Preeti Jhangiani
-
కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్త.. తీవ్ర గాయాలు
తెలుగులో తమ్ముడు, నరసింహనాయడు తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసింది ప్రీతి జింగానియా. ఇప్పుడు ఈమె భర్త ప్రయాణిస్తున్న కారు శనివారం ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలు కావడంతో బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి ఇతడిని హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భర్తకి ప్రమాదం జరగడంపై ప్రీతి కూడా స్పందించింది.'నా కుటుంబమంతా షాక్‌లో ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. తెల్లవారుజామున నా భర్తకి కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదని డాక్టర్స్ చెప్పరాు. వైద్య పరీక్షలు చేస్తున్నారు' అని ప్రీతి జింగానియా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీనియర్ నటి కన్నుమూత.. ముఖ్యమంత్రి సంతాపం)పవన్ కల్యాణ్ 'తమ్ముడు' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి.. ఆ తర్వాత బాలకృష్ణతో 'నరసింహనాయుడు', మోహనబాబుతో 'అధిపతి', రాజేంద్ర ప్రసాద్ 'అప్పారావు డ్రైవింగ్ స్కూల్' సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ 'యమదొంగ'లో ప్రత్యేక గీతంలో నర్తించింది. చివరగా 'విశాఖ ఎక్స్‌ప్రెస్' మూవీలో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయింది.ఇక ఫ్యామిలీ విషయానికొస్తే 2008లో నటుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పర్వీన్ కూడా హిందీలో 'మాన్సూన్ వెడ్డింగ్', 'ఖోస్లా కా ఘోస్లా', 'రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2' తదితర సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది 'శర్మజీ కీ భేటీ' చిత్రంలో కనిపించాడు. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. డేట్ ఫిక్స్) -
ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఏకంగా 9 భాషల్లో నటించింది!
ఈమె ఓ తెలుగు సినిమాతో హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టింది. అది సూపర్‌హిట్ కావడంతో మంచి ఛాన్సులు దక్కించుకుంది. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. అయితే తొలి నాలుగు మూవీస్.. వరసగా తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో చేసింది. చాలామంది బ్యూటీస్‌కి సాధ్యం కాని విధంగా తొమ్మిది భాషల్లో నటించి అరుదైన రికార్డు సృష్టించింది. ఇన్ని చెప్పాం కదా మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న నటి పవన్ కల్యాణ్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, నాగార్జున, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. అవును మీలో కొంతమంది ఊహించింది కరెక్టే. ఈ బ్యూటీ పేరు ప్రీతి జింగానియా. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ భామ.. తొలుత ఓ ఆల్బమ్ సాంగ్‌లో కనిపించింది. ఆ తర్వాత పలు యాడ్స్ చేసింది. అలా ఈమెకు సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. (ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) ఈమెకు తొలుత ఓ మలయాళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే దీని కంటే ముందు పవన్‌తో చేసిన 'తమ్ముడు' చిత్రం రిలీజైంది. దీంతో తమ్ముడు బ్యూటీగా పేరు స్థిరపడిపోయింది. 1999లో ఈ చిత్రంతో పాటు ప్రీతి జింగానియా హీరోయిన్గా చేసిన మలయాళం, తమిళ మూవీస్ కూడా రిలీజయ్యాయి. ఓవరాల్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, రాజస్థానీ భాషల్లో ఈమె సినిమాలు చేయడం విశేషం. 18 ఏళ్ల కెరీర్లో దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించింది. ఓవైపు హీరోయిన్గా చేస్తుండగానే 2008లో నటుడు పర్విన్ దబ్బాస్ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమెకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అలా కొన్నాళ్ల పాటు యాక్టింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చింది. 2012లో తిరిగి సినిమాల్లోకి వచ్చింది. అయితే రీఎంట్రీలో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో 2017 తర్వాత నటనకు పూర్తిగా పుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. అయితే రీసెంట్గా రిలీజైన 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈమెని ఫస్ట్ ఎవరో అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత మాత్రం తెలుగు ప్రేక్షకులు గుర్తుపట్టేశారు. View this post on Instagram A post shared by Sabad (@sabadvisuals) View this post on Instagram A post shared by Preeti Jhangiani (@jhangianipreeti) (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
అందుకే సినిమాలకు దూరమయ్యా..: తమ్ముడు హీరోయిన్
తమ్ముడు, నరసింహనాయుడు, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ ప్రీతి జింగానియా. తర్వాత బాలీవుడ్ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన ఈ బ్యూటీ మధ్యలో ఓసారి తేజం సినిమాలో ఐటం సాంగ్‌లో మెరిసింది. 2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇటీవలే 'కఫాస్' వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఆమె సినిమాలకు దూరమవడానికి గల కారణాలను వెల్లడించింది. 'నేను కోరుకున్న రోల్స్ నాకు రాలేదు. నాకు వచ్చిన పాత్రలతో నేను సంతోషంగా లేను. సినిమాలో కీలకమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమాలో నేనే హైలైట్ అవ్వాలని చెప్పడం లేదు. కనీసం కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నా దాకా రానేలేదు. అలాంటప్పుడు ఏదో ఒకటి నేను నిరాశకు లోనవడం, నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని ఒక అడుగు వెనక్కు వేశాను. విక్టోరియా నెం.203 తర్వాత నేను ఏ హిందీ సినిమా చేయలేదు, కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను. ఈవెంట్లు, షోలు.. ఇలా చాలా చేశాను. కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నానని ఎప్పుడూ ఫీలవలేదు. కాకపోతే బాలీవుడ్ చిత్రాల్లో నటించడాన్ని మిస్ అయ్యాను. ఇప్పుడు నేను తిరిగొచ్చేశాను, మళ్లీ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది ప్రీతి జింగానియా. చదవండి: శామీర్‌పేట్ ఘటన.. నా పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ నటుడు సీరియస్ -
ముద్దు సీన్లలో నటించడం వాళ్లకు నచ్చేది కాదు: ప్రీతి జింగానియా
తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ప్రీతి జింగానియా గుర్తుండే ఉంటుంది. ఈ అమ్మడు సూపర్ హిట్ చిత్రం మొహబ్బతేన్ ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టింది. అందులో జిమ్మీ షెర్గిల్ని మైమరిపిస్తూ, సిగ్గుపడే డ్యాన్సర్ పాత్రను పోషించిన ప్రీతి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. గత రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్న తర్వాత, తను నిర్మాతగా మారింది. ప్రస్తుతం ఆమె నటించడానికి ఓటీటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టింది. ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తన సినీ పరిశ్రమ అనుభవాలను, పలు వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను 'చుయిముయి అమ్మాయి' లేదా 'మొహబ్బతిన్ అమ్మాయి' అని పిలుస్తారని, ఈ రెండు ట్యాగ్‌లతో చిక్కుకున్నందుకు ఓ వైపు బాగానే ఉన్నప్పటికీ మరో వైపు ప్రేక్షకులు కేవలం తనను మోడరన్ పాత్రలో కంటే చీరలోనే చూడటానికి ఇష్టపడుతుండడం కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పింది. అంతే గాక తాను ముద్దు సీన్లలో నటించడం కూడా ప్రేక్షకులకి నచ్చేది కాదని తెలిపింది. అయితే తనకు మాత్రం కెరీర్లో ఇతర పాత్రలను కూడా చేయాలని ఉందని ఎందుకంటే తాను ఓ నిస్సహాయ కోడలిలా ఉండడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ఇలా ఒక జోనర్‌కే పరిమితమై నటించడం ఎవరికైనా ఇష్టం ఉండదని చెప్పింది ప్రీతి. నటుడు పర్విన్ దాబాస్‌తో పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నారు. ప్రీతీ సినిమాలే కాక నిర్మ శాండల్ సోప్ యాడ్స్, అనేక ఇతర యాడ్స్‌లో కూడా కనిపించింది. -
పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్
తమ్ముడు, నరసింహానాయుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ ప్రీతీ జంగానియా గుర్తుండే ఉంటుంది. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసిన ప్రీతీ ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నారు. చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచారు. తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకున్నాడన్న కారణంతో పక్క అపార్ట్మెంట్లో నివాసముండే వ్యక్తిపై పోలీసు కంప్లయింట్ ఇచ్చారు ప్రీతీ. అపార్ట్మెంట్లో పిల్లలంతా కలిసి ఆడుకునే సమయంలో పిల్లల మధ్య గొడవ జరగగా.. ఓ వృద్ధుడు తన ఏడేళ్ల కొడుకుపై చేయి చేసుకోవటంతో పాటు అపార్ట్మెంట్ నుంచి బయటకు గెంటివేశారంటూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుంటుంబాలకు సర్దిచెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది.