DCP kamalasan reddy
-
మహాగణపతి నిమజ్జన యాత్రా ఇలా..
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తైతే.. వినాయక నిమజ్జనం పూర్తైందని పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకునే వారు. కానీ ఈ సారి మహాగణపతి నిమజ్జనం ముందే చేయాలని పోలీసులతో పాటు.. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. 15వ తేదీ సాయంత్రం 3గంటల్లోపు మహాగణపతి నిమజ్జనం పూర్తిచేయాలని రంగం సిద్ధం చేస్తున్నారు. 58 అడుగుల ఎత్తులో శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతి భక్తులకు ఈ సంవత్సరం విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇరువైపులా రెండు శక్తిపీఠాలతో మహాగణపతిని భక్తులు దర్శించుకున్నారు. గంగాయానం ఇలా.. 13వ తేదీ ఉదయం నుంచే పని ప్రారంభించిన షెడ్డు టీం 25 మంది సుధాకర్ నేతృత్వంలో 14 సాయంత్రం వరకు మహాగణపతి షెడ్డును తొలగించింది. మహాగణపతిని నిమజ్జనానికి తరలించే ఎస్టీసీ ట్రాన్‌సపోర్ట్‌కు చెందిన ట్రయిలర్ వాహనానికి పీడబ్ల్యూ వర్క్‌షాప్ పిట్టర్ టెక్నీషియన్ బి.మహేష్ ఆధ్వర్యంలో పది మంది వెల్డింగ్ పనులు పూర్తిచేశారు. సాయంత్రం వినాయక విగ్రహానికి వెల్డింగ్ పనులు నిర్వహించేందుకు రంగం సిద్దం చేశారు. రథసారధి ఎం. వెంకటరెడ్డి.. ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి తరలించేందుకు ఎస్టిసి కంపెనీలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎం.వెంకట్‌రెడ్డి డ్రైవర్‌గా విధులు నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వెంకట్‌రెడ్డి ఈ సారిగా మహాగణపతి రథసారధిగా గణనాథుణ్ణి నిమజ్జనానికి తరలించనున్నాడు. ట్రయిలర్ వాహనం... తొమ్మిదేళ్లుగా మహాగణపతి నిమజ్జనానికి తరలించేందుకు ఉపయోగించే ట్రయిలర్ వాహనానికి (ఎపి16 టిడి 4059) 49 టన్నుల బరువు మోసే సామర్థం ఉంది. 26 టైర్లు, 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే వాహనం దాదాపు 40 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనానికి తరలించనుంది. మహాగణపతి ఇరువైపులా ఉన్న కుడివైపు కలియుగ వేంకటేశ్వరుడు, ఎడమవైపు ఉన్న ‘‘శ్రీ భాలాజీ బృందావన సహిత గోవర్థనగిరి’’ విగ్రహాలను నిమజ్జనానికి శ్రీలక్మీనర్సింహ స్వామి ట్రాన్‌సపోర్ట్‌కు చెందిన బాబీ సమకూర్చే వాహనంలో నిమజ్జనానికి తరలిస్తారు. హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్ సామర్థం...... గత 11 సంవత్సరాలుగా ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం కోసం తరలించేందుకు రవి క్రేన్సకు చెందిన హైడ్రాలిక్ టెలిస్కోప్ హెవీ మొబైల్ క్రేన్‌ను ఇస్తున్నట్లు ఎం.డి. కె.వి. రావు తెలిపారు. ఈ జర్మనీలో తయారైన క్రేన్ బరువు 110 టన్నులు, 150 టన్నుల బరువును అవలీలగా పైకి ఎత్తగలదు. క్రేన్ జాక్ 50 మీటర్ల పైకి వెళ్తుంది. వెడల్పు 11 పీట్లు, పొడవు 60 పీట్లు ఉంటుంది. దీనికి 12 టైర్లు ఉంటాయి. ఒక్కో టైరు ఒక టన్ను బరువు 2 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీనికి 4 హై6డాలిక్ జాక్‌లు ఉంటాయి. 45 టన్నుల బరువున్న ఖైరతాబాద్ వినాయకుడిని క్రేన్ సునాయాసంగా తరలించగలదు. ఈ క్రేన్‌ను మహ్మద్ జమీల్ అపరేట్ చేస్తాడు. బారీ క్రేన్ ఆపరేటర్ మహ్మద్ జమీల్...... రవి క్రేన్‌స ఆధ్వర్యంలో ప్రతీ సంవ్సరం మహాగణపతిని ట్రయిలర్ వాహనంపైకి పెట్టడం, తిరిగి నిమజ్జనం చేయడం అంతా మహ్మద్ జమీల్ నిర్వహిస్తాడు. వేల మంది భక్తులు చూస్తుండగా మహాగణపతిని క్రేన్ సాయంతో గాల్లోకి ఎత్తి.. వాహనంపై ఆసీనుడయ్యే లా చేయడం నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటారు జమీల్. నిమజ్జన ఏర్పాట్లు.... 14వ తేది అర్థరాత్రి 12గంటలకు సింగరి సుదర్శన్ కుటుంబ సభ్యులు కలశం పూజ నిర్వహిస్తారు. ఆ తరువాత 1గంట నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు మహాగణపతికి వెల్డింగ్ పనులు, బారీ క్రేన్‌కు మహాగణపతిని అమర్చడం, వాహనంపై పెట్టి మరలా వెల్డింగ్ పనులు చేస్తారు. 5-6 గంటల మధ్య వాహనానికి అలంకరణ చేసి 15వ తేది ఉదయం 6గంటల కల్లా మహాగణపతి నిమజ్జనానికి సిద్దంగా ఉండేలా చూస్తామని ఉత్సవ కమిటి సభ్యులు సందీప్ తెలిపారు. ఉదయం 6గంటల నుంచి శోభాయాత్ర ప్రారంభమై 9గంటల కల్లా ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వరకు చేరుకుంటుంది. 9-12 గంటల వరకు క్రేన్ సెట్టింగ్, వెల్డింగ్ కట్ చేయడం పనులు పూర్తచేసుకున్న తరువాత మరో గంట సేపు పూజా, సన్మాన కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2-3 గంటల మధ్య (సూర్యాస్తమయం లోపు) మహాగణపతిని నిమజ్జనం చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మహాగణపతి రూట్ మ్యాప్..... ఖైరతాబాద్ మంటపం నుంచి సెన్షేషన్ థీయేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, హోంసైస్స్ కళాశాల మీదుగా ఇక్బాల్ మినార్ చౌరస్తా, సచివాలయం పాతగేటు అక్కడి నుంచి తెలుగుతల్లి చౌరస్తా వరకు రాగానే అక్కడ ఎడమ వైపుకు మలుపు తిరిగి లుంబినీ పార్క్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నెంబర్ క్రేన్ వరకు చేరుకుంటుంది. మహాగణపతికి భారీ బందోబస్తు...... నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో ఖైరతాబాద్ మహాగణపతికి బారీబందోబస్తు ఏర్పాటుచేశారు. 10రోజుల పాటు 200 మంది పోలీసులతో పాటు ముగ్గురు ఏసీపీలు, 6మంది ఇన్సస్పెక్టర్లు, 12మంది ఎస్ఐలు విధులు నిర్వహించారు. నిమజ్జనం రోజు అదనంగా మరో 200 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు. -
హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం
-
హైదరాబాద్ చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్: నగరంలోని హైదర్ గూడ నుంచి అదృశ్యమైన చిన్నారులు వైష్ణవి, మాధవి ఆచూకీ లభ్యమైంది. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో వీరిని కనుగొన్నారు. వీరిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. ఆరో తరగతి చదువుతున్న మాధవి గతంలో కూడా పారిపోయిందని చెప్పారు. వాచ్‌మన్ నుంచి రూ.500 తీసుకుందని, ఆ డబ్బు ఎక్కడిదని టీచర్ అడిగి తల్లిదండ్రులను తీసుకురమ్మనడంతో భయంతో పారిపోయిందని వివరించారు. వీరిని ఆచూకీ కోసం రైల్వేస్టేషన్లు, బస్లాండ్ ల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినట్టు చెప్పారు. మూడు బృందాలతో గాలింపు జరిపినట్టు తెలిపారు. చివరకు ఐ.పోలవరంలో తాతయ్య ఇంటికి చిన్నారులు వెళ్లినట్టు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
పోస్టుమార్టం నివేదిక రాకుండానే కేసు మూసేస్తారా?
♦ నా భర్త సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న వారందరినీ విచారించాలి ♦ ‘సాక్షి’తో కన్నీళ్ల పర్యంతమైన డాక్టర్ శశికుమార్ భార్య కాంతి సాక్షి, హైదరాబాద్: ఇరవై ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒక కుమార్తె. ఒక కుమారుడు. పిల్లలు చాలా చలాకీగా చదువుతున్నారు. వృత్తిపరంగా కాసులకు కొదవలేదు. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే ఊహించని పరిణామం. అన్నీ తానై చూసుకుంటున్న అతను చనిపోయాడనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హిమాయత్‌నగర్‌లో డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలేమి జరిగిందో తెలియక అంతులేని ఆవేదనలో శశికుమార్ భార్య కాంతి కుంగిపోయారు. తన భర్త మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన భర్త మరణంపై ఆమె మనసులో ముసురుకున్న అనుమానాలను ప్రపంచం ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ‘ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అయితే నా భర్తకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా నా ప్రశ్నలను అడగాలనుకుంటున్నా’నని ఆమె బాధాతప్త హృదయంతో మాట్లాడారు. హైదరాబాద్ చైతన్యపురి ప్రభాత్నగర్లోని తమ నివాసంలో ఆమె ‘సాక్షి’ మీడియాతో మాట్లాడారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే పోలీసులు కేసు మూస్తామని చెబుతుండటం బాధిస్తోందన్నారు. ఆయన వెంట తీసుకెళ్లిన కారు, బ్రీఫ్ కేసు జాడ ఇంకా తెలియలేదని చెప్పారు. బ్రీఫ్ కేసులో ఆయన సంతకం చేసిన చెక్‌బుక్ లీఫ్లు, ముఖ్యమైన ప్రొఫెషనల్ డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. ఆయన సూసైడ్ నోట్లో సాయికుమార్, ఓబుల్‌రెడ్డి, రమణారావు, చెన్నారెడ్డి, కేకే రెడ్డిలను శిక్షించాలని రాసిన దాని గురించి పోలీసులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మానసిక ఆందోళనకు గురయ్యారు లారెల్ హాస్పిటల్స్ విషయంలో రెండు నెలల నుంచి ఉదయ్, సాయికుమార్‌ల వల్ల శశికుమార్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని, తిండి కూడా సరిగా తినలేదని ఆమె చెప్పారు. ‘సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు వారి వద్ద నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. హిమాయత్‌నగర్‌కి రమ్మని చెప్పారు. అప్పుడు ఆయన మొహంలో ఆందోళన కనిపించింది. ఆయనతో మాట్లాడదామని అనుకునేలోపు వెళ్తున్నా అని బ్రీఫ్ కేసు పట్టుకొని కారులో బయలుదేరి వెళ్లారు. అయితే సాయంత్రం 5.30 గంటల సమయంలో హిమాయత్‌నగర్‌లో కాల్పులు జరిగాయన్న విషయం తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకి శశికుమార్ చనిపోయాడన్న విషయం తెలవడంతో అందరం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం’ అని ఆమె పేర్కొన్నారు. మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్న శశికుమార్‌ది ఎదుటివాళ్లను చంపాలనే మనస్తత్వం ఎంతమాత్రం కాదన్నారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కూడా కాదని కాంతి చెప్పారు. మొయినాబాద్ నక్కలపల్లిలోని ఫాంహౌస్‌కు శశికుమార్‌ను తీసుకెళ్లిందని మీడియాలో వస్తున్న వార్తల్లో కనిపిస్తున్న చంద్రకళ.. తన భర్త స్నేహితురాలిగా మాత్రమే తెలుసన్నారు. ఆత్మరక్షణ కోసమే రివాల్వర్ వెంట పెట్టుకునేవారని చెప్పారు. -
ఎవరి పాత్ర ఏంటి?
ముమ్మరంగా ‘డాక్టర్ కాల్పుల’ కేసు దర్యాప్తు ♦ సెల్‌ఫోన్ లొకేషన్లు, హోటల్ సీసీ కెమెరాల్లోని దృశ్యాల విశ్లేషణ ♦ సూసైడ్ నోట్, వేలిముద్రలు, తూటాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు.. ♦ హోటల్ వద్ద శశికుమార్ కారు స్వాధీనం.. సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌కుమార్, సాయికుమార్‌తోపాటు ఉన్న సూసైడ్‌నోట్‌లో ఉన్న ఇతర పేర్లు ఎవరివి..? వారితో శశికుమార్‌కు ఉన్న లావాదేవీలు ఏంటి..? ఆత్మహత్యకు ప్రేరేపించడంతో వారి పాత్ర ఉందా..? డాక్టర్ కాల్పుల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలే ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశా రు. డాక్టర్ల సెల్‌ఫోన్ లోకేషన్లు, హోటల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. వైద్యుల వేలిముద్రలు, శశికుమార్ రాసిన సూసైడ్ నోట్, తూటాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. హిమాయత్‌నగర్‌లో సోమవారం డాక్టర్ శశికుమార్ తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరపడం, అదే రాత్రి మొయినాబాద్‌లో తన స్నేహితురాలి ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయ్‌పై హత్యాయత్నం కేసును నారాయణగూడ పోలీసులు, శశి ఆత్మహత్య కేసును మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపింది తాను కాదని సూసైడ్ లేఖలో శశికుమార్ పేర్కొనడం, తన భర్తను హత్య చేశారని ఆయన భార్య కాంతి ఆరోపించిన నేపథ్యంలో మొయినాబాద్ పోలీ సులు ప్రాథమికంగా దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య స్థలంలో దొరికిన రివాల్వర్‌పై వేలి ముద్రలు శశివేనా కాదా నిర్ధారించుకునేందుకు ల్యాబ్‌కు పంపారు. సూసైడ్ నోట్లో చేతి రాత శశికుమార్దేనని ప్రాథమికంగా భావిస్తున్నా.. అధికారికంగా ధ్రువీకరించుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపుతున్నారు. హోటల్ వద్ద కారు స్వాధీనం... సోమవారం మధ్యాహ్నం హిమాయత్‌నగర్‌లోని మినర్వా కాఫీ షాప్‌లో సమావేశానికి శశికుమార్ సొంత కారులోనే వచ్చారు. అక్కడ్నుంచి మిగిలిన ఇద్దరితో కలిసి ఉదయ్‌కి చెందిన కారులో వెళ్లారు. దీంతో శశికుమార్ కారు హోటల్ వద్దే ఉండిపోయింది. పోలీసులు బుధవారం ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. తన భర్త బ్రీఫ్‌కేస్ కూడా మాయమైందని శశి భార్య ఆరోపించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు అధికారులు ఉదయ్, సాయిల ఆసుపత్రులు, వారి నివాసాల్లో తనిఖీ చేయాలని నిర్ణయించారు. అలాగే మినర్వా కాఫీ షాప్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించారు. ఇందులో డాక్టర్లు లోపలికి రావడం, కూర్చుని టిఫిన్/కాఫీ తీసుకోవడం, తిరిగి వెళ్లడం వంటి దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ముగ్గురికీ చెందిన సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్‌తో పాటు కాల్డిటేల్స్ను సేకరించి విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా వారు ఏ సమయంలో ఎక్కడున్నార? ఎవరితో సంప్రదింపులు జరిపారన్న అంశాలు తేలనున్నాయి. మరోపక్క ఉదయ్ శరీరం నుంచి వైద్యులు బయటకు తీసిన తూటాను, శశికుమార్ మృతదేహం వద్ద లభించిన తూటాతో పాటు ఆ రివాల్వర్‌ను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని నిర్ణయించారు. మిగిలిన వారు ఎవరు? సూసైడ్ నోట్లో ఉదయ్, సాయితో పాటు శశికుమార్ పేర్కొన్న వారు ఎవర న్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శశికుమార్‌ను ఫాంహౌస్‌లో దింపి వచ్చిన ఆయన స్నేహితురాలు చంద్రకళను కూడా ప్రశ్నించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. ఈ కేసులో సాయికుమార్ ప్రత్యక్ష సాక్షిగా మారాడు. అయితే కాల్పులు జరిపింది సాయికుమారే అని శశి సూసైట్ నోట్లో పేర్కొన్నాడు. దీంతో సాయి చేతి వేళ్ల మధ్యలో గన్‌షాట్ రెసిడ్యూ(జీఎస్సార్) ఉందా లేదా అన్నది నిర్ధారించునేందుకు పోలీసులు ఆయన నుంచి నమూనాలు సేకరించారు. వీటన్నింటినీ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తున్నారు. ఉదయ్‌ను కాల్చింది శశికుమారే ‘‘ప్రాథమికంగా లభించిన ఆధారాల ప్రకా రం ఉదయ్‌కుమార్‌పై కాల్పులు జరిపింది శశికుమార్‌గా తేలింది. ఈ కేసులో అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి చంద్రకళను మరోసారి ప్రశ్నిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’’ - మీడియాతో మధ్య మండల డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి -
కాల్పులు జరిపింది శశికుమారే!
లోరల్ ఆస్పత్రి భాగస్వామి ఉదయ్ కుమార్ మీద కాల్పులు జరిపింది.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమారేనని డీసీసీ కమలాసన్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కారులో వెళ్లేటప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉదయ్, పక్కసీట్లో సాయికుమార్ కూర్చోగా.. వెనకాల సీట్లో శశికుమార్ కూర్చున్నారు. చెవి దగ్గర కాల్చే అవకాశం వెనక కూర్చున్నవాళ్లకే ఉంటుందని, అందువల్ల కాల్పులు జరిపింది శశికుమారేనని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉదయ్ కుమార్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ఆయన పరిస్థితి కొంత మెరుగుపడినా, పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇక శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను కూడా నారాయణగూడ పోలీసులు విచారిస్తారని డీసీపీ తెలిపారు. ఆమెతో పాటు లోరల్ ఆస్పత్రికి చెందిన మిగిలిన డాక్టర్లను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అసలు వైద్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది, వాటాల వివాదం ఏంటన్న విషయాన్ని తెలుసుకుంటారు. -
ఉదయం 9.45 గంటలకు మహా గణపతికి తొలిపూజ
ఖైరతాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ నరసింహన్ దంపతులు గురువారం ఉదయం 9.45 గంటలకు తొలిపూజ నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యజ్ఞోపవీతం, కండువా సమర్పిస్తారు. పూజ పూర్తికాగానే సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ఆధ్వర్యంలో ఆరు వేల కిలోల మహాప్రసాదాన్ని క్రేన్‌తో మహా గణపతి చేతిలో పెడతారు. పటిష్ట భద్రత మహా గణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మెటల్ డిటెక్టర్లు, సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. స్థానికుల సౌకర్యార్ధం బారికేడ్లు తొలగించడం, తిరిగి మూసివేయడం వంటి పనులు చేయాలని, ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సైఫాబాద్ డీఐ ప్రకాశ్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ పూర్ణచందర్లకు డీసీపీ సూచించారు. పోలీసులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు సింగరి సుదర్శన్, మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డిక్టేటర్’ పాట విడుదల ఖైరతాబాద్‌లోని త్రిశక్తిమయ మోక్ష గణపతి వద్ద ‘డిక్టేటర్’ చిత్రంలోని ‘గం..గం.. గణేశా..’ పాటను గురువారం రాత్రి 7 గంటలకు విడుదల చేయునున్నారు. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, హీరోయిన్ అంజలి, దర్శకుడు శ్రీవాస్, గీత రచయిత రావుజోగయ్యు శాస్త్రి తదితరులు హాజరుకానున్నారు. ఖైరతాబాద్ గణేషుడి వద్ద ‘జియోనెట్’ వై-ఫై వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుంటారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐల్), రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఖైరతాబాద్ గణేశుడి వద్ద ‘జియోనెట్’ వై-ఫై సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సందర్శకులు తమ స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లపై జియో నుంచి వై-ఫై నెట్వర్క్ ద్వారా హైస్పీడ్ వైర్లెస్ కనెక్టివిటీ ప్రయోజనాలు పొందవచ్చన్నారు. -
నిజాం కళాశాల హాస్టల్లో పోలీసుల తనిఖీలు
-
నిజాం కళాశాల హాస్టల్లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ : బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహరా తప్పించుకొని కొందరు తెలంగాణవాదులు ఎల్బీ స్టేడియం వైపుకు దూసుకు వచ్చారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీఎన్జీవోలు ఈరోజు సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు నిజాం కళాశాల హాస్టల్ గదుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు తప్ప మిగతావారు బయటకు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి స్వయంగా వచ్చి విద్యార్థులుతో మాట్లాడారు. అలాగే కళాశాల హాస్టల్ ప్రాంగణంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు సుమన్‌ను పోలీసులు ముందస్తుగా నిజాం కళాశాల హాస్టల్లో అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలను నిరసిస్తూ విద్యార్థులు అక్కడ బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రికంగా మారింది.