అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా | Telangana Mahabubnagar Collector Venkat Rao Adopted The Orphane Student | Sakshi
Sakshi News home page

అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా

Published Mon, Nov 22 2021 1:03 AM | Last Updated on Mon, Nov 22 2021 1:03 AM

Telangana Mahabubnagar Collector Venkat Rao Adopted The Orphane Student - Sakshi

దత్తత తీసుకున్న విద్యార్థిని, అమ్మమ్మతో కలెక్టర్‌ 

నవాబుపేట: అధికారం చాలా మందికి ఉంటుంది... కానీ ఆదుకునే గుణం అందులో కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ వెంకట్రావ్‌ ఉంటారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్‌... నవాబుపేటలోని కేజీబీవీకి వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను చూసేందుకు ఆదివారం హాస్టల్‌కు వచ్చిన బంధువులతో ఆయన మాట్లాడారు. చాలామంది తమ పిల్లలకు పండ్లు, ఇతర వస్తువులు తెచ్చామని చెబితే... ఓ అవ్వ మాత్రం తన మనవరాలిని చూసేందుకు వచ్చానని, కట్టుకునేందుకు పాత దుస్తులు తెచ్చానంది.

తల్లిదండ్రి లేని తన మనవరాలు ఇక్కడే ఆరోతరగతి చదువుతోందని, అన్నీ తానై చూసుకుంటున్నానని చెప్పి కంటతడిపెట్టింది. అవ్వ మాటలు విన్న కలెక్టర్‌ చలించిపోయారు. ఆ విద్యార్థినిని పిలిపించి మాట్లాడారు. ‘ఇంటర్‌ వరకు ఇక్కడే ఉంటది, ఇంకెందుకు బెంగ’అని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎవరు చూసుకుంటారని ఆ బాలిక కన్నీళ్లు కార్చడంతో కలెక్టర్‌ కదిలిపోయారు. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నావని ప్రశ్నించగా, పోలీçసు అధికారి కావాలని ఉందని బాలిక సమాధానం చెప్పింది.

దీంతో కలెక్టర్‌ ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్‌ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యార్థిని మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement