Baby Movie Heroine Vaishnavi Chaitanya Bigg Boss 7 Entry Rumours Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Vaishnavi Chaitanya Bigg Boss 7 Entry: బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌గా వైష్ణవి.. సోషల్ మీడియాలో వైరల్!

Published Fri, Jul 21 2023 1:21 PM | Last Updated on Wed, Sep 6 2023 10:18 AM

Baby Movie Heroine Vaishnavi Chaitanya Enters Into Bigg Boss House - Sakshi

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో మరో సీజన్‌కు రెడీ అయిపోయింది.  త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది.  ఇప్పటికే ప్రోమో రిలీజ్ కాగా.. కంటెస్టెంట్స్ ఎవరన్నా దానిపై ప్రత్యేక చర్చ మొదలైంది. ఇప్పటికే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.  ఇటీవల ప్రముఖ యూట్యూబర్ బ్యాంకాక్ పిల్ల సైతం బిగ్‌ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి  తెలిసిందే. అయితే మేకర్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

(ఇది చదవండి: చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!)

కానీ ఆ లోపే కొంతమంది సెలబ్రిటీల పేర్లను నెటిజన్స్ ముందుగానే చెప్పేస్తున్నారు.  ఈ సీజన్‌లో ముఖ్యంగా అమర్ దీప్ చౌదరి, తేజస్విని జంటను హౌస్‌లోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.  బుల్లితెర నటి శోభా శెట్టి పేరు కూడా వినిపిస్తోంది. వారితో పాటు సింగర్ మోహన భోగరాజు,  యూట్యూబర్ శ్వేతా నాయుడు, యాంకర్ దీపికా పిల్లి పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పేరు తెరమీదకొచ్చింది.

ఇప్పుడిపప్పుడే మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టనుందని ఓ వార్త తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఎవరినోటా విన్నా బేబీ మూవీ గురించే చర్చ జరుగుతోంది. ట్రయాంగిల్‌ లవ్ స్టోరిగా సాయి రాజేశ్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా బేబీ హీరోయిన్ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బేబీ సినిమా వైష్ణవి చైతన్య కెరీర్‌కు ఓ టర్నింగ్‌ పాయింట్ అనే చెప్పవచ్చు. 

(ఇది చదవండి: తమన్నాతో పెళ్లి.. వారింట్లో నుంచి విజయ్‌పై పెరుగుతున్న ఒత్తిడి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement