తమ్ముడు, నరసింహనాయుడు, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్ ప్రీతి జింగానియా. తర్వాత బాలీవుడ్ చిత్రాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన ఈ బ్యూటీ మధ్యలో ఓసారి తేజం సినిమాలో ఐటం సాంగ్‌లో మెరిసింది. 2007లో వచ్చిన విక్టోరియా నెం. 203 సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె ఇటీవలే 'కఫాస్' వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చింది.
తాజాగా ఆమె సినిమాలకు దూరమవడానికి గల కారణాలను వెల్లడించింది. 'నేను కోరుకున్న రోల్స్ నాకు రాలేదు. నాకు వచ్చిన పాత్రలతో నేను సంతోషంగా లేను. సినిమాలో కీలకమైన పాత్ర చేయాలని ఉండేది. అలా అని సినిమాలో నేనే హైలైట్ అవ్వాలని చెప్పడం లేదు. కనీసం కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉండాలంటున్నాను. అదే నేను కోరుకుంది. కానీ అటువంటి పాత్రలు నా దాకా రానేలేదు. అలాంటప్పుడు ఏదో ఒకటి నేను నిరాశకు లోనవడం, నా అభిమానులను నిరుత్సాహపరచడం ఎందుకని ఒక అడుగు వెనక్కు వేశాను.
విక్టోరియా నెం.203 తర్వాత నేను ఏ హిందీ సినిమా చేయలేదు, కానీ పలు ప్రాంతీయ భాషల్లో నటించాను. ఈవెంట్లు, షోలు.. ఇలా చాలా చేశాను. కాబట్టి సినిమాలకు నేను దూరంగా ఉన్నానని ఎప్పుడూ ఫీలవలేదు. కాకపోతే బాలీవుడ్ చిత్రాల్లో నటించడాన్ని మిస్ అయ్యాను. ఇప్పుడు నేను తిరిగొచ్చేశాను, మళ్లీ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నాను. సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది ప్రీతి జింగానియా.
చదవండి: శామీర్‌పేట్ ఘటన.. నా పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ నటుడు సీరియస్
Comments
Please login to add a commentAdd a comment