
'అందులో ఉల్లంఘన లేదు'
హైదరాబాద్: తనకు కేటాయించిన క్వార్టర్ మరమ్మతుల విషయంలో ఎలాంటి ఉల్లంఘన లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. తానంటే గిట్టని వారు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
'నాకు కేటాయించిన క్వార్టర్ పూర్తిగా దెబ్బతింది.
అందుకే స్పీకర్ అనుమతి తీసుకుని మరమ్మతులు చేయించాను. గతంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు మరమ్మతులు చేయించారు. టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఏకంగా తనకు కేటాయించిన క్వార్టర్లో పైన ఓ పోర్షనే కట్టారు. నేను మరమ్మతులు చేయిస్తే ఆ విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నా' అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.