TV Actress Vaishnavi Purchase Gold For Her Son - Sakshi
Sakshi News home page

Vyshnavee Gade: నెల రోజుల బుడ్డోడి కోసం 27 గ్రాములపైనే బంగారం కొన్న నటి

Published Fri, Mar 31 2023 7:04 PM | Last Updated on Fri, Mar 31 2023 7:58 PM

TV Actress Vaishnavi Purchase Gold For Her Son - Sakshi

బుల్లితెర నటి వైష్ణవి ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే! తనకు కొడుకు పుట్టగానే నటి తమ్ముడు ఆ సంతోషాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తమ కుటుంబంలోకి వెలుగులు తీసుకొచ్చిన పసివాడి కోసం తాజాగా నటి బంగారం కొనుగోలు చేసింది. ఆమె షాపింగ్‌ చూస్తే  నెల రోజులు కూడా నిండని బాబు కోసం ఇన్ని వస్తువులు కొనచ్చా? అని అనిపించక మానదు.

పిల్లలకు ఏమేం వేస్తారో అన్నీ చూపించండి అంటూ షాపింగ్‌ మొదలుపెట్టింది వైష్ణవి. కళ్లకు నచ్చినవాటిని పక్కనపెడుతూ షాపింగ్‌ కొనసాగించింది. బాబుకు దిష్టి తగలకుండా 4 గ్రాముల దిష్టిపూసల దండ జత తీసుకుంది. అలాగే 8 గ్రాముల కడెం(జత), 1 గ్రాము ఉంగరం, ఒక చైన్‌, 14 గ్రాముల బ్రేస్‌లెట్‌ తీసుకుంది. బంగారం షాపుకు వచ్చాక ఆడవాళ్ల కన్ను నగల మీద పడకుండా ఉంటుందా? కొత్తగా ఏమేం డిజైన్లు వచ్చాయో కనుక్కుంటూ వాటిని ఓసారి తనివితీరా చూసింది. పనిలో పనిగా తను కూడా బంగారు ఆభరణాలు కొనుక్కుంది. లక్ష్మీదేవి నెక్లెస్‌, మ్యాచింగ్‌ గాజులు, చెవికమ్మలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది.

ఇకపోతే నటి వైష్ణవి రామిరెడ్డి బుల్లితెరపై సీరియల్స్‌లో నటించింది. సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాక వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యతనిస్తూ నటనకు గుడ్‌బై చెప్పింది. సెప్టెంబర్‌లో గర్భవతినన్న విషయాన్ని వెల్లడించిన ఆమె ఆ మధ్య సీమంతం ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌గా మారాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement