హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం | missing two children found in east godavari | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం

Published Thu, Jul 21 2016 2:17 PM | Last Updated on Thu, Sep 6 2018 10:05 PM

missing two children found in east godavari

హైదరాబాద్: నగరంలోని హైదర్ గూడ నుంచి అదృశ్యమైన చిన్నారులు వైష్ణవి, మాధవి ఆచూకీ లభ్యమైంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో వీరిని కనుగొన్నారు. వీరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆరో తరగతి చదువుతున్న మాధవి గతంలో కూడా పారిపోయిందని చెప్పారు. వాచ్మన్ నుంచి రూ.500 తీసుకుందని, ఆ డబ్బు ఎక్కడిదని టీచర్ అడిగి  తల్లిదండ్రులను తీసుకురమ్మనడంతో భయంతో పారిపోయిందని వివరించారు.

వీరిని ఆచూకీ కోసం రైల్వేస్టేషన్లు, బస్లాండ్ ల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్టు చెప్పారు. మూడు బృందాలతో గాలింపు జరిపినట్టు తెలిపారు. చివరకు ఐ.పోలవరంలో తాతయ్య ఇంటికి చిన్నారులు వెళ్లినట్టు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement