Devatha Serial Actress Vaishnavi Announced About Her Pregnancy, Video Viral - Sakshi
Sakshi News home page

TV Actress Vyshnavi Ramireddy: ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. తల్లి కాబోతున్న ‘దేవత’ సీరియల్‌ నటి వైష్ణవి

Published Fri, Sep 16 2022 5:09 PM | Last Updated on Fri, Sep 16 2022 6:31 PM

Devatha Serial Actress Vaishnavi Announce She Is Pregnant Now - Sakshi

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించే దేవత సీరియల్‌ నటి వైష్ణవి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం నటనకు గుడ్‌బై చెప్పిన ఆమె సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ పెట్టి తరచూ కొత్త వీడియోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తోంది. తాజాగా ఆమె కొత్త వీడియో రిలీజ్‌ చేస్తూ ఫాలోవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పింది.

చదవండి: నిర్మాతలతో అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు: నటి షాకింగ్‌ కామెంట్స్‌

తాను తల్లి కాబోతున్నానంటూ శుభవార్త పంచుకుంది. కొద్ది రోజులుగా తన యూట్యూబ్‌ చానల్లో ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వని వైష్ణవి.. తాజాగా ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. ఈ గ్యాప్‌ ఎందుకు వచ్చిందో చెబుతూ అసలు విషయం చెప్పేసింది. ‘మా ఇంట్లోకి ఓ కొత్త మెంబర్‌ రాబోతున్నారు. నేను ప్రెగ్నెంట్‌ అయ్యాను. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇంతకాలం గ్యాప్‌ తీసుకోవాల్సి వచ్చింది. చాలా వేయిట్‌ చేసిన అనంతరం ఇప్పుడు మీతో ఈ గుడ్‌న్యూస్‌ పంచుకుంటున్నా’ అని పేర్కొంది. అలాగే తన ఆరోగ్యం కూడా బాగుండటం లేదని, ఏం తిన్న వాంతులు అవుతున్నాయని చెప్పుకొచ్చిది. 

చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..

ఇంట్లో అందరు ప్రతి రెండు, మూడు గంటలకు తిను తిను అంటూ ఇబ్బంది పెడుతున్నారంంది. అనంతరం ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతినని తెలిపింది. అంతేగాకు ప్రెగ్నెన్సి సమయంలో తల్లిగా తను పాటించాల్సి జాగ్రత్తలు ఎంటనేవి కూడా కామెంట్స్‌ రూపంలో సూచించాలని, మీ అందరి సహకారం కావాలంటూ ఫాలోవర్స్‌ను కోరింది. ఆమె షేర్‌ చేసిన ఈ స్పెషల్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వైష్ణవి తల్లి కాబోతుందని తెలిసి ఆమె ఫాలోవర్స్‌ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement