mla quarters
-
దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని శేజల్ అనే యువతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే వేధింపులకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఇప్పటికే పేర్కొంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ వీడియో, ఫొటోను శేజల్ విడుదల చేసింది. ఇక, ఈ వీడియోలో భాగంగా తాను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో ఉన్నట్టు తెలిపింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో(రూమ్ నెంబర్ 404) తనను మందు తాగమని ఎమ్మెల్యే వేధింపులకు గురిచేసినట్టు ఆవేదన వ్యక్తం చేసింది. బిజినెస్ మీటింగ్‌లో ఇలా మందు పార్టీ ఎందుకు పెట్టారు. బిజినెస్ మీటింగ్ అన్నప్పుడు దాని గురించే మాట్లాడాలి. మందు తాగుతూ నన్ను ఎందుకు వేధింపులకు గురిచేశారు. అది ఎమ్మెల్యే రూమ్ కాదని ఆయన మద్దతుదారులు అంటారు. కానీ, ఈ వీడియోలో ఎమ్మెల్యే తన భార్యతో కలిసి ఉన్న ఫొటో ఉంటుంది చూడండి అని అన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద ఇంకా ఆధారాలు ఉన్నాయని శేజల్ చెప్పుకొచ్చింది. తాము అనవసరంగా ఆరోపణలు చేయడంలేదని స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న ఆధారాలను పోలీసులు డిలీజ్ చేశారని తెలిపింది బాధితురాలు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తుంటే నేనెలా వీడియోలు, ఫొటోలు తీయాలని ప్రశ్నించారు. అయితే, తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించింది. అప్పటి వరకు ఢిల్లీలోనే ఉంటామని పేర్కొంది. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే చిన్నయ్యపై సంచలన ఆరోపణలు.. పనులు కావాలంటే అమ్మాయిలను పంపాల్సిందే.. -
దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్
-
అదిరే... కళ్లు చెదిరే
-
చూస్తే.. ‘ఫ్లాట్’ అయిపోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన నివాస గృహ సముదాయాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో జరిగిన గృహప్రవేశ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నివాస సముదాయంలోని భవనాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచారి, ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆదర్శ్‌నగర్, హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లు శిథిలావస్థకు చేరుకోవడంతో 2012లో కొత్తభవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నో ఆటంకాల అనంతరం పనులు పూర్తికావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి సహాయకులు, సిబ్బంది కోసం కొత్త నివాస గృహాలు అందుబాటులోకి వచ్చాయి. క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన ఫర్నీచర్ కాంగ్రెస్, మజ్లీస్ సభ్యుల డుమ్మా! కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ లోధా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఎమ్మెల్యేల కోసం నిర్మించిన భవన సముదాయం కొత్త నివాస సముదాయం హైలైట్స్ - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం 6,01,532 చదరపు అడుగుల విస్తీర్ణంలో 120 ఫ్లాట్లతో మెయిన్ బ్లాక్ నిర్మించారు. మూడు సెల్లార్లు+గ్రౌండ్ ఫ్లోర్+12 ఫ్లోర్లతో ఈ బ్లాక్ సిద్ధమైంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 2,500 చదరపు అడుగులు.. అంతస్తుకు 10 చొప్పున ఫ్లాట్లున్నాయి. ఒక్కో ఫ్లాట్‌లో పెద్దల పడక గది, పిల్లల పడక గది, అతిథుల పడక గది, కామన్ టాయిలెట్, కార్యాలయ గది, లివింగ్ అండ్ డైనింగ్ రూం, వంట గది, స్టోర్‌రూంలు ఉన్నాయి. - మెయిన్ బ్లాక్‌లోని సెల్లార్లో 81, ఒకటో సబ్ సెల్లార్లో 94, రెండో సబ్ సెల్లార్లో 101 276 కార్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. - మెయిన్ బ్లాక్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఎమ్మెల్యేల కోసం 150 చ.