విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్‌.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు | Sonia Viral Comments On Vishnu Priya In Bigg Boss Telugu 8 | Sakshi
Sakshi News home page

విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్‌.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు

Published Tue, Sep 10 2024 2:09 PM | Last Updated on Tue, Sep 10 2024 3:39 PM

Sonia Viral Comments On Vishnu Priya In Bigg Boss Telugu 8

బిగ్‌ బాస్‌ షో రెండో వారంలో అడుగుపెట్టింది. తాజాగా ప్రారంభమైన నామినేషన్‌ ప్రక్రియలో తీవ్రమైన చర్చ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌లో   కిర్రాక్ సీత, యాంకర్ విష్ణుప్రియలను మాటలతో సోనియా టార్గెట్‌ చేసింది. ముఖ్యంగా యాంకర్‌ విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.  పర్సనల్‌ ఎటాక్‌కు దిగిందంటూ సోనియాపై ఫైర్‌ అవుతున్నారు.

రెండో వారం నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా విష్ణుప్రియ ఇద్దరిని ఎంచుకుంటుంది. మొదట మణికంఠను నామినేషన​ చేసిన విష్ణు ఆపై సోనియాను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంతకు విష్ణుప్రియ మీద సోనియా ఎలాంటి కామెంట్లు చేసిందంటే.

నువ్వు ముందు దుస్తులు సరిగ్గా వేసుకోవు.. అలాంటి దుస్తులతోనే ఇతరుల పక్కన నిల్చుంటావ్‌.. నీ వల్ల వారు డిస్‌కంఫర్ట్ అవుతున్నా సరే వారి పక్కన నిల్చుంటావ్‌. నీ మాటలు, చేతలు హౌజ్‌లో  చాలా తేడా ఉన్నాయి.'  అని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగని సోనియా మరింత వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగింది.  విష్ణుప్రియను ఉద్దేశిస్తూ.. 'నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్ ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు, కానీ, నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారనుకుంటా.. నన్ను మాత్రం  అలాంటివి చేయడానికి పిలవలేదు. గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్‌ కాబట్టే బిగ్‌బాస్‌కు పిలిచారు' అంటూ విష్ణుప్రియను  సోనియా దారుణంగా అవమానించింది. 

దీంతో సోనియాకు భారీగా నెగటివిటీ వచ్చింది. సోనియా నోరుని డ్రైనేజీతో పోల్చి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సోనియాకు కాస్త తిక్క ఉందంటూ చెప్పుకొస్తున్నారు. సోనియా చేసిన కామెంట్లకు నాగార్జున గట్టగా రియాక్ట్‌ కావాలని నెటిజన్లు కోరుతున్నారు. ఈ వారం నామినేషన్‌ లిస్ట్‌లో సోనియా పేరు ఉంటే వీకెండ్‌లో ఆమె ఎలిమినేషన్‌ కావడం పక్కా అని బిగ్‌ బాస్‌ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement