హైదరాబాద్: తీన్మార్ వార్తలతో సుపరిచితుడైన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ త్వరలో రియాల్టీ షోలో కనిపించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. బుల్లితెర హిట్ షో 'బిగ్‌బాస్ సీజన్ 4' కోసమే సత్తి తాను పనిచేస్తున్న టీవీ చానల్‌కు రాజీనామా చేసినట్టు సమాచారం. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టేందుకు సత్తి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు వినికిడి. కాగా ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులు పార్టిసిపెంట్ల వేట మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనూ కొందరి పేర్లు లీక్ అయ్యాయి.
తాజాగా వీరి సరసన సత్తి చేరాడు. అయితే చివరాఖరికి బిగ్‌బాస్ నిర్వాహకులు ఎవరిని ఖరారు చేయనున్నారో చూడాలి. గతంలో బిత్తిరి సత్తితో పాటు వార్తలు చదివి పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా బిగ్‌బాస్ తదుపరి సీజన్ మరింత ఆలస్యం కానుంది. ఈ ఏడాది చివరికి ఈ షో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. (బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?)
Comments
Please login to add a commentAdd a comment