బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం.. దోమకు అర్థమేంటో తెలుసా? | Bigg Boss Telugu Season 8 Full Fun With RJ Sekhar Basha, Check His Punch Dialogues Videos Goes Viral | Sakshi
Sakshi News home page

Sekhar Basha Jokes Videos: బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం.. హౌస్‌లో అవే పంచ్‌లు!

Published Tue, Sep 10 2024 2:57 PM | Last Updated on Tue, Sep 10 2024 3:36 PM

Bigg Boss Telugu Season 8 Full Fun With RJ Sekhar Basha Netizens Comments Viral

బిగ్‌బాస్ సీజన్‌ -8 బుల్లితెర ప్రియులను సరికొత్తగా అలరిస్తోంది. ఒకటి, రెండు తెలిసిన మొహాలు మినహాయిస్తే.. అంతా కొత్త వారే ఈ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓ వారం ముగిసింది. ఎప్పటిలాగే ఆనవాయితీని కొనసాగిస్తూ లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బెజవాడ బేబక్క వారం రోజుల్లోనే ఇంటిదారి పట్టింది. అప్పుడే రెండో వారం నామినేషన్స్‌ ప్రక్రియ కూడా మొదలైపోయింది. 

అయితే ఈ సారి అంతా కొత్త ముఖాలే కావడంతో హౌస్‌లో కాస్తా ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. లిమిట్‌లెస్‌ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్‌లో హౌస్‌లో అంతో, ఇంతో మెప్పిస్తోన్న కంటెస్టెంట్‌ మాత్రం ఒకరు ఉన్నారు. అతని వల్లే హౌస్‌లో నవ్వులు పూస్తున్నాయి. అతను మరెవరో కాదు.. రాజ్ తరుణ్ ఫ్రెండ్‌ ఆ‍ర్జే శేఖర్ భాషా.

(ఇది చదవండి: విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్‌.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు)

రేడియో జాకీగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శేఖర్ భాషా హౌస్‌లోనూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. తన ఫన్నీ పంచ్‌లతో హౌస్‌ను ఫుల్ కామెడీని ఎంటర్‌టైనర్‌గా మార్చేశాడు. ఏకంగా  జబర్దస్త్‌ కామెడీ షోను మించిన పంచ్‌లతో అదరగొడుతున్నాడు. దీంతో ఆర్జే శేఖర్ భాషా  బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం అంటూ నెటిజన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా శేఖర్ భాషా కామెడీ క్లిప్స్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆణిముత్యాల్లాంటి జోకులను చూసి ఎంజాయ్ చేయండి. 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement