![Tik Tok Star Shanmukh jaswanth Car Hit Vehicles In Jubilee Hills - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/27/shanmukh-tik-tok-star_3.jpg.webp?itok=SqXDLmMJ)
సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెం.10లో కారుతో బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లి స్థానికంగా ఆందోళన రేకెత్తించాడు. అతివేగంతో కారు నడిపిన షణ్ముఖ్.. రెండు కార్లు, రెండు బైక్‌లను ఢీకొట్టాడు. దీనికి అతను మద్యం సేవించి ఉండటమే ప్రధానకారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం షణ్ముక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment