‘బిగ్‌బాస్‌’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్‌.. తుక్కుతుక్కైన కారు | Bigg Boss fame Shubhashree Met Car Accident | Sakshi
Sakshi News home page

‘బిగ్‌బాస్‌’ ఫేం శుభశ్రీకి యాక్సిడెంట్‌.. తప్పిన ప్రమాదం

Oct 6 2024 4:11 PM | Updated on Oct 6 2024 4:30 PM

Bigg Boss fame Shubhashree Met Car Accident

టాలీవుడ్‌ హీరోయిన్‌, బిగ్‌బాస్‌ ఫేం సుభాశ్రీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ సినిమా షూటింగ్‌ కోసం కారులో వెళ్తుండగా నాగార్జున సాగర్‌ మాచర్ల ఆర్టీసీ గ్యారేజీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

మద్యం మత్తులో ఉన్న ఓ బైక్‌ రైడర్‌.. ముందు నుంచి స్పీడ్‌గా వచ్చి శుభశ్రీ కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శుభశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు కానీ కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయింది.    అందరూ క్షేమంగా బయపడినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

కాగా, శుభశ్రీ పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌తో పాటు హీరోయిన్‌గా నటించింది. అయితే సినిమాల్లో రాని గుర్తింపు బిగ్‌బాస్‌ రియాల్టీ షోతో వచ్చింది. బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో శుభశ్రీ పాల్గొంది. తనదైన ఆట తీరుతో అందరిని ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా ఓ సినిమా రూపొందుతుంది. ఆ మూవీ షూటింగ్‌ కోసమే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement