MLA quaters
-
బీజేపీ చీఫ్ విప్; రోడ్డుపైనుంచే విధులు..!
భువనేశ్వర్ : కియోంజర్ ఎమ్మెల్యే, ఒడిశా అసెంబ్లీలో బీజేపీ చీఫ్ విప్ మోహన్‌చరణ్ మాంఝి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఫుట్‌పాత్‌పై నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. తన దుస్థితికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని విమర్శించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకూ తనకు అధికారిక బంగ్లా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విపక్ష సభ్యులకు బంగ్లా కేటాయించకుండా పక్షపాతం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. బంగ్లా కేటాయించేవరకు రోడ్డుపైనుంచే కార్యకలాపాలు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. కనీసం రాష్ట్ర అతిథి గృహంలో ఒక గదినైనా కేటాయించాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు. ‘నెల రోజులైనా ఇప్పటివరకు బంగ్లా కేటాయించలేదు. ఇప్పటికే నా వ్యక్తిగత సహాయకుడిపై కూడా కొందరు దాడి చేసి.. విలువైన పత్రాలు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారు. కనీసం సెక్యూరిటీని కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా ఇంతవరకు స్పందించలేదు. నాలాగే చాలా మంది ఎమ్మెల్యేలకు గెస్ట్‌హౌజ్‌లు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’అని మాంఝి అన్నారు. కాగా, ఈ విషయం అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో దృష్టికి వెళ్లడంతో.. ఎమ్మెల్యేల సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యేలా చూస్తానని హామినిచ్చారు. మాంఝి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి
హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ముట్టడించారు. విద్యార్ధుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తోందని విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపించారు. జీవో నెం 36ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. -
ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలి
-
ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలి
హైదరాబాద్ : వారం రోజుల్లోగా ఆంధ్రా ఎమ్మెల్యేలు క్వార్టర్స్ ఖాళీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ క్వార్టర్స్ అలాట్మెంట్ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ఆదేశించారు. లేకుంటే కరెంట్, నీటి కనెక్షన్లు తొలగిస్తామని ఆయన హెచ్చరించారు. రెండు ప్రాంతాల ఎమ్మెల్యేలకు వేర్వేరు క్వార్టర్స్ కేటాయించినా రెచ్చగొట్టే విధంగా ఆంధ్రా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని రామలింగారెడ్డి బుధవారమిక్కడ అన్నారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రం విడిపోయినా ఇంకా ఆంధ్రుల పెత్తనం కొనసాగుతూనే ఉందని రామలింగారెడ్డి మండిపడ్డారు.