ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు రామలింగారెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా వాటిని ఖాళీ చేయాలని.. లేకుంటే కరెంటు, మంచినీటి సరఫరా వంటివి నిలిపేస్తామని ఎమ్మెల్యేల వసతుల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ లో ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. జి.చిన్నారెడ్డి (కాంగ్రెస్), జి.కిషన్‌రెడ్డి (బీజేపీ), కోవా లక్ష్మి (టీఆర్‌ఎస్), ఎమ్మెల్సీలు కె.నాగేశ్వర్, పి.సుధాకర్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రామలింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
చిత్తూరుకు చెందిన ఎమ్మెల్యే సి.కె.బాబు ఉంటున్న క్వార్టర్‌ను ఖాళీ చేయాలని కోరిన అసెంబ్లీ సిబ్బందిని బెదిరించి, దుర్భాషలాడారని ఆరోపించారు. వెంటనే సి.కె.బాబు ఉంటున్న ఎంఎస్-2లోని 207 క్వార్టర్‌కు కరెంటును, నీటి సరఫరాను నిలిపేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఎంఎస్-1లో ఉంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలకు క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ ఆంధ్రా సర్కారు నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. ఎంఎస్-2లో ఉంటున్న 15 మంది ఆంధ్రా ఎమ్మెల్యేలు వారం రోజుల్లోగా క్వార్టర్టు ఖాళీ చేయకుంటే కరెంటు, నీటి సరఫరా నిలిపేస్తామని ఆయన హెచ్చరించారు.
క్వార్టర్లు ఖాళీ చేయకుంటే నీళ్లు, కరెంట్ కట్
Published Thu, Jul 31 2014 2:18 AM | Last Updated on Sat, Jun 2 2018 4:00 PM
Advertisement
Advertisement