డాట్స్ చికిత్సతో పూర్తి స్వస్థత
Published Mon, Oct 31 2016 6:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్‌లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు.
హెచ్‌ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్‌ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్‌మెంటు సూపర్‌వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement