నిజాం కళాశాల హాస్టల్లో పోలీసుల తనిఖీలు | Police surround nizam college hostel clear protesters | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 7 2013 10:20 AM | Last Updated on Thu, Mar 21 2024 9:11 AM

: బషీర్బాగ్ ప్రెస్క్లబ్ వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల పహరా తప్పించుకొని కొందరు తెలంగాణవాదులు ఎల్బీ స్టేడియం వైపుకు దూసుకు వచ్చారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీఎన్జీవోలు ఈరోజు సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు నిజాం కళాశాల హాస్టల్ గదుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు తప్ప మిగతావారు బయటకు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి స్వయంగా వచ్చి విద్యార్థులుతో మాట్లాడారు. అలాగే కళాశాల హాస్టల్ ప్రాంగణంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా టీఆర్ఎస్వీ అధ్యక్షుడు సుమన్ను పోలీసులు ముందస్తుగా నిజాం కళాశాల హాస్టల్లో అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల చర్యలను నిరసిస్తూ విద్యార్థులు అక్కడ బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రికంగా మారింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement