార్తలను ఈ జంట ఇప్పటికే ఖండిచింది.

చదవండి: జూ.ఎన్టీఆర్‌-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా?

అయినప్పటికీ ఈ రూమర్స్‌ ఇంకా చెక్‌ పడలేదు. వారి మధ్య ఏదో జరుగుతుందంటూ శ్రావణ భార్గవి వ్యవహరం పట్ల పరువురు సందేహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ జంట బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వస్తే ప్రేక్షకులకు రెట్టింపు వినోదమే అంటున్నారు నెటిజన్లు. కాగా గత 3 సీజన్లుగా తెలుగు బిగ్‌బాస్‌కు హోస్ట్‌ చేస్తూ షోని సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ చేస్తున్నారు కింగ్‌ నాగార్జున. ఇక ఈ ఆరవ సీజన్‌కు కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌కు సంబంధించిన విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారనే దానిపై సెప్టెంబర్‌ 4వ తేదీతో స్పష్టత రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement