కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్త.. తీవ్ర గాయాలు | Preeti Jhangiani Husband Parvin Dabas Car Accident | Sakshi
Sakshi News home page

Parvin Dabas: కారు ప్రమాదం.. హిందీ నటుడి పరిస్థితి విషమం

Published Sat, Sep 21 2024 12:22 PM | Last Updated on Sat, Sep 21 2024 12:35 PM

Preeti Jhangiani Husband Parvin Dabas Car Accident

తెలుగులో తమ్ముడు, నరసింహనాయడు తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది ప్రీతి జింగానియా. ఇప్పుడు ఈమె భర్త ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలు కావడంతో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి ఇతడిని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భర్తకి ప్రమాదం జరగడంపై ప్రీతి కూడా స్పందించింది.

'నా కుటుంబమంతా షాక్‌లో ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. తెల్లవారుజామున నా భర్తకి కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదని డాక్టర్స్ చెప్పరాు. వైద్య పరీక్షలు చేస్తున్నారు' అని ప్రీతి జింగానియా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)

పవన్ కల్యాణ్ 'తమ్ముడు' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి.. ఆ తర్వాత బాలకృష్ణతో 'నరసింహనాయుడు', మోహనబాబుతో 'అధిపతి', రాజేంద్ర ప్రసాద్ 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ 'యమదొంగ'లో ప్రత్యేక గీతంలో నర్తించింది. చివరగా 'విశాఖ ఎక్స్‌ప్రెస్'  మూవీలో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయింది.

ఇక ఫ్యామిలీ విషయానికొస్తే 2008లో నటుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పర్వీన్ కూడా హిందీలో 'మాన్‌సూన్ వెడ్డింగ్', 'ఖోస్లా కా ఘోస్లా', 'రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2' తదితర సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'శర్మజీ కీ భేటీ' చిత్రంలో కనిపించాడు. 

(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement