dots
-
బీఎస్ఎన్ఎల్- ఐటీఐ పైలట్‌కు ప్రభుత్వ నిధులు
న్యూఢిల్లీ: 4జీ, 5జీ, ఈ-బ్యాండ్ స్పెక్ట్రమ్ సర్వీసులకు కావాల్సిన సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేసేందుకు బీఎస్ఎన్ఎల్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) తలపెట్టిన పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. టీసీఎస్-తేజస్ నెట్‌వర్క్‌ల సహకారంతో తొలిసారిగా మేడ్–ఇన్–ఇండియా 4జీ, 5జీ టెలికం నెట్వర్క్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ టెలికం పరిశోధన సంస్థ సీ-డాట్ కూడా పాల్గొంటోంది. ఒక్కో పైలట్ ప్రాజెక్టుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ రూ.10 కోట్లు అందిస్తోంది. -
ఎంత జాగ్రత్తపడ్డా.. అడ్డంగా దొరికిపోతారు.. ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి?
Machine Identification Code: దగ్గరున్న ప్రింటర్లోనో, ఏదో ఇంటర్నెట్ సెంటర్లోనో ఓ తప్పుడు కలర్ డాక్యుమెంట్‌ను ప్రింట్ చేశారు. ఎప్పుడో పాత తేదీని పెట్టుకున్నారు, పేర్లు మార్చారు. తీసుకెళ్లి ఏదో ధ్రువీకరణ కింద చూపించారు. కానీ ఎంత జాగ్రత్తపడ్డా.. ఎక్కడా లేశమాత్రం తేడా లేకుండా డాక్యుమెంట్‌ను ప్రింట్ చేసినా.. అడ్డంగా దొరికిపోయారు. దీనికి కారణం.. యెల్లో డాట్స్ (పసుపు రంగు చుక్కలు). ఏమిటీ యెల్లో డాట్స్? ఎక్కడుంటాయి? వాటితో లాభమేంటో తెలుసుకుందామా? ప్రింటర్లు నిఘా పెట్టినట్టా? వివిధ గుర్తింపుకార్డుల నుంచి ఇళ్లపత్రాలు, దొంగనోట్ల దాకా.. అక్రమార్కులు అన్నింటిలోనూ నకిలీలను, ఫోర్జరీ డాక్యుమెంట్లను తయారు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు అసలు వాటికి, తప్పుడు పత్రాలకు తేడాను గుర్తించడం చాలా కష్టం కూడా. దీనికి చెక్ పెట్టేందుకే జపాన్‌లో పరిశోధకులు/అధికారులు కలిసి ‘యెల్లో డాట్స్’ను రంగంలోకి తెచ్చారు. ప్రింట్ చేసే ప్రతి పేజీలో.. లేజర్ కలర్ ప్రింటర్లు ప్రతిపేజీలో.. మనం గమనించలేనంత సూక్ష్మంగా, అంటే మిల్లీమీటర్లో పదో వంతు పరిమాణంలో ‘పసుపు రంగు’ చుక్కలను ముద్రిస్తాయి. పేజీలో కాస్త దూరం దూరంగా.. నిర్దిష్ట ఆకృతులు వచ్చేలా ఈ చుక్కలు ఉంటాయి. (ఉదాహరణకు బ్రెయిలీ లిపి మాదిరిగా అనుకోవచ్చు). సదరు ప్రింటర్ కంపెనీ, మోడల్, సీరియల్ నంబర్, సదరు పేజీని ప్రింట్ చేసిన తేదీ, సమయం వివరాలు ఆ ఆకృతుల్లో ఉంటాయి. దీన్ని ‘ప్రింటర్ స్టెగనోగ్రఫీ’ అని పిలుస్తున్నారు. పసుపు రంగే ఎందుకు? సాధారణంగా ఎరుపు, నీలం, నలుపు వంటి రంగులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి, అదే పసుపు రంగును, అందులోనూ లేతగా ఉంటే గుర్తించడం కష్టం. అందుకే శాస్త్రవేత్తలు ఈ రంగును ఎంచుకున్నారు. మనం ప్రింట్ చేసే కాగితాలపై అత్యంత సూక్ష్మంగా, దూరం దూరంగా పసుపు రంగు చుక్కలు ఉంటే.. సాధారణ కంటితో గుర్తించడం దాదాపు సాధ్యం కాదు కూడా. చదవండి: చార్మినార్ చెక్కుచెదరకుండా.. పిడుగుపాటుకు గురికాకుండా లైటనింగ్ కండక్టర్ వివరాలను ఎలా గుర్తిస్తారు? పేజీల్లో ప్రింట్ అయ్యే పసుపు చుక్కల ప్యాటర్న్ (ఆకృతుల)ను గుర్తించేందుకు ‘ఈఎఫ్ఎఫ్ (ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్) ఆన్లైన్ డీకోడర్ల’ను వినియోగిస్తుంటారు. అందులో తేదీ, సమయం వివరాలు సులువు గానే తెలిసిపోతాయి. ఇక ప్రింటర్ మోడల్, సీరియల్ నంబర్ ఆధారంగా.. సదరు ప్రింటర్ కంపెనీ నుంచి వివరాలు తీసుకుంటారు. అధికారులు ఆ ప్రింటర్‌ను ఎవరు కొన్నారు, ఎక్కడ వినియోగిస్తున్నారనేది ట్రేస్ చేసి.. తప్పుడు డాక్యుమెంట్ మొత్తం చరిత్రను బయటికి తీస్తారు. ఇంకేం.. దొంగలు దొరికిపోయినట్టే. ఎప్పటి నుంచో ఉన్నా రహస్యమే.. 2017లో అమెరికాలో ఓ రహస్య పత్రం లీకైంది. దానిపై అక్కడి జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ చేపట్టి.. లీకేజీకి కారణమైన ఓ ప్రభుత్వ కాంట్రాక్టర్‌ను గుర్తించి, అరెస్టు చేసింది. లీకైన పత్రాల కాపీలపై ఉన్న ఎల్లో డాట్స్ ఆధారంగానే ఆ కాంట్రాక్టర్‌ను పట్టేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ అంశాన్ని రహస్యంగా ఉంచే ఉద్దేశంతో అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. చదవండి: 60 శాతం బస్సులు మేడారానికే.. హైదరాబాద్ పరిస్థితేంటి? ► అయితే నకిలీలు, తప్పుడు పత్రాలను గుర్తించడం, ట్రాక్ చేయడంలో భాగంగా.. ఇలా ‘ఎల్లో డాట్స్’ను ముద్రించేలా కొన్ని పెద్ద ప్రింటర్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్టు అమెరికా నిఘా సంస్థలు అంగీకరించడం గమనార్హం. ►ఈ ఎల్లో డాట్స్ ఆకృతుల్లోని సమాచారం ఏమిటని గుర్తించే కోడ్.. అటు ప్రభుత్వం, ఇటు ప్రింటర్ కంపెనీలఉన్నతాధికారులకు మాత్రమే తెలిసి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆ చుక్కలను మనమూ చూడొచ్చు భూతద్దాలు వంటి వాటిని ఉపయోగించి పేజీలను పరిశీలిస్తే.. అతి చిన్నగా ఉండే ఈ పసుపు రంగు చుక్కలను గుర్తించవచ్చు. ఇంకా సులువుగా మొత్తం చుక్కలను చూడాలనుకుంటే.. పూర్తి చీకటిలో నీలి రంగు కాంతిని సదరు పేజీపై ప్రసరింపజేయాలని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల సదరు పసుపు రంగు చుక్కలు.. నల్లటి చుక్కల్లా కనిపిస్తాయని వివరిస్తున్నారు. ► కానన్, ఎప్సన్, డెల్, హ్యులెట్ ప్యాకర్డ్, ఐబీఎం, కొనికా, పానసొనిక్, జిరాక్స్, సామ్సంగ్ వంటి చాలా వరకు ప్రింటర్ తయారీ కంపెనీలు ‘ఎల్లో డాట్స్’ టెక్నాలజీని అమలు చేస్తున్నాయని ఈఎఫ్ఎఫ్ సంస్థ పేర్కొంది. ఏయే కంపెనీలకు చెందిన ఏ ప్రింటర్లలో దీనికి వాడుతున్నరన్న జాబితాలను తమ వెబ్సైట్లో కూడా పెట్టింది. బ్లాక్ అండ్ వైట్‌లో కష్టమే.. ఈ ఎల్లో డాట్స్ టెక్నాలజీ కేవలం కలర్ ప్రింటర్లకే పరిమితం. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లలో కేవలం నలుపు రంగును మాత్రమే ప్రింట్ అవుతుంది. ఆ చుక్కలు సులువుగా కనిపిస్తాయి. సదరు డాక్యుమెంట్‌లోని అక్షరాలు, ఫొటోలు, ఇతర అంశాలు ఈ చుక్కలపై ఎఫెక్ట్ చూపించడంతో.. రహస్య కోడ్ దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
టెల్కోలకు సుప్రీం షాక్
న్యూఢిల్లీ: టెల్కోల రాబడి (ఏజీఆర్) నిర్వచనం, కేంద్రానికి చెల్లించాల్సిన లైసెన్సు ఫీజులపై టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఏజీఆర్‌కు సంబంధించి టెలికం శాఖ (డాట్) నిర్వచనం సరైనదేనని స్పష్టం చేసింది. టెల్కోల నుంచి రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి డాట్‌కు అనుమతిచ్చింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని త్రిసభ్య బెంచ్ గురువారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘ఏజీఆర్ నిర్వచనం సరైనదేనని న్యాయస్థానం భావిస్తోంది. డాట్ అప్పీలును సమర్ధిస్తూ, లైసెన్సీల (టెల్కోలు) పిటిషన్‌ను కొట్టివేయడం జరిగింది‘ అని పేర్కొంది. టెలికం కంపెనీల మిగతా అభ్యర్ధనలను కూడా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. దీనిపై తదుపరి వాదనలేవీ ఉండబోవని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు .. నిర్దేశిత గడువులోగా జరిమానాలు, వడ్డీతో కలిపి డాట్‌కు బకాయిలన్నీ కట్టాలని ఆదేశించింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. వివాదం ఇదీ.. కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. 1.4 లక్షల కోట్లపైనే భారం జరిమానాలు, వడ్డీల్లాంటివన్నీ కలిపితే.. సవరించిన ఆదాయాల ప్రకారం టెలికం ఆపరేటర్లు కట్టాల్సిన బకాయిలు ఏకంగా రూ. 1.4 లక్షల కోట్ల పైగా ఉంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ‘టెల్కోలు కట్టాల్సిన బకాయిలను మళ్లీ లెక్కిస్తే సుమారు రూ. 1.34 లక్షల కోట్లకు చేరుతుంది. మరో త్రైమాసికం లెక్కలు కూడా జోడిస్తే.. ఇది ఇంకో 4–5 శాతం పెరగవచ్చు‘ అని పేర్కొన్నాయి. 10 రోజుల్లో అందరు ఆపరేటర్స్‌కి డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అవి అందిన 15 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్త లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలన్నీ కలిపి భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్–ఐడియా రూ. 40,000 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని అంచనా. జియో కేవలం రూ. 14 కోట్లు కట్టాల్సి రావచ్చు. వొడాఐడియా షేరు కుదేల్.. లైసెన్సు ఫీజుపై సుప్రీం కోర్టు ప్రతికూల ఆదేశాలతో గురువారం వొడాఫోన్ ఐడియా షేరు ఇంట్రాడేలో ఏకంగా 27 శాతం క్రాష్ అయ్యింది. బీఎస్ఈలో ఒక దశలో రూ. 4.10 (52 వారాల కనిష్ట స్థాయి)కి పడిపోయింది. చివరికి కొంత కోలుకుని 23 శాతం నష్టంతో రూ. 4.33 వద్ద క్లోజయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,793 కోట్ల మేర హరించుకుపోయి.. రూ. 12,442 కోట్లకు పరిమితమైంది. మరోవైపు, భారతి ఎయిర్టెల్ కూడా ఇంట్రాడేలో సుమారు 10 శాతం క్షీణించి రూ. 325.60కి పడిపోయినప్పటికీ.. తర్వాత కోలుకుని 3.31 శాతం లాభంతో రూ. 372.45 వద్ద క్లోజయ్యింది. కేంద్రం పునఃసమీక్షించాలి: టెల్కోలు ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కుదేలవుతున్న టెలికం పరిశ్రమను తాజా తీర్పు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తుందని వొడాఫోన్ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. రివ్యూ పిటిషన్ అవకాశాలపై న్యాయనిపుణులను సంప్రతిస్తామని పేర్కొంది. టెల్కోలపై తీర్పు పెనుభారం మోపుతుందని, కేంద్రం దీన్ని పునఃసమీక్షించాలని ఎయిర్టెల్ తెలిపింది. తీవ్రంగా నిరాశపర్చింది: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఏఐ) వ్యాఖ్యానించింది. దాదాపు రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు రుణభారంతో కుంగుతున్న టెలికం పరిశ్రమకు ఇది గొడ్డలిపెట్టులాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. -
10 వేల చుక్కల ముగ్గు..!
సాక్షి, చిత్తూరు అర్బన్: ముగ్గులు మన సంప్రదాయ చిహ్నాలకు గుర్తులు. చిన్న పిల్లల నుంచి ప్రతీ ఒక్క మహిళ ముగ్గులు వేస్తుంటారు. చిత్తూరు నగరం దుర్గానగర్ కాలనీకు చెందిన సవిత అనే గృహిణి మాత్రం ముగ్గులు వేయడంలో రికార్డులు సృష్టిస్తుంటారు. గత 20 ఏళ్లుగా ముగ్గుల్లో ఉన్న అన్ని కోణాలను విశ్లేషించిన ఈవిడ కొత్తగా ఏదైనా రికార్డు సృష్టించాలనుకున్నారు. శనివారం చిత్తూరు నగరంలోని కట్టమంచిలో ఉన్న కళ్యాణ మండపం ఆవరణలో ఏకంగా 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 వేల చుక్కలతో ముగ్గువేసి సరికొత్త రికార్డు సృష్టించారు. సవిత ఒక్కటే ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గు వేయడం అక్కడున్న ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ముగ్గు మధ్యలో ప్రకృతిని కాపాడాలంటూ ఓ సందేశాన్ని సైతం ఇచ్చారు. ఆమె ముగ్గు వేస్తున్నంతసేపు అక్కడే ఉన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి శ్రీనివాసులు సవితను మెచ్చుకుంటూ తమ పుస్తకంలో ఆమెకు స్థానం లభించినట్లు పేర్కొన్నారు. ముగ్గు పూర్తయిన తరువాత సవితకు ధృవీకరణ పత్రం అందచేశారు. -
డాట్స్ చికిత్సతో పూర్తి స్వస్థత
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంటు సూపర్వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు. -
డాట్స్ చికిత్సతో పూరిర్తి స్వస్థత
తాడేపల్లిగూడెం: డాట్స్ చికిత్సతతో టీబి రోగులకు పూర్తిస్వస్ధత చేకూరుతుందని జిల్లా క్షయనివారణాధికారి డాక్టర్ వి.వెంకట్రావు అన్నారు. సోమవారం ఆయన ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ల్యాబ్‌లో కళ్లె పరీక్ష నిర్వహణను పరిశీలించారు. మైక్రోస్కోపిక్ సెంటర్లో రికార్డులను. రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. డాట్‌సెంటర్ ద్వారా చికిత్సపొందుతున్న రోగుల వివరాలను, వారికి అందుతున్న సేవలను అడిగితెలుసుకున్నారు. హెచ్ఐవి సోకిన వ్యక్తుల్లో క్షయ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువన్నారు. హెచ్ఐవి సోకిన వారు విధిగా క్షయ పరీక్ష చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయ్యితే ఏఆర్‌టీతో పాటు టీబి నియంత్రణకు డాట్స్ చికిత్స కూడా తీసుకొని పోషకాహారం క్రమబద్దీకరణలో వైద్యుల సూచనలు పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ వి.సుజాత, మొబైల్ టీం ఆరోగ్య విస్తరణాధికారి ఎస్.శ్రీనివాసమూర్తి, వెంకట్రామన్నగూడెం టీబి యూనిట్ సీనియర్ ట్రీట్మెంటు సూపర్వైజర్ కె.లక్ష్మీనారాయణ, సీహెచ్..జోషి, కె.అనూరాధ తదితరులు ఉన్నారు. -
ఆమె ఓ ‘పబ్లిక్ ఎనిమీ’
సంక్షిప్తంగా... బోనీ ఎలిజబెత్ పార్కర్ ‘‘సూర్య కిరణాలు సోకి, మంచు బిందువులు తాకి పూలలో మకరందం ఊరిన విధంగా, నీ వంటి వారి వల్ల ఈ ప్రపంచం మరింత మధురం, తేజోమయం అయింది’’. బోనీ ఎలిజిబెత్ పార్కర్ సమాధిపై చెక్కి వున్న అక్షరాలివి. ఎవరీ ఎలిజబెత్ పార్కర్? రాజవంశీయురాలా? రాజనీతిజ్ఞురాలా? సంఘ సేవకురాలా? సంస్కర్తా? మత ప్రవక్తా? ఎవరు? ఎవరూ కాదు. ఒక గ్యాంగ్‌స్టర్. దొంగల ముఠా సభ్యురాలు! సరిగ్గా ఎనభై ఏళ్ల క్రితం ఇదే రోజున అమెరికన్ పోలీసులు ఎట్టకేలకు ఆమెను, ఆమె సహచరుడు క్లైడ్ ఛెస్ట్నట్ బారోను చుట్టుముట్టి తుపాకీతో కాల్చి చంపారు. అమెరికాలోని డాలస్ ప్రాంతం నుంచి ‘ఎదిగి’, ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం సమయంలో రకరకాల దోపిడీలతో మధ్య అమెరికా రాష్ట్రాలను గడగడలాడించిన ఎలిజబెత్.. నేలకు ఒరిగిందన్న వార్త వినగానే బ్యాంకులు, సూపర్ మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ‘థ్యాంక్ గాడ్’ అనుకుంది. 1931-1934 మధ్య ఎలిజబెత్, ఆమె సభ్యురాలిగా ఉన్న ముఠా కలిసి కనీసం తొమ్మిదిమంది పోలీసు ఆఫీసర్లను చంపి ఉంటారు. ముఠాను ప్రతిఘటించిన కొందరు పౌరులు కూడా ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ ఘటనల తర్వాత ఎలిజబెత్‌ను, ఆమె సహచరుడు క్లైడ్ బారోను అమెరికన్ ప్రభుత్వం ‘పబ్లిక్ ఎనిమీ’గా ప్రకటించింది. చివరికి లూసియానాలో ఎలిజబెత్ శకం ముగిసింది. ఆమె చనిపోయాక మీడియాలో ఆమెపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. డిటెక్టెవ్ కథలూ వచ్చాయి. 1967లో ‘బోనీ అండ్ క్లైడ్’ అనే సినిమా కూడా వచ్చింది. పోలీసులు వెంటాడుతున్నప్పుడు ఎలిజబెత్ చకచకా మకాం మార్చేసేవారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు ఆమెకు బదులుగా, ఆమె ఫొటోలు దొరికేవి. ఆ ఫొటోల ఆధారంగా వార్తా పత్రికలు కథనాలను అల్లేవి. మెషిన్‌గన్‌ను ఆమె అలవోకగా ఆపరేట్ చేసేదనీ, క్యామెల్ బ్రాండు సిగరెట్లను ఇష్టంగా తాగేదనీ; ఎలిజబెత్, క్లైడ్ల మధ్య దాంపత్యానికి ఏమాత్రం తక్కువ కాని సాన్నిహిత్యం ఉండేదనీ... ఇలా ఎన్నెన్నో. ఇవన్నీ అలా ఉంచితే ఎలిజబెత్ పార్కర్ స్వభావసిద్ధంగా మంచి అమ్మాయి అనేవారూ ఉన్నారు. బహుశా వారే, ఎలిజబెత్ సమాధిపై ఆమె గురించి నాలుగు మంచి ముక్కలు చెక్కించి ఉండొచ్చు. బోనీ ఎలిజబెత్ పార్కర్ 1910 అక్టోబర్ 1న టెక్సాస్‌లోని రొవెనాలో జన్మించారు. ముగ్గురు పిల్లల్లో రెండోది. తండ్రి తాపీ మేస్త్రీ. ఎలిజబెత్‌కు నాలుగేళ్లున్నప్పుడు ఆయన చనిపోయాడు. దాంతో తల్లి ఎమ్మా క్రాస్ పిల్లల్ని తీసుకుని డాలస్ శివారు ప్రాంతం సెమెంట్ సిటీలో ఉన్న పుట్టింటికి చేరుకుంది. కుటుంబాన్ని పోషించడానికి కుట్టుపనిలో కుదురుకుంది. ఎలిజబెత్ తెలివైన అమ్మాయి. హైస్కూల్లో అన్నిటా తనే ఫస్ట్. స్పెల్లింగ్, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్.. ప్రతిదాంట్లోనూ ప్రథమ బహుమతే! ఎలిజబెత్ చక్కటి కవిత్వం కూడా రాసేది. స్కూల్లో చేరిన రెండో సంవత్సరం ఆమెకు రాయ్ థార్టాన్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ స్కూల్ మానేసి 1926 సెప్టెంబర్ 25న పెళ్లి చేసుకున్నారు. ఎలిజబెత్‌కు అప్పటికి పూర్తిగా పదహారేళ్లు కూడా లేవు. తర్వాత మూడేళ్లకు అభిప్రాయభేదాల వల్ల ఇద్దరూ విడిపోయారు. అలాగని విడాకులు కూడా తీసుకోలేదు. ఎలిజబెత్ అయితే థార్టాన్ తనకు తొడిగిన ఉంగరాన్ని జీవితాంతం అలాగే ఉంచుకున్నారు. విడాకులు తీసుకున్నాక ఆమె కొంతకాలం ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఆమె జీవితం మలుపు తిరిగింది. క్లైడ్ బారోతో పరిచయం అయింది. పరిచయం ప్రేమ అయింది. ఆ ప్రేమే ఆమెను క్లైడ్ నేర ప్రపంచంలోకి లాక్కెళ్లింది. 1929 నాటి ఎలిజబెత్ డైరీలను బట్టి ఆమె ఎంతో సున్నిత మనస్కురాలని తెలుస్తోంది. తన ఒంటరితనం గురించి, డాలస్‌లో అసహనంగా గడిచిన జీవితం గురించి ఎంతో ఆవేదనగా రాసుకున్నారు ఎలిజబెత్. అలాగే ఫొటో తియ్యడమంటే తనకున్న ఇష్టం గురించి కూడా.