హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఓ చిన్నారి అదృశ్యమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద వంటపని చేస్తున్న శరణప్ప దంపతులకు వైష్ణవి (5) అనే కుమార్తె ఉంది. అయితే ఆ పాప బుధవారం మధ్యహ్నం నుంచి కనిపించడంలేదు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి వైష్ణవిని 14 ఏళ్ల బాలిక తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ ఫూటేజీలో కనిపిస్తుండటంతో.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.