అడుగుల విస్తీర్ణంతో 23 క్యాబిన్లు, ఒక సెక్యూరిటీ రూం, 6 ప్యాసేజ్ లిఫ్టులు, 2 సర్వీసు లిఫ్టులు, 5 మెట్ల మార్గాలను ఏర్పాటు చేశారు. - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకుల (అటెం డెంట్ల) కోసం 120 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. - సిబ్బంది కోసం 36 ఫ్లాట్లను నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ 944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. - లక్షా 25 వేల 928 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ, మౌలిక సదుపాయాల బ్లాక్‌ను నిర్మిం చారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 4,128.50 చదరపు అడుగుల విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, కిచెన్‌తో కూడిన క్యాంటీన్, స్టోర్‌రూంల సదుపాయం ఉంది. తొలి అంతస్తులో 4,701 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆస్పత్రి, రెండో అంతస్తులో ఇండోర్ గేమ్స్, మూడో అంతస్తులో గ్రంథాలయం/రీడింగ్ హాల్, వ్యాయామశాల, ఆడియో విజువల్ రూం, నాలుగో ఫ్లోర్లో బాంకెట్ హాల్ సదుపాయం కల్పించారు. - భవన సముదాయం అవసరాల కోసం 0.73 ఎంఎల్డీ నిల్వ సామర్థ్యంతో మంచినీటి సంపు నిర్మించారు. - 250 కేఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. -
ఎమ్మెల్యే క్వార్టర్లను త్వరలోనే ప్రారంభిస్తాం
హైదరాబాద్: సకల వసతులతో నిర్మించిన కొత్త ఎమ్మెల్యే క్వార్టర్ల ప్రాంగణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్ల సముదాయాన్ని సందర్శించారు. క్వార్టర్లలో సదుపాయాలు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుత శాసనసభలో మొత్తం 120 మంది సభ్యులుగా ఉన్నారు. సభ్యులకు అన్ని వసతులతో నివాసాన్ని కల్పించాలని, ఇక్కడ ఉన్న పాత క్వార్టర్లను తొలగించి కొత్త నివాసాలను నిర్మించాం. మొత్తం 4.5 ఎకరాల్లో రూ.166 కోట్లతో 120 క్వార్టర్లను 12 అంతస్తులతో నిర్మాణం చేశాం. దీంతోపాటు 120 సర్వెంట్ క్వార్టర్లు, 36 స్టాఫ్ క్వార్టర్లను కూడా కట్టారు. ఇదే ప్రాంగణంలో క్లబ్ హౌస్, కార్యాలయం, సూపర్ మార్కెట్ కూడా నిర్మించారు. ప్రతి క్వార్టర్ 2,100 చదరపు అడుగులలో 3 బెడ్ రూంలతో ఉంది. 3 అంతస్తుల సెల్లార్లో 240 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో అతిథులతో సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదులు అందుబాటులో ఉన్నాయి. అన్ని నిర్మాణాలు పూర్తయి ప్రారంభో త్సవానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ప్రారంభిస్తాం. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయిస్తాం. అంతకంటే ముందు ఓ కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ సూచనలకు అనుగుణంగా సభ్యులకు క్వార్టర్లను కేటాయిస్తాం’’అని స్పీకర్ వివరించారు. స్పీకర్ వెంట అసెంబ్లీ కార్యదర్శి డా.నరసింహాచార్యులు, ఆర్ అండ్ బీ అధికారులు ఉన్నారు. -
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అత్యాచారం!
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ గది నెంబర్ 320లో ఓ బాలికపై అత్యాచారం జరిగినట్లు దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. బాధిత బాలిక ఓ నగల షాపులో పనిచేస్తుంటుంది. ఆ షాపు యజమాని మాయమాటలు చెప్పి ఆ బాలికను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని గది నెంబర్ 320లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో షాపు యజమాని మనోజ్ భగత్, రజత్ మదరేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్వార్టర్స్‌లో కార్యకర్తలు మినహా ఎమ్మెల్యేలు నివాసముండరు. సాధారణంగా వాటిలో చాలావరకు ఖాళీగానే ఉంటాయి. దీన్ని ఆసరాగా చేసుకుని మనోజ్ ఆ బాలికను తీసుకుని వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పోలీసు బందోబస్తు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అత్యాచారం ఎలా జరిగిందనే విషయం అంతుచిక్కడం లేదు. శివసేన నాయకురాలు నీలమ్ గోర్హే ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బాలిక అదృశ్యం
హైదరాబాద్ : నగరంలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఓ చిన్నారి అదృశ్యమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం వద్ద వంటపని చేస్తున్న శరణప్ప దంపతులకు వైష్ణవి (5) అనే కుమార్తె ఉంది. అయితే ఆ పాప బుధవారం మధ్యహ్నం నుంచి కనిపించడంలేదు. పాఠశాలకు వెళ్లిన చిన్నారి తిరిగి ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. చిన్నారి వైష్ణవిని 14 ఏళ్ల బాలిక తీసుకెళ్తున్నట్లు సీసీ టీవీ ఫూటేజీలో కనిపిస్తుండటంతో.. పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
'అందులో ఉల్లంఘన లేదు'
-
'అందులో ఉల్లంఘన లేదు'
హైదరాబాద్: తనకు కేటాయించిన క్వార్టర్ మరమ్మతుల విషయంలో ఎలాంటి ఉల్లంఘన లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. తానంటే గిట్టని వారు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 'నాకు కేటాయించిన క్వార్టర్ పూర్తిగా దెబ్బతింది. అందుకే స్పీకర్ అనుమతి తీసుకుని మరమ్మతులు చేయించాను. గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు మరమ్మతులు చేయించారు. టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఏకంగా తనకు కేటాయించిన క్వార్టర్లో పైన ఓ పోర్షనే కట్టారు. నేను మరమ్మతులు చేయిస్తే ఆ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నా' అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. -
క్వార్టర్లు ఖాళీ చేయని మాజీలపై గద్దె ఆగ్రహం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే క్వార్టర్లను ఖాలీ చేయకుండా తిష్టవేసిన మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలపై క్వార్టర్ల కమిటీ చైర్మన్ గద్దె రామ్మోహన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 12 లోపు క్వార్టర్లను ఖాలీ చేయాల్సిందేనని రామ్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. లేదంటే క్వార్టర్లకు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. 134 ఎమ్మెల్యేలో 12 మంది మాత్రమే ఖాలీ చేశారని ఆయన తెలిపారు. దాంతో కొత్త ఎమ్మెల్యేలకు క్వార్టర్లు కేటాయించడం కష్టంగా మారిందని గద్దె రామ్మోహన్ తెలిపారు. -
క్వార్టర్లు ఖాళీ చేయకుంటే నీళ్లు, కరెంట్ కట్
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు రామలింగారెడ్డి హెచ్చరిక హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా వాటిని ఖాళీ చేయాలని.. లేకుంటే కరెంటు, మంచినీటి సరఫరా వంటివి నిలిపేస్తామని ఎమ్మెల్యేల వసతుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ లో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్), జి.కిషన్‌రెడ్డి (బీజేపీ), కోవా లక్ష్మి (టీఆర్ఎస్), ఎమ్మెల్సీలు కె.నాగేశ్వర్, పి.సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరుకు చెందిన ఎమ్మెల్యే సి.కె.బాబు ఉంటున్న క్వార్టర్‌ను ఖాళీ చేయాలని కోరిన అసెంబ్లీ సిబ్బందిని బెదిరించి, దుర్భాషలాడారని ఆరోపించారు. వెంటనే సి.కె.బాబు ఉంటున్న ఎంఎస్-2లోని 207 క్వార్టర్‌కు కరెంటును, నీటి సరఫరాను నిలిపేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఎంఎస్-1లో ఉంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలకు క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ ఆంధ్రా సర్కారు నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. ఎంఎస్-2లో ఉంటున్న 15 మంది ఆంధ్రా ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా క్వార్టర్టు ఖాళీ చేయకుంటే కరెంటు, నీటి సరఫరా నిలిపేస్తామని ఆయన హెచ్చరించారు.