venkat rao
-
దేహం.. గాలిలో కదిలే దీపం!
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఇక్కడ దేనికి, ఎప్పుడు కాలం చెల్లిపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక, ఇక్కడ శాశ్వతమైనది ఏది? అని ప్రశ్న వేసుకుంటే ‘అంతాన్ని గురించిన అనిశ్చితియే!’ అనే సమాధానం దొరుకుతుంది. ఆ అనిశ్చితిని మనసులో ఒక వాస్తవంగా స్థాపించుకున్న వ్యక్తికి దుఃఖం దూరమై, ముక్తి దగ్గరౌతుందని విజ్ఞులు చెప్పారు.వేదాంత పరమైన ఈ వాస్తవాన్ని కనుపర్తి అబ్బయా మాత్యుడు, తాను రచించిన ‘కవిరాజ మనోరంజనం’ ప్రథమాశ్వాసంలోని ఒక సన్నివేశంలో పురూరవుడికి, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణలో భాగంగా ఒక చక్కటి పద్యంలో చెప్పాడు. తన జనరంజక పాలనను గొప్పగా పొగుడుతున్న నారదుడితో పురూరవుడు ఎందరో రాజులు ఈ పుడమిని ఇంతకు మునుపు గొప్పగా పాలించారు కనుక తనను అంతగా పొగడవలసిన పనిలేదని చెప్పాడు. ఆపై సంభాషణ కొనసాగింపుగా ఇలా అంటాడు..దేహము వాయుసంచలిత దీపిక, పుత్రకళత్ర మిత్ర సందోహము స్వప్నకాలమున దోచెడి సందడి రాజ్యభోగ సన్నాహము జంత్రపుంబ్రతిమ నాట్యము సంపద యింద్రజాల మీయైహికసౌఖ్య మేమి సుఖమంచు దలంచెదనయ్య నారదా!పద్యం ప్రారంభంలోని ‘దేహము వాయుసంచలిత దీపిక’ అనే మాట లలో సామాన్యము, విశేషము అయిన రెండు భావాలు అవగత మౌతాయి. మానవ దేహం గాలిలో కదులుతున్న దీపం వంటిది. ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఆ కారణంగా దాని భవితవ్యం అనిశ్చితం అని సామాన్యార్థం. విన్నవెంటనే మనసుకు తోచే అర్థం. ఇక రెండవది – మానవ శరీరంలో ఊపిరి అనే వాయువు ప్రసరిస్తున్నంత వరకు దేదీప్యమానంగా వెలిగే దీపం వంటిది ఈ దేహం. ఊపిరి ప్రసరణం ఆగిపోగానే అదీ ఆగిపోతుంది, ఆరి పోతుంది అనే విశేషమైన భావం! ఈరెండు భావాలు కూడా పద్యంలోని సందర్భానికి సొగసును కూర్చేవే!‘భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులతో కూడిన జీవితం, సందడి అంతా కలలో జరిగేదిగానే భావిస్తాను. జీవం లేని మరబొమ్మ చేసే నాట్యం వంటిది రాజ్యభోగం అనీ, ఐంద్రజాలికుడు వెదజల్లే ధనం వంటిది సంపద అనీ సదా భావించి, ఇహలోకంలో సౌఖ్యం లేదనుకోవడంలోనే సుఖముందని నేను భావిస్తాను!’ అనేది పురూరవుడు నారదుడితో చెప్పిన మాటలకు అర్థం. – భట్టు వెంకటరావు -
జగత్తంతా ఈశ్వరమయం!
ద్వారకలో శ్రీకృష్ణుడు సభలో కొలువుతీరి ఉండగా, ఒకరోజు ఒక బోయవాడు చేతిలో ఉత్తరంతో వచ్చి శ్రీకృష్ణుడి దర్శనాన్ని కోరగా, సేవకులు అతడిని శ్రీకృష్ణుడి సముఖానకు తెచ్చి, వచ్చిన పనియేదో ప్రభువుల వారితో విన్నవించుకోమనగా, ఆ బోయవాడు ‘కుండినపురంలోని భీష్మక మహారాజు సభలో అమాత్యులవారు వ్రాసి ఇచ్చిన వర్తమానాన్ని యేలినవారి సముఖాన పెట్టడానికి రయాన వచ్చాను ప్రభూ!’ అని వివరం చెప్పాడు.‘మహారాజశ్రీ అఖండలక్ష్మీ సమేతులైన శ్రీకృష్ణులవారికి మేము వ్రాసి పంపించే విన్నపము. ఇక్కడి సర్వక్షేమ స్థితిని శ్రీవారికి ఈవరకే తెలిపియుంటిమి. ఇప్పుడు విన్నవించుకొనుట యేమనగా– భీష్మక మహారాజులవారు వారి కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించి, స్వయంవరానికై రాజులందరికీ వర్తమానాలు పంపించారు. ఆ సందర్భంగా శ్రీకృష్ణులవారు కూడా వేంచేయాలని కోరుకుంటూ ఎంతో ఆదరంతో మిమ్ములను ఆహ్వానించమని మాకు ఉత్తరువులను ఇచ్చారు.కనుక స్వామివారు తప్పక విచ్చేయగలరని మా విన్నపము!’ అని ఆ లేఖలోని విషయాన్ని మంత్రివర్యులు చదివి వినిపించగా విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, సభలో కొలువై ఉన్న వారిని ఉద్దేశించి ‘కూతురు పెళ్ళి ఘనంగా చేయాలని ఉత్సాహంతో భీష్మక మహారాజు పంపిన వర్తమానాన్ని విన్నారు కదా! ఆ ఆహ్వానంపై మీ అభిప్రాయాన్ని ఆలోచించి చెబితే బాగుంటుంది. ఆప్తులైన మీరందరూ మేలైనదిగా ఏది అనుకుంటారో, ఆ దారిలో నడుచుకుంటేనే కదా ప్రభువునైన నాకు శుభం చేకూరుతుంది!’ అని అంటాడు. శ్రీకృష్ణుడి మాటలకు సభలోని అందరూ ముగ్ధులై–"నీరజనాభ కార్యముల నిశ్చయమిట్టిదటంచు దెల్పగా నేరుచువారలుం గలరె నీయెదుటన్ సకలాంతరాత్మవై నేరిచినట్టివారలను నేర్వనివారనిపించి దిద్దగానేరిచినట్టి దేవుడవు నీకొకరా యెఱిగించు నేర్పరుల్"‘ఓ పద్మనాభ స్వామీ! జరగవలసిన పనిని గురించి ‘ఇది ఇలా జరిగితే బాగుంటుంది’ అని మీకు చెప్పగలిగినవారు ఉన్నారా? సకలమూ తెలుసునని భావించేవారి చేత కూడా వారికి ఏమీ తెలియదని వొప్పించగలిగే నేర్పు కలిగిన దేవుడవైన మీకు చెప్పగలవారు ఎవరైనా ఈ ముల్లోకాలలోనూ ఉన్నారా?’ అని భక్తితో బదులిచ్చారని కోటేశ్వరకవి రచించిన ‘భోజసుతా పరిణయం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని సన్నివేశంలో రసవత్తరంగా వర్ణించబడింది. ‘సకలాంతరాత్మవు’ అని ఒక్క మాటలో ‘జగత్తులోని ప్రతిదీ ఈశ్వరాంశయే!’ అని చెప్పడం ఇందులో గ్రహించదగినది. – భట్టు వెంకటరావు -
నన్ను చంపడానికి.. అచ్చెన్నాయుడు కుట్ర: ఎమ్మెల్సీ దువ్వాడ
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావును ఆపార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడే హత్య చేయించి, ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని తనపై నెడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మండిపడ్డారు. వెంకటరావు మరణం ధ్రువీకరణ కాక ముందే.. అతని కుటుంబ సభ్యులను ఎలా పరామర్శిస్తారని ప్రశ్నించారు. ఆ వెంటనే వెంకటరావు ఆత్మహత్యకు తానే కారణమని అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్‌లు ఆరోపిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి దువ్వాడ మీడియాతో మాట్లాడారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేని అచ్చెన్నాయుడు ఏడాదిగా తనను చంపేందుకు కుట్ర చేసున్నారన్నారు. తనను చంపడానికి వెంకటరావును అచ్చెన్నాయుడు పావుగా చేసుకున్నారని చెప్పారు. టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావు దాన్ని వెంకటరావు బహిర్గతం చేయడంతో కుట్ర బట్టబయలు అవుతుందని ఆందోళన చెందిన అచ్చెన్నాయుడు ఆయన్ని హత్య చేయించారని ఆరోపించారు. కింజరాపు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు సొంత పంచాయతీ నిమ్మాడలో సర్పంచిగా ఎవరు పోటీ చేసేందుకు ముందుకొచ్చినా వారిని కింజరాపు సోదరులు హత్య చేయిస్తారని ఆరోపించారు. ఇప్పటికే నిమ్మాడలో ఏడుగురిని హత్య చేయించిన రక్తచరిత్ర అచ్చెన్నాయుడు కుటుంబానికి ఉందన్నారు. ఏడాదిన్నర క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో పోటీ చేసేందుకు ముందుకొచ్చిన కింజరాపు అప్పన్నకు తాను మద్దతుగా నిలిచి.. నామినేషన్ వేయించానని చెప్పారు. చదవండి: ఈఎస్ఐ స్కాం చేసిన అచ్చెన్నాయుడు ఛార్జ్ షీట్ వేస్తాడట: కొలుసు పార్థసారధి పలాస నియోజకవర్గం మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త వెంకటరావు మూడ్రోజుల క్రితం కింజరాపు అప్పన్నకు ఫోన్ చేసి.. ‘‘అచ్చెన్నాయుడుకు నువ్వు సమీప బంధువు అవుతావు. అలాంటిది దువ్వాడను నమ్మి అచ్చెన్నాయుడుకు పోటీగా ఎలా నిలబడతావ్. దువ్వాడను ఏడాదిలోగా చంపేస్తాం. అప్పుడు నిన్నెవరు రక్షిస్తారు?’ అంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారని చెప్పారు (ఇందుకు సంబంధించిన ఆడియోను వినిపించారు). దీనిపై ఆందోళన చెందిన అప్పన్న టెక్కలి పోలీసు స్టేషన్లో వెంకటరావుపై ఫిర్యాదు చేశారన్నారు. విచారణలో భాగంగా టెక్కలి పోలీసులు.. మందస పోలీసులతో కలిసి పొత్తంగి గ్రామంలోని వెంకటరావు ఇంటికి వెళ్లారని.. ఆ సమయంలో అతను ఇంట్లో లేరని.. వస్తే టెక్కలి పోలీసు స్టేషన్‌కు రావాలని చెప్పాలని ఆయన భార్యకు పోలీసులు చెప్పి వచ్చారని శ్రీకాకుళం ఎస్పీ సాయంత్రం ప్రకటించారని వివరించారు. వెంకటరావును పోలీసులు బెదిరించిన దాఖలాలే లేవన్నారు. ఔ వెంకటరావు ఎవరో తెలియదు.. పొత్తంగి గ్రామానికి చెందిన వెంకటరావు ఎవరో తనకు తెలియదని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. రెండు దశాబ్దాలుగా కింజరాపు కుటుంబ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నానని.. తనపై 19 కేసులు పెట్టించారని గుర్తు చేశారు. ‘సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు... అందిస్తున్న సుపరిపాలన వల్ల టెక్కలిలో నేను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే తన ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు భయపడుతున్నారు. అందుకే ఏడాదిగా నన్ను చంపడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అందుకు వెంకటరావును పావుగా వాడుకున్నాడు. కింజరాపు అప్పన్నను బెదిరించే క్రమంలో వెంకటరావు మాట్లాడిన మాటల ద్వారా నన్ను హత్య చేయడానికి అచ్చెన్నాయుడు పన్నిన కుట్ర బట్టబయలైంది. ఆ కుట్రకు ఆధారాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వెంకటరావును అచ్చెన్నాయుడే హత్య చేయించి.. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి.. ఆ నెపాన్ని నాపై వేస్తున్నారు’ అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అచ్చెన్నాయుడుపై విచారణ చేయాలి వెంకటరావును హత్య చేయించింది అచ్చెన్నాయుడేనని.. ఆ కోణంలో దర్యాప్తు చేయాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీని దువ్వాడ శ్రీనివాస్ కోరారు. దర్యాప్తులో అచ్చెన్నాయుడు కుట్ర బట్టబయలు కావడం ఖాయమన్నారు. హత్యలు, కుట్రలతో రాజకీయాలు చేసే అచ్చెన్నాయుడిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాశీబుగ్గలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ వ్యక్తి బలవన్మరణం మందస/ కాశీబుగ్గ: మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన కోన వెంకటరావు (38) బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. ఆఖరకు తన పొలంలోని పంపు డ్ వద్ద వెంకటరావు అపస్మారక స్థితిలో పడి ఉండడంతో వెంటనే పలాస ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య కృష్ణకుమారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కోట వెంకటేష్ కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మృతుడు టీడీపీ కార్యకర్త కావడంతో ఈ ఆత్మహత్యపై మంగళవారం హైడ్రామా జరిగింది. పోలీసుల వేధింపు వల్లే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉండగా.. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకే దర్యాప్తు చేశామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎస్పీ ఏమన్నారంటే.. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ విలేకరులతో కాశీబుగ్గలో మాట్లాడారు. వెంకటరావు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని.. రాజకీయాల నేపథ్యంలో పోస్టింగులు చేస్తుంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొందరిపై థ్రెటింగ్ పోస్టులు చేసినట్టు వివరించారు. ఈ పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ చేసేందుకు పోలీసులు సోమవారం వెంకటరావు ఇంటికి వెళ్లారన్నారు. క్రిమినల్ కేసు నమోదు కావడంతో విచారణ కోసం టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు రమ్మని మాత్రమే కోరామని, ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు వెళ్లిన సమయంలో వెంకటరావు ఇంటిలో కూడా లేరని, ఇచ్ఛాపురంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారని వివరించారు. కేవలం ఒత్తిడితోనే వెంకటరావు ఆత్మహత్య చేసుకుని ఉంటారని, ఇందులో పోలీసుల ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. చదవండి: గెలిచింది మేమే.. బుర్ర పనిచేయడం లేదా?: కొడాలి నాని పోలీసులే కారణమంటూ.. వెంకటరావు మృతదేహం పలాస ఆస్పత్రిలో ఉంచడంతో మంగళవారం టీడీపీ నాయకురాలు గౌతు శిరీష తన అనుచరులతో కలిసి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు బెదిరించడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. -
అమ్మా నాన్న లేని బిడ్డ.. అండగా నేనుంటా
నవాబుపేట: అధికారం చాలా మందికి ఉంటుంది... కానీ ఆదుకునే గుణం అందులో కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ ఉంటారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టర్... నవాబుపేటలోని కేజీబీవీకి వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను చూసేందుకు ఆదివారం హాస్టల్‌కు వచ్చిన బంధువులతో ఆయన మాట్లాడారు. చాలామంది తమ పిల్లలకు పండ్లు, ఇతర వస్తువులు తెచ్చామని చెబితే... ఓ అవ్వ మాత్రం తన మనవరాలిని చూసేందుకు వచ్చానని, కట్టుకునేందుకు పాత దుస్తులు తెచ్చానంది. తల్లిదండ్రి లేని తన మనవరాలు ఇక్కడే ఆరోతరగతి చదువుతోందని, అన్నీ తానై చూసుకుంటున్నానని చెప్పి కంటతడిపెట్టింది. అవ్వ మాటలు విన్న కలెక్టర్ చలించిపోయారు. ఆ విద్యార్థినిని పిలిపించి మాట్లాడారు. ‘ఇంటర్ వరకు ఇక్కడే ఉంటది, ఇంకెందుకు బెంగ’అని సముదాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎవరు చూసుకుంటారని ఆ బాలిక కన్నీళ్లు కార్చడంతో కలెక్టర్ కదిలిపోయారు. భవిష్యత్‌లో ఏం చేయాలనుకుంటున్నావని ప్రశ్నించగా, పోలీçసు అధికారి కావాలని ఉందని బాలిక సమాధానం చెప్పింది. దీంతో కలెక్టర్ ఆ చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానన్నారు. కలెక్టర్ దత్తత తీసుకున్నట్టు ప్రకటించిన ఆ విద్యార్థిని మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కూచూర్‌కు చెందిన వైష్ణవి. తల్లిదండ్రులు మల్లేష్, అలివేలు గతంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ లక్ష్మమ్మ, తాత రాంచంద్రయ్య చూసుకుంటున్నారు. -
‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకమని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం కావడం దళితుల అదృష్టమని అన్నారు. ఆయన లాంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన మార్పును సీఎం జగన్ ఆచరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా ఉండకూడదని, పెద్ద పారిశ్రామిక వేత్తలగా చూడాలని సీఎం అనడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. చదవండి: రైతులకు శుభవార్త: రూ. 113.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ‘ఎస్సీ, ఎస్టీల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం జగనన్న వైఎస్సార్ బడుగు వికాసానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఈ రోజు మేము ధైర్యంగా ప్రరిశ్రమల స్థాపనలో ముందుకువెళతాము. స్కిల్ డెవలప్మెంట్తో ఎన్నో సౌకర్యాలు దీనిలో ఉన్నాయి. మొత్తం రాయతీలతో, ఇండస్ట్రీయల్ పార్క్‌లో మాకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామం. అందుకే మేమంతా ముఖ్యమంత్రిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజకీయ వ్యవస్థలో జగన్ ఆలోచన ఓ కలికితురాయి. రాజకీయాల్లో దళితులను దూరంగా పెట్టిన వారు ఇప్పుడు మళ్లీ వారిని మోసం చేసేందుకు వస్తున్నారు. సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు.’ అని మ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చదవండి: ఏపీ: మద్యం ప్రియులకు మరో షాక్ పండుగ రోజు సీఎం వైఎస్ జగన్ దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. అదే విధంగా ‘ఇదొక శుభపరిణామం. ఈ పాలసీని చూస్తే దళితులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎస్సీ, ఎస్టీల ఇంసెంటివ్‌లు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుది. ఆ 1100 కోట్ల బకాయిలను చెల్లించిన ఘనత జగన్‌ది. జగన్ వల్ల మా బతుకులు మారతాయని భావించిన వారి నమ్మకం నిజమైంది. ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము కానివ్వరు.’ అని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. -
త్వరలోనే వైశ్య కార్పొరేషన్‌ను ప్రవేశ పెడతాం: మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రస్ట్ వాసవి మాతకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ జనరేషన్ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే వైశ్య కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టనున్నారని ఆయన వెల్లడించారు. రాజధానిని గొప్పగా నిర్మించామని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి సచివాలయం, హైకోర్టులలో వర్షాలు పడితే నీరు వచ్చే పరిస్థితి ఉందని మంత్రి విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం అయిదేళ్లుగా గత ప్రభుత్వం పోట్టి శ్రీరాములు జయంతిని నిర్విర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా క్రిష్టియానిటి వస్తుందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, తిరుపతి కొండపై శిలువ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇంటిలో పని చేసే పిల్లలను సైతం ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియానని సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కులం, పార్టీ, మతాలకు అతీతంగా పాలన చేయాలంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని మంత్రి పేర్కొన్నారు. -
డాట్స్ చికిత్సతో పూర్తి స్వస్థత
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంటు సూపర్వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు. -
డాట్స్ చికిత్సతో పూరిర్తి స్వస్థత
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంటు సూపర్వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు. -
ఇన్ఫార్మర్ నెపంతో వ్యక్తి దారుణ హత్య
సాలూరు: విజయనగరం జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు అత్యంత దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన సాలూరు ఏజెన్సీలోని దొరలతాడివలస ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో జాకరవలసకు చెందిన కూతూడి వెంకట్రావు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. -
'నా భర్తను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు'
ప్రకాశం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వ్యవహారం మరువక ముందే మరో వివాదం తెరలేసింది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ వెంకట్రావును కిడ్నాప్ చేశారని ఆయన భార్య మేరీ ఫిర్యాదు చేసింది. అధికార టీడీపీ వర్గమే తన భర్త కిడ్నాప్ నకు కారణమని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెంకట్రావు వినమననెల్లూరు నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. తన భర్తకు ఇంటికి తీసుకు రావాలని మేరీ పోలీసులను కోరింది. -
అతడిపై పది కేసులు..!
5న ఔటర్‌పై ప్రమాదంలో మృతి ఆ వ్యక్తిపై 10 కేసులున్నట్లు పోలీసుల వెల్లడి చీటింగ్, యువతులను నమ్మించి పెళ్లి చేసుకోవడం వెంకట్రావు ప్రవృత్తి.. శంషాబాద్ రూరల్: పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడం.. ఆ తర్వాత మోసం చేయడం అతని ప్రవృత్తి.. ఈ నెల 5న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అతని పూర్తి వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడిం చారు. సీఐ ఉమామహేశ్వర్రావు తెలిపిన వివరాలు .. ప్రకాశం జిల్లా కొండేపి మండలం దాసరిపాలెంకు చెందిన గుడిపాటి వెంకట్రావు(36) అలియాస్ చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్ చందుకు 18 ఏళ్ల కిందట తన అక్క రమణమ్మ కూతురు మంగమ్మతో పెళ్లి జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు. 11 ఏళ్ల కిందట భార్యా,పిల్లలను వదిలేసి వచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన వెంకట్రావు డబ్బున్న వారితో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపారంలో భాగస్వాములు కావాలని చెప్పి వారి నుంచి డబ్బులు కాజేయడం హాబీగా పెట్టుకున్నాడు. అంతేకాదు పేదింటి యువతులను మాయ మాటలతో తన వలలో వేసుకునేవాడు. యువతి కుటుంబాన్ని తీసుకుని తీర్థ యాత్రలకు వెళ్లి వారికి తనపై మంచి అభిప్రాయం ఏర్పడేలా నమ్మిస్తాడు. తర్వాత యువతిని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సంసారం సాగిస్తాడు. తర్వాత మరో యువతిని వలలో వేసుకుంటాడు. ఇలా యువతులను ప్రలోభపెట్టి వ ంచించడం వంటి 10 కేసుల్లో వెంకట్రావు నిందితుడు. ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, కడప, గుంటూరు ప్రాంతాల్లో ఇతనిపై కేసులు ఉన్నాయి. 2005లో ఒంగోలులో మొదటి సారి ఇతనిపై కేసు నమోదయింది. పోలీసుల కళ్లుగప్పి.. ఓ కేసులో ఈ ఏడాది జూలై 1న కడప సెంట్రల్ జైలు నుంచి ఇతన్ని ఒంగోలు కోర్టుకు తీసుకెళ్తున్నారు. కడప బస్టాప్‌లో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటనలో నలుగురు ఆర్మ్డ్ రిజర్వు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సంజీవ రావు, తులసి దంపతులను ఓ సారి బస్సులో ప్రయాణిస్తూ పరిచయం చేసుకున్నాడు. రాజమండ్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యం కావాలని, అందుకు డబ్బులు తీసుకుని రావాలని ఈ ఏడాది సెప్టెంబరు 18న ఈ దంపతులను అక్కడికి రప్పించాడు. అక్కడ వారిని బెదిరించి తులసి వద్ద బంగారు నగలు, వారి షిఫ్ట్ కారు ఏపీ 04- ఏఆర్ 9015( ఔటర్‌పై ప్రమాదానికి గురైన కారు)ను లాక్కున్నాడు. దీంతో తులసి రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు అయింది. ప్రమాదానికి ముందు.. ఔటర్‌పై జరిగిన ప్రమాదానికి ముందు ఇతను ఓ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి తనతో పెట్టుకున్నాడు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రాంతంలోని తిరుపతమ్మ ఆలయం వద్ద ఉండే ఉపాధ్యాయుడు నాగేశ్వర్రావుకు కొన్ని గదులు ఉన్నాయి. వెంకట్రావు ఈ ఆలయానికి తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో అతను నాగేశ్వర్రావుకు చెందిన గదుల్లో అద్దెకు ఉండేవాడు. అతనితో పరిచయం పెంచుకున్న వెంకట్రావు షిరిడి టూర్ ప్లాన్ చేశాడు. సంజీవరావు నుంచి లాక్కున్న షిఫ్ట్ కారు నంబరును ఏపీ 20-ఏఆర్ 5959గా మార్చాడు. నాగేశ్వర్రావుతో పాటు అతని భార్య సురేఖ, కూతురు సుశ్వేత, మేన కోడలు రత్నకుమారి, తనతో ఉండే యువతిని తీసుకుని వెంకట్రావు ఈ నెల 2న ఇదే కారులో షిరిడి వెళ్లాడు. అక్కడి నుంచి 4న తిరుగు ప్రయాణంలో పెనుగంచిప్రోలు వెళ్లడానికి శంషాబాద్‌లోని ఔటర్ మీదుగా వస్తున్నారు. 5న తెల్లవారుజామున పెద్దగోల్కొండ వద్ద ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొంది. డ్రైవింగ్ చేస్తున్న వెంకట్రావు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు మృతుడి వివరాలను సేకరించారు. ఈ నెల 6న అతని మృతదేహాన్ని అక్క రమణమ్మకు అప్పగించారు. అనంతరం దర్యాప్తు జరపగా కడప జైలులోని రికార్డుల్లో నమోదైన ఆనవాళ్ల ఆధారంగా మృతదేహం వెంకట్రావుదని నిర్ధారించారు. -
అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్‌లో అంతర్మథనం కొనసాగుతోంది. జిల్లాలో పోలింగ్ సరళిపై టీ పీసీసీ ఆరా తీసింది. ఎన్ని స్థానాల్లో గెలుపు అవకాశాలున్నాయనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రావు, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జగన్నాథంతోపాటు, జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని జిల్లా నాయకులు టీ పీసీసీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ అనుకూల పవనాల నేపథ్యంలో తమ గెలుపు ఖాయమని చెబుతున్నారు. వ్యతిరేకులపై చర్యలు తీసుకోండి.. సార్వత్రిక ఎన్నికల్లో కొందరు నాయకులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని అభ్యర్థులు టీ పీసీసీ ముఖ్య నాయకులకు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏపీపీఎస్సీ మాజీ డెరైక్టర్ రవీందర్రావు, కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన భరత్‌చౌహాన్‌లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా హరినాయక్ టీ పీసీసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారని హరినాయక్ పొన్నాల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని పొన్నాల స్పష్టం చేశారు. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ప్రాదేశిక, మున్సిపల్ ఎన్నికలపై.. మున్సిపాలిటీలు, ప్రాదేశిక ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చకొచ్చింది. అన్ని మున్సిపాలిటీల చైర్మన్ స్థానాలతోపాటు, ఎలాగైనా జెడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని టీపీసీసీ నేతలు జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశారు. -
ఎంపీడీఓల బదిలీలు?
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జిల్లాలోని 45మంది మండల పరిషత్ అభివృద్ధి (ఎంపీడీఓ) అధికారులకు స్థాన చలనం కలగనుంది. సొంత జిల్లాతోపాటు మూడు సంవత్సరాలకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న మండలస్థాయి అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీరందరికీ స్థానం చలనం తప్పడం లేదు. జిల్లా నుంచి వేరే జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ నెల పదో తేదీ వరకు బదిలీలు చేయాలని ఆదేశించడంతో ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికార యంత్రాంగం తలమునలైంది. ఇప్పటికే సొంత జిల్లాకు చెందిన వారితోపాటు మూడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న అధికారుల జాబితాను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రావు బుధవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రెండు మూడు రోజుల్లో బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు. ఏవైనా మూడు జిల్లాలకు బదిలీ కోరుకునే అవకాశం ఎంపీడీఓలకు ఏవైనా మూడు జిల్లాలకు బదిలీని కోరుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ఎంపీడీఓలు కోరుకున్న జిల్లాల పేర్ల జాబితాను కూడా నివేదించారు. జిల్లాలో మొత్తం 59 మండల పరిషత్‌లకు గాను పది మండల పరిషత్‌లకు ఇన్చార్జి ఎంపీడీఓలు కొనసాగుతుండగా, 49 మంది మాత్రమే పూర్తిస్థాయి మండల పరిషత్ అధికారులు ఉన్నారు. వీరిలో 33 మంది సొంత జిల్లాకు చెందిన వారు కాగా 12 మంది ఇతర జిల్లాలకు చెందినవారున్నారు. వీరందరూ మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్నారు. దీంతో మొత్తం 45 మంది ఎంపీడీఓలు ఇతర జిల్లాలకు బదిలీలు కానున్నారు. యాదగిరిగుట్ట, మేళ్లచెర్వు, రాజాపేట, మర్రిగూడ మండలాల్లో పనిచేస్తున్న వారు ఇతర జిల్లాల అధికారులైనప్పటికీ మూడేళ్లు పూర్తికాని కారణంగా బదిలీ కావడం లేదు. ఇన్‌చార్జ్‌లకు కూడా స్థానచలనం జిల్లాలోని పది మండల పరిషత్‌లకు ఈఓఆర్డీలు, కార్యాలయ సూపరింటెండెంట్లు.. ఇన్చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. నాంపల్లి, చింతపల్లి, చందంపేట, నిడమనూరు, గుండాల మండలాలకు ఈఓఆర్డీలు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా అనుముల, చండూరు, నూతన్‌కల్, డిండి, పెన్పహడ్ మండల పరిషత్‌లకు కార్యాలయ సూపరింటెండెంట్లు ఇన్చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. వీరందరూ మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలోని ఇతర మండలాలకు బదిలీ చేయనున్నారు. వీరు ఏంపీడీఓలుగా కాకుండా ఈఓఆర్డీ, కార్యాలయ సూపరింటెండెంట్లుగానే బదిలీ కానున్నారు. ఈ మండలాలకు ఇతర జిల్లాలనుంచి వచ్చే వారిని నియమించనున్నారు.