కాల్పులు జరిపింది శశికుమారే! | shashi kumar himself shot uday, says dcp after priliminary investigation | Sakshi
Sakshi News home page

కాల్పులు జరిపింది శశికుమారే!

Published Wed, Feb 10 2016 12:43 PM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

కాల్పులు జరిపింది శశికుమారే!

కాల్పులు జరిపింది శశికుమారే!

లోరల్ ఆస్పత్రి భాగస్వామి ఉదయ్ కుమార్ మీద కాల్పులు జరిపింది.. ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ శశికుమారేనని డీసీసీ కమలాసన్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం వెల్లడైందని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. కారులో వెళ్లేటప్పుడు డ్రైవింగ్ సీట్లో ఉదయ్, పక్కసీట్లో సాయికుమార్ కూర్చోగా.. వెనకాల సీట్లో శశికుమార్ కూర్చున్నారు. చెవి దగ్గర కాల్చే అవకాశం వెనక కూర్చున్నవాళ్లకే ఉంటుందని, అందువల్ల కాల్పులు జరిపింది శశికుమారేనని భావిస్తున్నామన్నారు.

ప్రస్తుతం ఉదయ్ కుమార్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ఆయన పరిస్థితి కొంత మెరుగుపడినా, పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇక శశికుమార్ స్నేహితురాలు చంద్రకళను కూడా నారాయణగూడ పోలీసులు విచారిస్తారని డీసీపీ తెలిపారు. ఆమెతో పాటు లోరల్ ఆస్పత్రికి చెందిన మిగిలిన డాక్టర్లను కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అసలు వైద్యుల మధ్య వివాదం ఎందుకు వచ్చింది, వాటాల వివాదం ఏంటన్న విషయాన్ని తెలుసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement