
ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలి
వారం రోజుల్లోగా ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ క్వార్టర్స్ అలాట్మెంట్ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ : వారం రోజుల్లోగా ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ క్వార్టర్స్ అలాట్మెంట్ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ఆదేశించారు. లేకుంటే కరెంట్, నీటి కనెక్షన్లు తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలకు వేర్వేరు క్వార్టర్స్ కేటాయించినా రెచ్చగొట్టే విధంగా ఆంధ్రా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని రామలింగారెడ్డి బుధవారమిక్కడ అన్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయినా ఇంకా ఆంధ్రుల పెత్తనం కొనసాగుతూనే ఉందని రామలింగారెడ్డి మండిపడ్డారు.